E-Paper
Advertisement

Jabardast Harikrishna : జబర్దస్త్ పై హరికృష్ణ షాకింగ్ కామెంట్స్.. కన్నీళ్లు తెప్పిస్తున్న లైఫ్ స్టోరీ..

Jabardast Harikrishna : జబర్దస్త్ పై హరికృష్ణ షాకింగ్ కామెంట్స్.. కన్నీళ్లు తెప్పిస్తున్న లైఫ్ స్టోరీ..
Advertisement

Jabardast Harikrishna : బుల్లితెర పై ప్రసారమవుతున్న టాప్ కామెడీ షో లో జబర్దస్త్ ఒకటి.. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ కమెడియన్లు జబర్దస్త్ నుంచి వచ్చి డైరెక్టర్లుగా కూడా మారారు. అయితే ఈ షో ద్వారా ఎంతోమంది లైఫ్ మారినా సరే.. విమర్శలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి.. ఈమధ్య ఈ షోపై పలువురు కమెడియన్లు సంచలన విషయాలను బయటపెడుతున్నారు. ఆ షోలో జరిగే కొన్ని చీకటి కోణాలను బయటపెడుతూ జబర్దస్త్ పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.. ఈమధ్య జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన నటీనటులు అందరూ కూడా జబర్దస్త్ లో జరిగే వాటి గురించి యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూలు బయట పెడుతున్నారు. తాజాగా పెళ్లిచూపులు లేడీ గెటప్ లో ఆకట్టుకున్న హరికృష్ణ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి జబర్దస్త్ లో జరిగే వాటి గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. ఇంతకీ అతను ఏం చెప్పాడో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

లేడీ గెటప్ లు వెయ్యడం ఇబ్బందే..

జబర్దస్త్ లో లేడీ గెటప్ లో కనిపించి అందరినీ కడుపుబ్బ నవ్వించిన హరికృష్ణ తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.. అందులో ఆయన తన గురించి ఎమోషనల్ స్టోరీ ని బయట పెట్టాడు. ఒకప్పుడు లేడీ గెటప్ లో మేము వేస్తే ఆ కామెడీ వేరే లెవెల్ లో ఉండేది.. అయితే ఒకప్పుడు జబర్దస్త్ లో మాకు మంచి డిమాండ్ ఉండేది. గెటప్ లు వేయడానికి మేము తప్ప వేరే వాళ్ళను తీసుకునే వాళ్ళు కాదు. కొన్నిసార్లు మేం నిజంగానే లేడీస్ అని చాలామంది ఇబ్బందులు పెట్టేవారు. ఒకసారి నన్ను లేడీ గెటప్ లో ఉండగా కొందరు ఆకతాయిలు లాక్కొని పొలాల్లోకి తీసుకొని వెళ్లారు. అక్కడ జరిగిన విషయాలను తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తుంది అని అతను లేడీ గెటప్ గురించి పడే ఇబ్బందులను బయట పెట్టాడు.. ఈమధ్య మాకు అవకాశాలు రావడం తక్కువ అయ్యాయి. కానీ కొన్ని ఈవెంట్లు వస్తూ ఉంటే వాటి ద్వారా ఫ్యామిలీని అలా నడిపిస్తున్నాను అని అతను ఎమోషనల్ అయ్యాడు.

జబర్దస్త్ వల్ల నష్టపోయాను.. ఎమోషనల్ స్టోరీ..

Advertisement

బుల్లితెరపై టాప్ కామెడీ షో అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు జబర్దస్త్.. ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ నచ్చింది జబర్దస్త్.. అక్కడ కమెడియన్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఎంతోమంది ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉన్నారు.. అందరూ నటులుగా మాత్రమే కాదు డైరెక్టర్లుగా కూడా సత్తాని చాటుతున్నారు.. ఇప్పటికే ఎంతోమంది జబర్దస్త్ కమెడియన్లు ఇండస్ట్రీని ఏలుతున్నారు. అలాంటి జబర్దస్త్ గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. జబర్దస్త్ లో సీనియర్స్ కంటే జూనియర్స్ కే అవకాశాలు ఎక్కువనే కొందరు యూట్యూబ్ ఛానల్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలలో బయటపెడుతున్నారు. తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చిన లేడీ గెటప్ హరికృష్ణ జబర్దస్త్ లోని చీకటి బాగోతల గురించి బయట పెట్టాడు.. షో కోసం మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. కంపెనీ కాస్ట్యూమ్స్ కాకుండా మేము సొంత కాస్టమ్స్ తో లేడీ గెటప్ వేసుకుని కూర్చుంటే కొన్నిసార్లు స్కిట్ కి పిలుస్తారు. కానీ కొన్నిసార్లు పిలవరు. వాటి ఖర్చు మేము భరించే వాళ్ళం..

Also Read : ప్రభావతి మాటతో ఇంట్లోని వాళ్లు షాక్.. అడ్డంగా ఇరుక్కున్న రోహిణి.. నెక్స్ట్ ట్విస్ట్ ఇదే..

Advertisement

అయితే సీనియర్స్ కు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎప్పుడూ ఇవ్వరు. జూనియర్స్ కైతే పిలిచి మరీ అవకాశాలు ఇస్తారు అది ఎందుకు అన్నది మాకు తెలియదు. కానీ నాకు మాత్రం ఈ కామెడీ స్కిట్లు చేయడం తప్ప మరి ఏ పని రాదు.. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను. అవకాశాలు ఈరోజు కాకపోతే రేపు వస్తాయి అని, నాకు నేనే సర్ది చెప్పుకుంటూ ఫ్యామిలీని ఏదో ఒక పని చేసుకుంటూ పోషించుకుంటున్నాను అని ఎమోషనల్ అయ్యాడు. మళ్లీ జబర్దస్త్ లాంటి షో లలో అవకాశాలు వస్తే నేను నా కుటుంబం చాలా సంతోషంగా ఫీల్ అవుతామని ఆయన అంటున్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవడంతో.. హరికృష్ణ గురించి తెలుసుకున్న పలువురు నెటిజెన్లు ఆయనపై కామెంట్లు చేస్తున్నారు. టాలెంట్ ఉన్న వాళ్లకి ఎప్పుడైనా సరే అవకాశాలు వస్తాయి కాస్త వెయిట్ చేయాలి అంతే..అంటూ కామెంట్లతో అతనికి ధైర్యం చెబుతున్నారు. మరి హరికృష్ణ లాంటి వాళ్ళకి ఇప్పటికైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి..

 

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×