BigTV English
Advertisement

Brahmamudi Serial Today October 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇంట్లో వాళ్లకు రాహుల్‌ వార్నింగ్‌

Brahmamudi Serial Today October 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇంట్లో వాళ్లకు రాహుల్‌ వార్నింగ్‌

Brahmamudi serial today Episode: రాజ్‌ టిఫిన్‌ తీసుకుని కావ్య దగ్గరకు వెళ్తాడు. కావ్య దీర్ఘ ఆలోచనలో ఉంటుంది. దీంతో ఏమైందని రాజ్‌ అడగ్గానే.. స్వప్న, రాహుల్‌ మధ్య జరిగిన గొడవ చెప్తుంది. దీంతో ఏంటి రాహుల్‌ అంత ఓవర్‌ చేస్తున్నాడా..? అంటాడు రాజ్‌. దీంతో అవునండి.. అలాగే చేస్తున్నారు.. ఆ రుద్రాణి ఎలాగూ రాహుల్‌కు బుద్ది చెప్పదు..కనీసం మనమైనా చెప్పాలి కదా మా అక్క అలా బాధపడుతుంటే నేను చూస్తూ ఎలా ఉండగలనండి.. అంటుంది కావ్య. సరే నువ్వు టెన్షన్‌ పడకు రాహుల్‌తో నేను మాట్లాడతాను అంటాడు రాజ్‌. మాట్లాడటం కాదు ఇంకోసారి ఇలాంటి చెత్త పనులు చేస్తే మర్యాదగా ఉండదని వార్నింగ్‌ ఇవ్వండి అనగానే.. నేను చెప్తాను అంటున్నాను కదా.. ఇవన్నీ ఆలోచిస్తూ నీ బుర్ర పాడుచేసుకోకు ముందు నువ్వు ఇది తిను అని చెప్తాడు రాజ్‌.. సరే అంటూ టిఫిన్‌ చేస్తుంది కావ్య.


మరోవైపు రూంలో ఆలోచిస్తూ ఉన్న స్వప్న దగ్గరకు రాహుల్‌ వెళ్లి ఏంటి శ్రీమతి గారు రాబోయే కష్టం ముందే కనిపెట్టారా..? కడుపులో బాధ కళ్లల్లోకి వచ్చింది అంటాడు. దీంతో కట్టుకున్నోడి ఒంట్లో కొవ్వు వస్తే భరించే భార్య కళ్లల్లో బాధే కనిపిస్తుంది అంటుంది స్వప్న. దీంతో రాహుల్‌ కరెక్టుగా చెప్పావు.. మరి ఆ కొవ్వుకు నువ్వు సరిపోవడం లేదు.. నా చూపుకు నువ్వు ఆనడం లేదు స్వప్న.. మరేం చేయమంటావు చెప్పు అంటాడు. నువ్వేం చేయనక్కర్లేదు.. నేను నిన్నటి స్వప్ననే అయితే నీ చిత్త కార్తె బుద్దికి బాగా గడ్డి పెట్టేదాన్ని అంటుంది స్వప్న. దీంతో రాహుల్‌ నేను చిత్త కార్తెనే.. మరి నువ్వు ప్రతివతవే కదా..? కథల్లో కానీ సినిమాల్లో కానీ ప్రతివతలు ఏం చేస్తారు..? భర్తల సుఖాన్నే కోరుకుంటారు. అయ్యో పాపం కట్టుకున్న వాడికి ఏం కష్టం వచ్చిందో ఇంటి తిండి కాదని హోటల్‌ తిండి మీద ఆశపడ్డాడు అని సర్ది చెప్పుకుని ముక్కు చీదుకుని వదిలేస్తుంది. మరి నువ్వేంటమ్మా నన్ను వదిలేయడం లేదు.. అంటాడు.

దీంతో స్వప్న ఆరోజు నిన్ను నమ్మడం నేను చేసిన తప్పు.. నీతో రావడం నేను చేసిన తప్పు.. ఈ రోజు నువ్వు తెగించి ఇంతగా దిగజారిన ఇంకా నీ చెంప పగులగొట్టకుండా ఉండటం నేను చేసిన తప్పే.. అంటుంది. వద్దు నువ్వేం చేయోద్దు.. నువ్వు తప్పు చేస్తానన్నా..? నేను మాత్రం జీవితంలో నీతో మళ్లీ మళ్లీ తప్పు చేయించను. కాబట్టి ఈ తప్పులన్నీంటికీ పుల్‌ స్టాప్‌ పెట్టేదాం.. ఇక నేను నీతో కలిసి ఉండటం జరగదు.. అంటూ తనకు డివోర్స్‌ ఇవ్వమని అడుగతాడు. దీంతో రాహుల్‌, స్వప్న ల మధ్య గొడవ జరుగుతుంది. రాహుల్‌ బలవంతంగా స్వప్న చేత సంతకం చేయించాలని చూస్తాడు. దీంతో స్వప్న కోపంగా విడాకులు పేపర్స్ తీసుకుని కిందకు వెళ్తుంది.


అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. పేపర్స్‌ తీసుకుని వెళ్లి రుద్రాణి ముందు వేస్తుంది. ఏంటివి అని రుద్రాణి అడగ్గానే.. నీ కొడుకు చేస్తున్న ఘనకార్యం.. నాకు చేస్తున్న అన్యాయం.. అని చెప్తుంది. దీంతో రుద్రాణి ఏమంటున్నావు వాడు నీకు అన్యాయం చేయడం ఏంటి..? అని అడుగుతుంది. దీంతో స్వప్న కోపంగా నా మీద మొహం మొత్తిందంట.. ఇంకో ఆడదాని మీద మోజు పుట్టిందట అని చెప్తుంది. రుద్రాణి అర్థం కానట్టు ఏంటి స్వప్న నువ్వు అనేది.. అని అడగ్గానే.. మరీ అంత షాక్‌ అవ్వకు అత్తా చూడ్డానికే చాలా చెండాలంగా ఉంది అంటుంది స్వప్న. ఇంతలో అపర్ణ కల్పించుకుని స్వప్న ఏంటది ఇదంతా అని అడుగుతుంది. దీంతో స్వప్న ఏడుస్తూ.. రాహుల్ ఇంకోదాన్ని పెళ్లి చేసుకోవాలట.. అందుకే విడాకుల పేపర్స్‌ మీద సంతకం పెట్టమని వేధిస్తున్నాడు అని చెప్తుంది.

దీంతో అందరూ షాక్‌ అవుతారు. కోపంగా రాజ్‌ విడాకులు ఇవ్వాలంటున్నాడా..? అని అడుగుతుండగానే.. రాహుల్‌ వస్తాడు. రాజ్‌ కోపంగా అరేయ్‌ ఏంట్రా ఇది అని అడగ్గానే.. పరుగెత్తుకుంటూ వచ్చింది కదా..? చెప్పలేదా..? అంటాడు రాహుల్‌.  రాజ్‌ కోపంగా రాహుల్‌ను తిడతాడు. కావ్య కల్పించుకుని రాహుల్‌ను తిడుతుంది. అందరూ రాహుల్‌ను తిడతారు. అయినా రాహుల్‌ వినకుండా తనకు విడాకులు కావాలని చెప్పి వెళ్లిపోతాడు. రాహుల్‌ వెళ్లిపోయాక అపర్ణ, ఇంద్రాదేవి ఇద్దరూ కలిసి రుద్రాణిని తిడతారు. తనకేం తెలియదని రుద్రాణి చెప్తుంది. అయితే నటించకు రుద్రాణి నీ కొడుకు నీకు చెప్పకుండా ఇది చేశాడంటే మేము నమ్మాలా అని అపర్ణ అడుగుతుంది. దీంతో నేను కనుక్కుంటాను చెప్తాను అంటూ రుద్రాణి, రాహుల్‌ దగ్గరకు వెళ్తుంది. రాహుల్‌ను కొడుతుంది. రాహుల్‌ మాత్రం తన గర్ల్‌ ఫ్రెండ్‌ చాలా రిచ్‌ అని తనను పెళ్లి చేసుకుంటే.. కోట్లకు వారసుడిని అవుతానని చెప్తాడు.

రుద్రాణి కూడా హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు రాజ్‌, కావ్య ఇద్దరూ స్వప్న గురించి ఆలోచించి రాహుల్‌ను ఎలాగైనా మార్చాలనుకుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Today Episode: గుడ్డిగా నమ్మి మోసపోయిన వేదవతి.. శ్రీవల్లి ఎంట్రీతో షాక్.. ధీరజ్ జైలుకు వెళ్తాడా..?

Intinti Ramayanam Today Episode: పల్లవి పరువు తీసిన కమల్.. ఇంట్లో రచ్చ చేసిన పల్లవి..భానుమతి భోజనం అదుర్స్..

GudiGantalu Today episode: నిజం కక్కేసిన మనోజ్.. సత్యంకు అడ్డంగా దొరికిన ప్రభావతి.. నగలను అమ్మేస్తారా..?

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Nindu Noorella Saavasam Serial Today october 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  నిజాన్ని తెలుసుకున్న అమర్ 

Karthika Deepam : వంటలక్క భర్త ఏం చేస్తారో తెలుసా..? ఇండస్ట్రీలో చాలా ఫేమస్..

Nindu Noorella Saavasam Serial Today october 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాన్‌ సక్సెస్‌ – మిస్సమ్మను చంపబోయిన అమ్ము

Big Stories

×