E-Paper
Advertisement

రణబాలి టీజర్ రిలీజ్..’సింగనమల బొబ్బిలి రణబాలి’గా విజయ్ దేవరకొండ

రణబాలి టీజర్ రిలీజ్..’సింగనమల బొబ్బిలి రణబాలి’గా విజయ్ దేవరకొండ
Advertisement

Ranabaali Teaser: విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ప్రధాన పాత్రలలో రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలోప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం “రణబాలి”(Ranabaali). బ్రిటిష్ కాలంలో రాయలసీమ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 16వ తేదీ విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు అన్ని ఏర్పాట్లను చేశారు. ఇకపోతే ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదల చేయడంతో ఈ టీజర్ వీడియో వైరల్ అవుతుంది.

సింగనమల బొబ్బలి రణబాలి..

ఇక ఈ టీజర్ వీడియో చూస్తుంటే మాత్రం 1870 ల కాలంలో రాయలసీమలో కరువు, అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఆహరం కోసం ప్రజల నుంచి దోచుకోవడం, ప్రజలను చిత్రహింసలు పెడుతూ చంపేస్తుంటారు. ఇలా ఆకలి కేకలతో ఎంతోమంది ప్రజలు చనిపోతుండగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రణబాలి వారితో పోరాటం చేస్తారు. ఇలా బ్రిటిష్ వారిని ఎదిరించి రాయలసీమ ప్రజలను రణబాలి ఎలా కాపాడుకున్నారనే నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని చెబుతుంది ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ సింగనమల బొబ్బలి రణబాలి పాత్రలో కనిపించబోతున్నారు విజయ్ నటన మాత్రం హైలెట్ గా ఉండబోతుందని తాజాగా టీజర్ చూస్తేనే స్పష్టం అవుతుంది.

హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ..

Advertisement

ఈ సినిమాలో హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ క్రూరమైన బ్రిటిష్ అధికారి పాత్రలో ప్రధాన విలన్‌గా నటిస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇక రష్మిక మందన్న జయమ్మ పాత్రలో కనిపించబోతున్నారు. మొత్తానికి ఈ సినిమా టీజర్ చూస్తుంటే మాత్రం ఈసారి విజయ్ దేవరకొండ ఖాతాలో సూపర్ బ్లాక్ బాస్టర్ చేరబోతుందని స్పష్టం అవుతుంది. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో ఈ సినిమా ఎంతో ఘనంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు అజయ్ – అతుల్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల కాలంలో విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ అందించని నేపథ్యంలో రణబాలి సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి.

Advertisement

రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత వీరిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలనుకున్నాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్, టీజర్ మాత్రం సినిమాపై భారీగా అంచనాలను పెంచేసాయి మరి అక్టోబర్ 16వ తేదీ దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సింగనమల బొబ్బిలి రణబాలి ఎలాంటి సక్సెస్ అందుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో డైలాగ్స్ మాత్రం అందరిని ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి. విజయ్ దేవరకొండ రష్మిక మందన డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత జంటగా రణబాలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల వీరి అభిమానులు ఆత్రుత కనబరుస్తున్నారు.

Also Read: ‘వీసా స్కామ్ ‘.. మీడియాతో నందన కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే?

Related News

‘దాదా’ మూడ్ లో 80’స్ లోకి వెళ్ళిన బాలయ్య.. న్యూ గెటప్ అదుర్స్ మావా!

టాక్సిక్ డిజాస్టర్ టాక్.. యశ్ ఫస్ట్ రియాక్షన్ ..ఏమన్నారంటే?

ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ స్టోరీ ఇదేనా?

సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న కాలభైరవ, కావ్య.. ఫొటో వైరల్!

ప్రశాంత్ నీల్ హర్రర్ మూవీని రిజెక్ట్ చేసిన CBFC? మరీ అంత డార్క?

సందీప్ రెడ్డి వంగకు విజయ్ కాస్ట్లీ గిఫ్ట్.. ఇది కదా ప్రేమంటే..

‘విశ్వంభర’ మూవీ మళ్లీ వాయిదా పడిందా..? మెగాస్టార్ ఫ్యాన్స్ షాక్..

Big Stories

Advertisement
×