E-Paper
Advertisement

Podarillu Today Episode : అడ్డంగా దొరికిపోయిన జమున.. గుండె బద్దలు కొట్టే నిజం.. నారాయణ ఇచ్చిన ట్విస్ట్..

Podarillu Today Episode : అడ్డంగా దొరికిపోయిన జమున.. గుండె బద్దలు కొట్టే నిజం.. నారాయణ ఇచ్చిన ట్విస్ట్..
Advertisement

Podarillu Today Episode October 24th: ఎందుకురా మళ్లీ నాన్నతో గొడవపడి వస్తున్నావా అని లోపలికి వెళ్ళిన తర్వాత కన్నా తో మాధవ్ అడుగుతాడు. ఆయనకు భోజనం పెడుతుంది మా అమ్మని వెళ్లగొట్టిన అతనికి భోజనం పెట్టాల్సిన అవసరం ఏంటి అని కన్నా అడుగుతాడు. నాన్నని మొదటి నుంచి మహాలక్ష్మి ప్రేమగానే చూసుకుంటుంది. అయితే కన్నా మాత్రం మా అమ్మని ఇంట్లో నుంచి బయటకు పంపించేసిన ఆయన మీద ఈ వీడికి ఎందుకు అంత ప్రేమ అని అడుగుతాడు. నేను ఆయనని మొదటి నుంచి అల్లాని చూసుకుంటున్నాను అయితే ఆయనే మీ అమ్మని ఇంట్లో నుంచి బయటకు పంపించాడని నీకు తెలుసా అని మహాలక్ష్మి సీరియస్ అవుతుంది. కన్నా మాత్రం చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. మాధవ్ మాత్రం 20 ఏళ్లు నిన్ను వదిలేసి వచ్చినా మీ అమ్మ మళ్లీ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఏంటో ఆశ్చర్యం లేదు కదా.. మహాలక్ష్మి ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలాంటిది తనని బాధ పెడతావా అని కన్నాకి క్లాస్ పీకుతాడు..

మహా మాటతో కన్నా ఫీల్..

రాత్రి కన్నా అలా మాట్లాడడంతో చక్రి మహాలక్ష్మి గదిలోకి వెళ్లి తనతో మాట్లాడాలని అనుకుంటాడు. అయితే చక్రి తాగేసి వచ్చాడేమో అని మహాలక్ష్మి భయపడుతుంది. మిమ్మల్ని కన్నా అలా అన్నాడని లోపలికి వచ్చాను అంతే తప్ప నేను తాగేసి రాలేదు అని చక్రీ అంటాడు. ఉదయం లేచిన తర్వాత మహాలక్ష్మి ఎక్కడుంటే అక్కడికి వెతుక్కుంటూ వెళ్లి మాట్లాడాలి అని అనుకుంటాడు. కన్నా మహాలక్ష్మికి సారీ చెప్పాలని అనుకుంటాడు కానీ మహాలక్ష్మి మాటకు మాటకు సమాధానం చెప్పడంతో కన్నా ఫీల్ అవుతాడు.. ఇక మహాలక్ష్మి అందరూ కలిసి పెద్ది వంట చేయలేరు కాబట్టి మనమే అందరం కలిసి వంట చేద్దాం అని అంటుంది దానికి అందరూ సరే అంటారు. మీరు అన్ని సిద్ధం చేయండి నాకు ఒక చిన్న పని ఉంది నేను వెళ్లేసి వస్తాను అని మహాలక్ష్మి అంటుంది.

అడ్డంగా బుక్కయిన జమున..

Advertisement

మహాలక్ష్మి ఏదో ఒక పని మీద బయటకు వెళ్తే అక్కడ జమున కనిపించడంతో మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. తన నుంచి ఎలాగైనా సరే నిజాన్ని రాబట్టాలి అని అనుకుంటుంది. అయితే ఆ జమున బై దగ్గరికి వెళ్లి ఆగగానే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతుంది. డబ్బులు కొట్టేసి ఎందుకు పారిపోయారు అని మహాలక్ష్మి అడుగుతుంది నేనేమీ డబ్బులు కొట్టి పారిపోలేదు మీ డబ్బులు మీ దగ్గరే ఉన్నాయి నన్నెందుకు అంటావు అని మహా అనగానే జమున ఒక్కసారిగా భయపడిపోతుంది. నేను ఒక నిజం తెలుసుకోవాలి. మీరు ఎందుకు మీకు అన్న కొడుకుని వదిలేసి పారిపోయారు. మీతో వచ్చిన వ్యక్తి ఎవరు అని మహాలక్ష్మి అడుగుతుంది.. నాతో వచ్చిన వ్యక్తి నా భర్త కన్నా నా కొడుకు నా కొడుకుని నారాయణ దగ్గర వదిలేసి వెళ్లిపోయానని నారాయణకి అంత కోపం అని నిజం చెప్తుంది. అసలు నారాయణకి ఆ కొడుకు పుట్టకపోతే ఎందుకైనా ప్రేమగా పెంచుకుంటున్నాడు అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఇంటికి వచ్చేస్తుంది.

