BigTV English
Advertisement

GudiGantalu Today episode: నిజం కక్కేసిన మనోజ్.. సత్యంకు అడ్డంగా దొరికిన ప్రభావతి.. నగలను అమ్మేస్తారా..?

GudiGantalu Today episode: నిజం కక్కేసిన మనోజ్.. సత్యంకు అడ్డంగా దొరికిన ప్రభావతి.. నగలను అమ్మేస్తారా..?

Gundeninda GudiGantalu Today episode October 30th: నిన్నటి ఎపిసోడ్ లో.. నావల్ల కావట్లేదు ఇంకా జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను అని అంటుంది శృతి.. అంతసేపు నిలబడుకునే బదులు కాసేపు కూర్చోవచ్చు కదా అని రవి అంటాడు. ఎపిసోడ్ మొత్తం పూర్తవ్వాలి అని నిల్చోని పూర్తి చేసేసాను అందుకే నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని రోహిణి అంటుంది. నా కాళ్ళు నొక్కువా రవి అని బతిమిలాడుతుంది. రవి శృతి కాలు నొక్కడం ప్రభావతి చూస్తుంది. కొడుకుని పనిమనిషి చేసేసింది అని బాధపడుతూ ఉంటుంది. వాళ్ల రూమ్ లోకి వెళ్లి ఏంటి ఏం చేస్తున్నావని అడుగుతుంది. ప్రభావతిని చూసిన రవి నెయిల్ పెయింట్ వేయడం ఆపేస్తాడు. ఏంట్రా తను వెయ్యమంటే నువ్వు మాత్రం ఎలా వేస్తావు? పనిమనిషి చేస్తుంది రా చులకన అయిపోతావ్ అని అంటుంది. శృతి ఇందులో తప్పేముంది ఆంటీ భార్య కాళ్లు భర్త పట్టుకోవడం తప్ప ఏముంది.. ఒక స్టూడియోలో నిల్చుని కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని అంటే రవి నొక్కాడు చాలా బాగుంది అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మనోజ్ షాపుకి కొందరు వ్యక్తులు వచ్చి నాలుగు లక్షలకు ఫర్నిచర్స్ కొనుక్కొని వెళ్తారు. డబ్బులు వచ్చినాయన సంతోషంతో రోహిణి తో ఆ విషయాన్ని చెప్పి చాలా సంతోషంగా ఉంటాడు. ఇక వెంటనే షాప్ కి విజిలెన్స్ అధికారులు అంటూ మరో ఇద్దరు వస్తారు. వాళ్లు కూడా మనోజ్ ని నమ్మించి అక్కడున్న డబ్బులని తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్లు ఫ్రాడ్స్ మిమ్మల్ని పట్టుకున్నాము పోలీస్ స్టేషన్కు వెళ్లి మీ ఫర్నిచర్స్ ని తెచ్చుకోండి అని అంటారు. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్తే, ఎక్కడున్నావ్ ఎస్సై కూడా మనోజ్ ని దారుణంగా తిడతాడు. ఇంత తింగ్రోడివి ఎలా బిజినెస్ చేస్తున్నావని తిట్టడంతో పాటుగా నిన్ను కూడా జైల్లో వేస్తానని షాక్ ఇస్తాడు. అక్కడి నుంచి ఎలాగోలాగా మేనేజ్ చేసి వచ్చేస్తాడు మనోజ్..

బాలు నికొకటి ఇస్తాను అని లోపలికి తీసుకొని వస్తాడు.. నీకోసం నాలుగు ఇస్తాను అని అనగానే మీరు ఎన్ని ఇచ్చినా నేను తీసుకుంటానని మీనా అంటుంది. ఈరోజు నాలుగు నీకు 500 నోట్లు ఇస్తాను అని అనగానే ఇందుకోసం మీరు లోపలికి తీసుకొచ్చారా అని మీనా అంటుంది. మరి ఎందుకు అనుకున్నావ్ అని బాలు అంటాడు. ఏం లేదులెండి చెప్పండి అని మీనా అంటుంది. అక్కడే ఇవ్వచ్చు కదా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని నేను అడుగుతుంది.. మనము ఇంటిని కట్టాలి అంటే కచ్చితంగా డబ్బులు సంపాదించాలి. ఇప్పుడు మనం సంపాదిస్తున్నామని అందరు కుళ్ళుకుంటారు. ముఖ్యంగా మా అమ్మ కూడా సంపాదిస్తున్నానని కుళ్లేసుకుంటుంది..


