E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode October 24th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రేఖ ప్లాన్ అట్టర్ ప్లాప్ – సుభాష్ సేఫ్

Brahmamudi Serial Today Episode October 24th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రేఖ ప్లాన్ అట్టర్ ప్లాప్ – సుభాష్ సేఫ్
Advertisement

Brahmamudi serial today Episode: సుభాష్‌ను చంపేందుకు ప్లాన్‌ చేసిన రేఖ, భ్రమరాంబ ఇద్దరూ అపర్ణ రూంలోకి వెళ్తారు. సుభాష్‌కు ఇచ్చే మెడిసిన్‌లో డోస్‌ పెంచాలని అనుకుంటారు. అప్పుడే రూంలోకి అపర్ణ వెళ్తుంది. అపర్ణను చూసిన రేఖ, భ్రమరాండ కర్టెన్‌ చాటుకు వెళ్లి దాక్కుంటారు. అపర్ణ వచ్చి వెళ్లిపోయాక డోస్‌ పెంచిన ఇంజక్షన్‌ అక్కడ పెట్టి వెళ్లిపోతారు రేఖ, భ్రమరాంబ.

రాత్రికి అపర్ణ, సుభాష్‌ల పెళ్లి రోజు వేడుకలు జరుపుతుంటారు ఇందు, రాజు. అంది చూసి రేఖ, భ్రమరాంబ కుళ్లు పడుతుంటారు. ఇందు దండలు తీసుకొచ్చి మీరు ఈ దండలు మార్చుకోవాలి నాన్నమ్మ అంటే దూరం నుంచి గమనిస్తున్న రేఖ ఆ దండలు మీ శవాలకు అయితే చాలా బాగుంటాయి అని మెల్లగా అంటే.. ఇంకాసేపట్లో ఎలాగూ జరగబోయేది అదే కదా అంటుంది భ్రమరాంబ. అపర్ణ, సుభాష్‌లు దండలు మార్చుకుంటారు. తర్వాత రాజు ఈ షష్టి పూర్తి వేడుకలు ఎందుకు చేసుకుంటారో కాస్త వివరంగా చెప్తారా తాతయ్య అని సుభాష్‌ను అడిగితే.. సుభాష్‌ షష్టి పూర్తి గురించి వివరంగా చెప్తాడు. అంతా విన్న  తర్వాత శేషు అంటే మగాడు 60 ఏండ్ల వరకు కుటుంబం కోసం గాడిదల కష్టపడాలని చెప్తున్నారా మీరు అని అడిగితే.. ఆయన చెప్తుంది కష్టపడే వాళ్ల గురించి నీ గురించి కాదు అంటుంది భ్రమరాంబ.

Advertisement

సుభాష్‌ ఇంకా చెప్తుంటే.. ఐషు కోపంగా ఈ ముసలి ప్రేమకథ చూస్తుంటే.. ఇరిటేటింగ్‌ గా ఉంది అంటుంది. రేఖ మాత్రం ఇందు ఇప్పటికే లేట్‌ అయింది ఆ కేక్‌ ఏదో కట్‌ చేస్తే బాగుంటుంది అని చెప్పగానే.. ఇందు, లక్కీతో కేక్‌ తెప్పిస్తుంది. సుభాష్‌ వాళ్లు కేక్‌ కట్ చేయబోతుంటే.. భ్రమరాంబ, రేఖతో అయన ఇంజక్షన్‌ వేసుకోకుండానే కేక్ కట్‌ చేసి తింటాడా ఏంటి..? ఇలా అయితే మనం అనుకున్న ప్లాన్‌ ఫెయిల్‌ అవుతుందేమో అని అడుగుతుంది. అందుకు రేఖ కోపంగా నువ్వు ఇలా వాగితే మనిద్దరం దొరికిపోతాము వదిన నువ్వు మెల్లగా మాట్లాడు అంటే సరే సరేలే ఏదో ఒకటి చేసి ఆపు అంటుంది భ్రమరాంబ.. నేనెలా ఆపగలను వదిన అంటుంది రేఖ. అప్పుడే అపర్ణ, సుభాష్‌ కేక్‌ కట్‌ చేస్తారు. నాన్నమ్మ తాతయ్యకు కేక్‌ తినిపించు అని చెప్పగానే.. అపర్ణ కేక్‌ తినిపించబోతుంటే.. భ్రమరాంబ అయ్యో అపర్ణ గారు ఇంజక్షన్‌ వేశారా.? వేయకుండానే కేక్‌ తినిపిస్తున్నారు అంటే ఇందు తాతయ్య ఇంజక్షన్‌ వేసుకోలేదా అని అడుగుతుంది. సుభాష్‌ వేసుకోలేదు అని చెప్తాడు. రాజు అనుమానంగా ఏంటి అత్తా ఇవాళ తాత మీద ప్రేమ పుట్టుకొచ్చింది.. సరేలే సమయానికి గుర్తు చేశావు అంటే మా భ్రమరం గుర్తు చేసింది అంటే ఏదో అల్లకల్లోలం జరుగుతుందని అర్థం అంటాడు శేషు.

