E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode October 23rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ, భ్రమరాంబ కలిసి సుభాష్‌ను చంపేస్తారా..?  

Brahmamudi Serial Today Episode October 23rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ, భ్రమరాంబ కలిసి సుభాష్‌ను చంపేస్తారా..?  
Advertisement

Brahmamudi serial today Episode: ప్రశాంతకు రాజు క్లాస్‌ పీకుతుంటే.. వెంకీ వెళ్తాడు. తమ కంపెనీలో ఏదో ప్రాడ్‌ జరుగుతుందని చెప్తాడు. అందుకు రాజు మీ కంపెనీలో ప్రాడ్‌ జరిగితే నన్నేం చేయమంటావురా అంటాడు రాజు. ఆ ప్రాడ్‌లో ఐశ్వర్య కంపెనీకి కూడా బాగం ఉందనిపిస్తుంది అంటూ వెంకీ చెప్పగానే.. ఏమంటున్నావురా అని రాజు అడిగితే.. అవును అన్నయ్య కంపెనీ ఇచ్చే గోల్డ్‌ విషయంలో ఏదో జరుగుతుంది అని వెంకీ చెప్పగానే.. మొన్న అంత తక్కువ రేటుకు కొటేషన్‌ ఇచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది అంటాడు. ఈ విషయంలో నువ్వేం కలగజేసుకోకు నువ్వు సైలెంట్‌గా ఉండు అంటూ వెంటనే ఈ విషయం ఇందుకు చెప్పాలని అనుకుంటాడు రాజు.

జీఆర్‌ కంపెనీ మేనేజర్‌ వచ్చి ఐశ్వర్య పంపిన శాంపిల్స్‌ చాలా బాగున్నాయని.. మీ వర్క్‌ కూడా మాకు బాగా నచ్చింది. అందుకోసం ఇప్పుడే మీకు హాప్‌ పేమెంట్‌ ఇవ్వడానికి వచ్చాను అంటాడు. చెక్‌ తీసి పేమెంట్‌ ఇస్తాడు. మీ వర్క్‌ మాకు బాగా నచ్చింది కాబట్టి స్వరాజ్‌ కంపెనీకి ఇచ్చే మిగతా నాలుగు కాంట్రాక్ట్‌ కూడా మీకే ఇస్తామని చెప్పి వెళ్లిపోతాడు. అతను వెళ్లిపోయాక పార్వతీశం తన మాటలతో ఐశ్వర్యను పొగుడుతుంటాడు. ఐషు మాత్రం చెక్‌ చూసుకుంటూ ఇందు నేనేంటో చూపిస్తాను.. అని మనసులో అనుకుని సరే పారు నేను వెళ్లాలి ఈ చెక్‌ను నేను చాలా మందికి చూపించాలి అంటుంది.

Advertisement

ఇంటి దగ్గర రాజు కోసం ఇందు ఎదురుచూస్తుంది. రాజు రాగానే పెళ్లి విషయం ఎలాగైనా చెప్పాలని వెంటనే పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తుంది. అప్పుడే రాజు టెన్షన్‌ పడుతూ వస్తాడు. రాజును చూసిన ఇందు బావ టెన్షన్‌ పడుతూ వస్తున్నాడంటే తనకు కూడా నిజం తెలిసిపోయిందా..? అని అనుమానపడుతుంది. రాజు వచ్చి ఐశ్వర్య చేస్తున్న తప్పు గురించి ఇందుకు చెప్తాడు. అది మన మీద గెలవడానికి ఇంత నీచానికి దిగజారిందా..? అంటూ ఇందు తిడుతుంది. తను ఎంతకైనా దిగజారుతుందని మనకు తెలుసు కదా ఇందు అంటాడు రాజు. కానీ తను తప్పు చేయడం వల్ల దుగ్గిరాల ఫ్యామిలీకికే చెడ్డ పేరు వస్తుంది. వెంటనే ఐషుతో మాట్లాడి తప్పు సరిదిద్దాలి అని రాజు చెప్తుంటే.. కింద ఐశ్వర్య వచ్చి అందరిని పిలుస్తుంది. అందరూ హాల్లోకి వస్తారు. రాజు, ఇందు కూడా వెళ్తారు.

