OTT Movie : 20వశతాబ్ధం ప్రారంభం వరకు సతీ సహగమనం అనే ఆచారం తీవ్రంగా ఉండేది. భర్త చనిపోతే భార్య కూడా చితిలో అగ్నికి ఆహుతి అవ్వాలి. ఇలాంటి దూరాచారాన్ని రూపు మాపడానికి రాజా రామ్ మోహన్ రాయ్ లాంటి మహానుభావులు ఎంతో శ్రమించారు. ఈ నేపథ్యంలో ఒక నేపాలీ మూవీ తెరకెక్కింది. ఈ కథ 1920 కాలంలో జరుగుతుంది. ఒక స్త్రీ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తన బిడ్డ కోసం బతకాలనుకుంటుంది. ఈ సోషల్ మెసేజ్ సినిమా పేరు ఏంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని కథ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
‘ఝోలా’ (Jhola) 2013లో విడుదలైన నేపాలీ హిస్టారికల్ సినిమా. డైరెక్టర్ యాదవ్ కుమార్ భట్టరై దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో సుజల్ నేపాల్, దీపక్ చెత్రి, లక్ష్మి గిరి, ప్రహ్లాద్ ఖతివాడా, దేశ్ భక్త ఖానల్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2013లో వచ్చిన ఈ సినిమా నిడివి 1 గంట 30 నిమిషాలు ఉండగా, ఐయండిబి రేటింగ్ 7.8/10 గా ఉంది. యూట్యూబ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
కంచి అనే పాతికేళ్ళ అమ్మాయికి, అదే గ్రామంలో ఉన్న 70 ఏళ్ల వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. కంచి మొదట భయపడుతుంది. ఆ తరువాత సంవత్సరంలో కంచికి ఘనశ్యామ్ అనే కొడుకు కూడా పుడతాడు. కంచి ఇంటి పని, పొలం పని చేసుకుంటూ ఉంటుంది. ఘనశ్యామ్ చిన్నగా ఆడుకుంటాడు. ఒక రోజు కంచి భర్త అనారోగ్యంతో చనిపోతాడు. దీంతో స్టోరీ పూర్తిగా మారిపోతుంది. గ్రామస్తులు వచ్చి సతీ సహగమనం చేయాలి, లేదంటే గ్రామం శాపం పడుతుంది అని వాదిస్తారు. కంచి తల్లి కూడా దీనికి ఒప్పుకుంటుంది. కంచి నాకు చిన్న పిల్లాడు ఉన్నాడు, నేను చావను అని అరుస్తుంది. కానీ గ్రామ పెద్దలు బలవంతంగా కంచిని భర్త శవంతో కలిపి భస్మానికి తీసుకెళతారు.
చితి మండుతుంది. గ్రామస్తులు మంత్రాలు చదువుతారు. కంచి శవం పక్కన కూర్చుని ఏడుస్తుంది. చివరి మూమెంట్‌లో ఆమెకు ఘనశ్యామ్ ముఖం గుర్తొస్తుంది. నా బిడ్డకు అమ్మ కావాలి అని లేచి పరిగెత్తుతుంది. గ్రామస్తులు షాక్ అవుతారు. ఆమె భగవంతుడిని అవమానించిందని కోపంగా వెంబడిస్తారు. కంచి అడవిలోకి పరిగెత్తి, దగ్గర్లోని గుహలో దాక్కుంటుంది. రాత్రి అవుతుంది, ఆమె ఒంటరిగా భయపడుతుంటుంది. ఘనశ్యామ్ రహస్యంగా ఆమె దగ్గరకు వచ్చి ఆహారం, నీళ్లు తెస్తాడు.
Read Also : వర్షంలో లిఫ్ట్ అడిగే అమ్మాయి… స్ట్రేంజర్స్ కన్పిస్తే పారిపోయేలా చేసే మూవీ… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే
కంచి గుహలో దాక్కుని కొన్ని రోజులు గడుపుతుంది. “సతీ అంటే ఏమిటి? మహిళల్ని చంపడమా?” అని ఆమెకు కోపం వస్తుంది. ఒక రోజు ఆమె గుహ నుండి బయటకు వస్తుంది. గ్రామస్తులతో ఇది కరెక్ట్ కాదని ఫైట్ చేస్తుంది. మొదట గ్రామస్తులు కోపంగా ఉంటారు. కానీ కంచి మాటలు వింటారు. ఆమె ఘనశ్యామ్‌ను చూపిస్తూ, ఇతను అనాథ అవ్వడం మీకు ఇష్టమా ? అని ప్రశ్నిస్తుంది. కొందరు మహిళలు ఆమెకు సపోర్ట్ చేస్తారు. గ్రామ పెద్దలు ఆలోచించి సతీ సహగమనం అపాలని డిసైడ్ అవుతారు. ఆ తరువాత ఘనశ్యామ్‌తో కలిసి కంచి స్వతంత్రంగా జీవిస్తుంది.