దీంతో భ్రమరాంబ జోక్‌ చేసింది చాలులే శేషు ఇక నోర్మూయ్‌ అంటుంది. రాజు.. ఇందును ఇంజక్షన్‌ తీసుకురా అంటే ఇందు లోపలికి వెళ్తుంది. భ్రమరాంబ, రేఖ హ్యాపీగా ఫీలవుతుంటారు. ఇంజక్షన్‌ తీసుకుని వస్తున్న ఇందుకు ఫోన్‌ వస్తుంది. కాల్‌ మాట్లాడుతుంటే రాజు వెళ్లి ఇటివ్వు నేను వేస్తాను అంటూ ఇంజక్షన్‌ తీసుకోబోతుంటే  మెడిసిన్‌ కింద పడి పగిలిపోతుంది. భ్రమరాంబ కోపంగా రాజును తిడుతుంది. నువ్వేంటి ఇంతలా ఫీల్‌ అవుతున్నావు.. ఇంకో ఇంజక్షన్‌ ప్రిజ్‌లో ఉంది నేను తీసుకొస్తాను అంటూ ఇంకొ ఇంజక్షన్‌ తీసుకొచ్చి సుభాష్‌కు చేస్తుంది ఇందు. తర్వాత అందరూ కేక్‌ తింటూ సుభాష్‌, అపర్ణలకు విషెష్‌ చెప్తుంటారు.

Advertisement

వెంకీ ఇంట్లో భోజనం చేస్తుంటే.. నందు పోలీసులతో వెళ్తుంది. వెంకీ మీద కేసు ఫైల్‌ అయిందని తమ కంపెనీలో గోల్డ్‌ ఫ్రాడ్‌ చేసినట్టు వాళ్ల కంపెనీ ఓనరు కంప్లైంట్‌ ఇచ్చాడని చెప్తుంది. చలపతి, లక్ష్మీ కంగారు పడతాడు. నందు వివరంగా చెబితే.. వెంకీ కూడా చలపతి, లక్ష్మీలకు వివరంగా చెప్పి నందుతో కలిసి వెళ్లిపోతాడు. షష్టి పూర్తి ఫంక్షన్‌లో ఉన్న రాజుకు చలపతి ఫోన్‌ చేసి విషయం చెప్తాడు. వెంకీని పోలీసులు అరెస్ట్‌ చేశారని చెప్తాడు. ఆ మాటకు రాజు షాక్ అవుతాడు. వెంకీని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి అని అడగ్గానే.. అందరూ షాక్‌ అవుతారు. రేఖ, ఐషు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. అసలు ఏమైంది అంటూ రాజు అడగ్గానే.. జరిగింది మొత్తం చెప్తాడు చలపతి. తాను స్టేషన్‌కు వెళ్తున్నానని.. నువ్వు వెంటనే రమ్మని చెప్తాడు రాజు సరే అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు.

పోలీస్‌ స్టేషన్‌లో వెంకీ లాకప్‌లో ఉంటే.. లక్ష్మీ, చలపతి వెళ్తారు. వెంకీని చూసి ఏడుస్తారు. నందు బాధపడుతూ ఉంటుంది. వెంకీ ఎవరో తన మీద కావాలని కేసు పెట్టారని చెప్పగానే.. నందుకు అనుమనం వస్తుంద. ఒక పోలీస ఆఫీసర్ గా నేను ఈ కేసును సాల్వ్‌ చేస్తానని దీని వెనక ఎవరున్నారు అన్న విషయాలన్నీ ఎంక్వైరీ చేసి వెంకీని నేను కాపాడతాను అంటూ లక్ష్మీ, చలపతికి భరోసా ఇస్తుంది. అప్పుడే రాజు, ఇందు స్టేషన్‌కు వెళ్తారు. దీంతో ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి పై అనుమానం.. రోహిణి ఇరుక్కుంటుందా..?చివర్లో షాకింగ్ ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి విడాకులు ఇస్తున్న కమల్.. శ్రీకర్ కు టెన్షన్.. అవని సూపర్ ప్లాన్..

Podarillu Today Episode : అడ్డంగా దొరికిపోయిన జమున.. గుండె బద్దలు కొట్టే నిజం.. నారాయణ ఇచ్చిన ట్విస్ట్..

Podarillu Maha: మహాకు బంఫర్ ఆఫర్.. ఇది అస్సలు ఊహించిఉండరు..

Saturday Movies : సినిమాల జాతర.. శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు..

Nindu Noorella Saavasam Serial Today Episode October 24th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాను అంజుకు ఎలా తెలిసింది..?   

ఈశ్వర్ సాయి ఈజ్ బ్యాక్.. మళ్లీ పాత జోష్ వచ్చేసినట్టేనా ?

Big Stories

Advertisement
×