ఐశ్వర్య తనకు వచ్చిన చెక్‌ గురించి అందరికీ చెప్తుంది. తనది గోల్డెన్‌ లెగ్‌ అని గొప్పలు చెప్పుకుంటుంది. అందుకు అపర్ణ కోపంగా చిన్నప్పుడే ఇందు ఇలాంటి ప్రాజెక్టులు చాలా చేసింది. కానీ ఎన్నడూ నీలాగా ఇంటికి వచ్చి ఇలా గొప్పలు చెప్పుకోలేదని తిడుతుంది. అపర్ణను రేఖ, భ్రమరాంబ తిడతారు. రాజు, ఇందు మాత్రం అందరి ముందు అడగొద్దని అనుకుంటారు. ఐషు అందరికి వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది.

Advertisement

తర్వాత రాజు, ఐషు దగ్గరకు వెళ్లి ఈ టెండర్‌ నీకు రావడానికి ఎవరితో చేతులు కలిపావో అన్ని నాకు తెలుసు. అంటూ చెప్పగానే.. ఏం మాట్లాడుతున్నావు.. నువ్వు దొంగతనాలు చేస్తావు.. కిడ్నాపులు చేస్తావు.. అందరూ నీలాగే ఉంటావని అనుకోకు అంటుంది ఐషు. ఆ కిడ్నాప్‌ చేయమని చెప్పిందే నువ్వు మర్చిపోకు అంటాడు రాజు. అదంతా వదిలేయ్‌ ఇప్పుడేం చెప్తున్నావు నువ్వు…. ఇవన్నీ అడగడానికి నువ్వెవరు..? దుగ్గిరాల వారసుడివా..? ఇందు మొగుడివా..? కాదు జస్ట్‌ ఇందు అద్దెకు తెచ్చుకున్న మొగుడివి వెళ్లి పని చూసుకోపో అంటూ ఐశ్వర్య చెప్తే..

సరే వెళ్తాను కానీ నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసు దొరికిపోయినప్పుడు నీ పేటే మారిపోతుంది జాగ్రత్త అంటూ వెళ్లిపోతాడు రాజు. రాజు వెళ్లిపోయాక రేఖ, భ్రమరాంబ వాళ్లు వెళ్లి వెంకీ ఉండటం వల్లే రాజుకు నిజం తెలిసిపోయిందని చెప్తారు. దీంతో ఐశ్వర్య తన పార్ట్‌నర్‌కు ఫోన్‌ చేసి వెంకీ గురించి చెప్పి ఆ వెంకీని ఇరికించండి ఈ ఫ్రాడ్‌ మొత్తం వాడే చేశాడని కేసు ఫైల్‌ చేయించు అని చెప్తుంది. అలాగే నంటూ చెప్తాడు ఆ వ్యక్తి. తర్వాత నందుకు ఫోన్‌ చేసి వెంకీ మీద కంప్లైంట్‌ చేస్తాడు. వెంకీ ఫ్రాడ్‌ చేయడం ఏంటి అని నందు షాక్‌ అవుతుంది.

మరోవైపు రాజు, ఇందును తీసుకుని ఐశ్వర్యకు వార్నింగ్‌ ఇవ్వడానికి వెళ్తుంటే.. గడప తగిలి కిందపడబోతాడు. ఇందు కంగారుగా బావ అంటూ పట్టుకుంటుంది. అది చూసిన రాజు దీనికే ఇంత భయపడితే ఎలా చిన్నప్పుడు నేను ఎన్ని దెబ్బలు తిన్నానో తెలుసా..? అంటూ ఇందును తీసుకుని వెళ్లిపోతాడు. తర్వాత రేఖ, భ్రమరాంబ కలిసి అపర్ణ రూంలోకి వెళ్లి సుభాష్‌కు ఇచ్చే డ్రగ్‌ డోస్‌ ఎక్కువ చేస్తారు. దీంతో ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. చందు మాటతో వల్లి కన్నీళ్లు.. భాగ్యం కు మైండ్ బ్లాక్..

Intinti Ramayanam Today Episode: అవనికి నిజం తెలుస్తుందా..? కమల్ లైఫ్ లోకి కొత్త అమ్మాయి.. అసలు ట్విస్ట్ ఇదే..

Telugu TV Serials : ఈ వారం టీఆర్పీ రేటింగ్.. ఆ మూడు అవుట్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 23rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  పార్థు బతికే ఉన్నాడా..?  వైజయంతి మాటల్లో నిజమెంత..?  

Godavari Janu : జాను నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Friday Movies : శుక్రవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

తెలంగాణ యాంకర్ల పారితోషికం ఎంతో తెలుసా? ఒక్కొక్కరు ఎంత సంపాదిస్తున్నారంటే!

Big Stories

Advertisement
×