అందుకే మన సీక్రెట్ గా డబ్బులను దాచి పెట్టాలి అప్పుడే ఎవరికీ తెలియకుండా మనం తొందరగా పైకి వచ్చేస్తాము అని బాలు అంటాడు. నేను కూడా మీకు రెండు ఇస్తాను అని మీనా అంటుంది. ఏంటవి అనగానే నేను కూడా రెండు నోట్లో ఇస్తాను. ఇవాళ పూల మీద దాంట్లో రెండు నోట్లు లాభం వచ్చింది అని అనగానే నేను ఇంకేదో అనుకున్నాను అని బాలు అంటాడు.. ఇక ఇద్దరు కలిసి ఆ డబ్బులని డబ్బాలో పెట్టేస్తారు. బాలు నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. గేరు క్లచ్ తొక్కి తొక్కి కాళ్లు బాగా నొప్పులు వస్తున్నాయని బాధపడుతూ ఉంటే మీనా బాలు కోసం కాపడం పెట్టడానికి నీళ్లు తీసుకొని వస్తుంది.

భార్యతో సేవలు చేయించుకుంటున్న బాలుని చూసి ప్రభావతి మురిసిపోతుంది. నా కొడుకు నా పరువు నిలబెట్టాడు. నా కుటుంబ పరువుని బాలు గాడు నిలబెట్టాడు అని మోరటోటు మురిసిపోతూ ఉంటుంది.. ఈ రవి గాడే శృతి మాయలో పడి ఇలా అన్నీ చేస్తున్నాడు అని ప్రభావతి అనుకుంటుంది. ఎలాగైనా బుద్ధి వచ్చేలా చేయాలి ఇవన్నీ చెప్పి అని ప్రభావతి రవిని తీసుకొని వస్తుంది. అరేయ్ శృతి ఉందా అంటే లేదమ్మా డబ్బింగ్ కి వెళ్ళింది అని అంటాడు. అప్పుడు రవిని బాలుగదిగి తీసుకొని వస్తుంది. చూడు వాడు ఏం చేస్తున్నాడు భార్య చేత కాళ్లు పట్టించుకుంటున్నాడు వాడు రా మగాడు అంటే అని అంటుంది..

కాళ్ల నొప్పులు మెల్లగా దూరం అయిపోతున్నాయి. నీకు పూలు కట్టి కట్టి చేతులు నొప్పులు వస్తుంటాయి అందుకే వేడి నీళ్లు తో నీకు కాపురం పెడతానని అంటాడు. రవి అది చూసి ఏం జరుగుతుంది ఇక్కడ నువ్వే చూడు అని అనగానే మీనా చేతులకి కాపురం పెట్టడంతో ప్రభావతి షాక్ అవుతుంది. అయితే వీడు కూడా నా పరువును తీసేస్తున్నాడు అసలు ఇంట్లో ఏం జరుగుతుందని అందరూ అనుకుంటూ ఉంటారు. ప్రభావతి బయట కూర్చుని నా పరువుని నా కొడుకులు ముగ్గురు తీసేస్తున్నారు అని బాధపడుతుంది.. బాలు దగ్గరికి వచ్చిన సత్యం ఏమైందమ్మా ఏం జరిగింది అని అడుగుతాడు.