నారాయణ బయటపెట్టిన నిజం..

మహాలక్ష్మి చాలా కోపంగా ఇంటికి వస్తుంది. అయితే నారాయణ దగ్గరికి వచ్చి నేను మీతో మాట్లాడాలి అని అంటుంది. నేను బీడీలు ఏమి కాల్చలేదు ఏం మాట్లాడాలి అని నారాయణ అంటాడు. అయితే మహాలక్ష్మి నారాయణను బండి ఎక్కించుకొని ఒక గుడి దగ్గరికి తీసుకొని వెళుతుంది. నీకు బండి రాదు కదా నాకు భయమేస్తుంది. బండి పక్కన ఆపు నేను రిస్క్ తీసుకోలేను అని నారాయణ అంటాడు. కానీ మహాలక్ష్మి మాత్రం గుడి దగ్గర నుంచి ఒక్క అడుగు కూడా బయటకు పెట్టదు నేను నీతో చాలా మాట్లాడాలి. గుడి లోపలికి వెళ్లి అసలు కన్నా ఎవరి కొడుకు ఆ జమునకు మీకు ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతుంది. ఇదేం ప్రశ్న నా కొడుకు అని తెలుసు కదా మళ్లీ ఇది కొత్తగా అడుగుతున్నావేంటి అని మహాలక్ష్మితో అంటాడు నారాయణ. కానీ మహాలక్ష్మి దేవుడి సన్నిధిలో నిజం చెప్పమని కోరగానే ఎవరికీ చెప్పని నిజం నీకు చెప్తాను అని నారాయణ మొత్తం నిజాన్ని చెప్పాడు.

కన్నీళ్లు పెట్టుకున్న మహా..

Advertisement

కన్న గురించి జమున గురించి చెప్పగానే మహాలక్ష్మి ఎమోషనల్ అయిపోతుంది.. జమున తన జీవితంలోకి ఎలా వచ్చిందో అన్న నిజాన్ని నారాయణ బయట పెట్టగానే మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కన్నా నిజం తెలిస్తే తట్టుకోలేడు అందుకే నేను ఎప్పుడూ వాడికి దూరంగా పెట్టాలని అనుకోలేదు వాడ్ని కూడా నా కొడుకులాగే చూసుకున్నాను. మీరు చాలా గ్రేట్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయిపోతుంది. దాంతో నారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు.. అసలు మీరు ఎంత మంచి వాళ్ళు మీలాంటి వ్యక్తిని అందరూ ఇలా మాట్లాడుతున్నారని మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కన్నాకి ఎప్పుడూ నిజం చెప్తే అప్పుడు మీ గురించి మంచిగా ఆలోచిస్తాడు కానీ మీరు ఎందుకు నిజం చెప్పలేదు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది అయితే నారాయణ గొప్పతనాన్ని తెలుసుకున్న మహాలక్ష్మి తనని దేవుడితో సమానంగా చూస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో కన్నాకి ఆ నిజాన్ని మహాలక్ష్మి చెపుతుందా లేదా అన్నది చూడాలి..

Also Read :మహాకు బంఫర్ ఆఫర్.. ఇది అస్సలు ఊహించిఉండరు..

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవికి విడాకులు ఇస్తున్న కమల్.. శ్రీకర్ కు టెన్షన్.. అవని సూపర్ ప్లాన్..

Brahmamudi Serial Today Episode October 24th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రేఖ ప్లాన్ అట్టర్ ప్లాప్ – సుభాష్ సేఫ్

Podarillu Maha: మహాకు బంఫర్ ఆఫర్.. ఇది అస్సలు ఊహించిఉండరు..

Saturday Movies : సినిమాల జాతర.. శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు..

Nindu Noorella Saavasam Serial Today Episode October 24th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాను అంజుకు ఎలా తెలిసింది..?   

ఈశ్వర్ సాయి ఈజ్ బ్యాక్.. మళ్లీ పాత జోష్ వచ్చేసినట్టేనా ?

హౌస్ లో దొంగలుగా మారిన స్నేహితులు.. ఆ ఇద్దరూ వీరి ముందు నెగ్గుతారా?

Big Stories

Advertisement
×