ఈయన ఇవాళ కూడా బయటకు వెళ్లి డ్రైవింగ్ చేసే లోపల కాళ్లు నొప్పులు వస్తున్నాయి అంట మామయ్య అని అంటుంది. ఆదివారం పూట కూడా ఇంట్లో ఉండొచ్చు కదరా ఈరోజు కూడా బయటకు వెళ్లి డ్రైవింగ్ చేయడం అవసరమా అని అంటాడు. ఒక్క రోజైనా రెస్ట్ తీసుకోకపోతే ఎలా ఉంటది రా ఆరోగ్యం బాగుంటదా అని సత్యం క్లాస్ పీకుతాడు. సరే ఇదేంటి ఏదో తీసుకొచ్చావు డబ్బా అని బాలు అడుగుతాడు. ఇది మీ అమ్మ కోసం తీసుకొచ్చాను రా ఇదొక బొమ్మ అని అడుగు అంటాడు సత్యం.

అమ్మ కోసం బొమ్మ తెచ్చారా అమ్మవతి కాస్త ఇప్పుడు బొమ్మవతి అవుతుంది. ఏం బొమ్మ తెచ్చారు నాన్న అంటారు.. మీ అమ్మకి చూపిస్తానని ప్రభావతి దగ్గరికి వెళ్లిన సత్యం నీకోసం ఒక బొమ్మను తీసుకొచ్చానని ఆ బొమ్మని చూపిస్తాడు. అయితే ఆ బొమ్మల్ని చూసిన ప్రభావతి ఇదేంటండి కోతి బొమ్మలు తీసుకొచ్చారు అని అంటుంది. ఈ మూడు కోతి బొమ్మలు నీకోసమే ఎవరి గురించి పట్టించుకోవద్దు ఏం జరిగినా చూడొద్దు.. నువ్వు ఏది మాట్లాడకూడదు అని చెప్పడానికే ఇది మన రూమ్ లో మనసున దగ్గర పెట్టు ఎదురుగా కనిపిస్తూ ఉంటాయని సత్యం అంటాడు.

Also Read :వంటలక్క భర్త ఏం చేస్తారో తెలుసా..? ఇండస్ట్రీలో చాలా ఫేమస్..

ఇక మనోజు ప్రభావతిని బలవంతంగా లోపలికి తీసుకొని వస్తాడు. ఏమైందిరా అంటే నన్ను మోసం చేశారమ్మ దారుణంగా మోసపోయాను. నాలుగు లక్షలు నన్ను మోసం చేసి తీసుకెళ్లిపోయారు. ఏదో ఒకటి చేయాలి అమ్మ అని కాళ్ళ వెళ్ళపడతాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి రా నువ్వు ఏ పని సరిగ్గా చేయవని ప్రభావతి మనోజ్ ని కొడుతుంది. అన్ని డిగ్రీలు ఉన్నాయి నువ్వు ఒకటి చెవిటివి అని దారుణంగా తిట్టేస్తుంది.. మీనా నగలు నాకు ఇవ్వమ్మా నేను మళ్ళీ ఎలాగోలాగా చేసి ఆ నగలను తీసుకొచ్చి ఇస్తాను అని అంటాడు.. చేసేదేమీ లేక తీసుకొని వచ్చి ఇస్తుంది. మధ్యలో సత్యం ఏంటవే అని అడుగుతాడు.. మొత్తానికి మనోజ్ కి ఇవ్వాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episode: గుడ్డిగా నమ్మి మోసపోయిన వేదవతి.. శ్రీవల్లి ఎంట్రీతో షాక్.. ధీరజ్ జైలుకు వెళ్తాడా..?

Intinti Ramayanam Today Episode: పల్లవి పరువు తీసిన కమల్.. ఇంట్లో రచ్చ చేసిన పల్లవి..భానుమతి భోజనం అదుర్స్..

Brahmamudi Serial Today October 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇంట్లో వాళ్లకు రాహుల్‌ వార్నింగ్‌

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Nindu Noorella Saavasam Serial Today october 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  నిజాన్ని తెలుసుకున్న అమర్ 

Karthika Deepam : వంటలక్క భర్త ఏం చేస్తారో తెలుసా..? ఇండస్ట్రీలో చాలా ఫేమస్..

Nindu Noorella Saavasam Serial Today october 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాన్‌ సక్సెస్‌ – మిస్సమ్మను చంపబోయిన అమ్ము

Big Stories

×