E-Paper
Advertisement

Big TV Kissik Talks: అలాంటివాడే భర్తగా కావాలి.. శ్రీజలో ఈ కోరికలు కూడా ఉన్నాయా?

Big TV Kissik Talks: అలాంటివాడే భర్తగా కావాలి.. శ్రీజలో ఈ కోరికలు కూడా ఉన్నాయా?
Advertisement

Big TV Kissik Talks: ప్రముఖ బిగ్ టీవీ న్యూస్ ఛానల్ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమం ఇప్పుడు మంచి సెలబ్రిటీ టాక్ షోగా మారిపోయింది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు, సీనియర్ హీరోలు , హీరోయిన్లు, బిగ్ బాస్ వంటి రియాల్టీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్నవారు కూడా వచ్చి సందడి చేశారు. అలా 47 ఎపిసోడ్లు ఈ షో పూర్తి చేసుకుంది. ఇక 48వ ఎనిమిది ఎపిసోడ్ లో భాగంగా అగ్నిపరీక్ష షోలో కామన్ కేటగిరిలో సత్తాచాటి హౌస్ లోకి అడుగుపెట్టిన దమ్ము శ్రీజ (Dammu Srija)ఈ షోకి గెస్ట్ గా వచ్చింది. హోస్ట్ జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha) అడిగే ఎన్నో ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

కాబోయే వాడికి అలాంటి లక్షణాలు ఉండాలి..

అందులో భాగంగానే నీకు కాబోయే భర్త ఎలా ఉండాలి ? అని ప్రశ్నించగా.. “పొడుగ్గా ఉండాలి.. అంటే ఆరడుగులు ఉండాలి.. ఈ మధ్యకాలంలో చాలామందికి బట్టతల వచ్చేస్తోంది. కాబట్టి అతడికి జుట్టు ఉండాలి. అని చెబుతూనే.. ముఖ్యంగా అతడికి డ్రింకింగ్ అలవాటు గురించి కూడా చెప్పుకొచ్చింది. డ్రింకింగ్ అలవాటు ఉన్నా నాకు ఎలాంటి సమస్య లేదు. తాగి ఇంటికి వచ్చినా ఇబ్బంది లేదు కానీ రచ్చ చేస్తేనే నాకు అసలు నచ్చదు. అలా నా కాబోయే భర్త చేస్తే మాత్రం వెంటనే విడాకులు ఇచ్చేస్తాను” అంటూ ఊహించని కామెంట్లు చేసింది శ్రీజ.

ప్రేమపై ఊహించని కామెంట్ చేసిన శ్రీజ..

Advertisement

ఇక చాలామంది మీరు సింగిలా లేక ఆల్రెడీ ప్రేమలో ఉన్నారా? లేక ఎవరితోనైనా ప్రేమలో పడడానికి సిద్ధంగా ఉన్నారా ? అనే ప్రశ్న ఆడియన్స్ నన్ను అడుగుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అని వర్షా అడగగా.. పోనీ మీరేమనుకుంటున్నారు అని శ్రీజ తిరిగి ప్రశ్నించింది. వర్ష మాట్లాడుతూ.. “ఇంత దమ్ముగా ఉండే నీతో ఎవరు ప్రేమలో పడతారు” అని వర్ష తన అభిప్రాయం చెప్పగా.. అమ్మాయి అయినా వర్ష మీరే ఇలా అన్నప్పుడు.. ఇంకా అబ్బాయిలు ఎవరు నాతో ప్రేమలో పడతారు.. అంటూ తనదైన శైలిలో కామెంట్ చేసింది. ఇప్పటి వరకు మీరు ప్రేమలో పడలేదా అని ప్రశ్నించగా ఇప్పటివరకు ఒక్క ఐడియల్ కపుల్ నాకు కంటపడలేదు. ఈ జంటను చూస్తే ప్రేమించాలనే ఆలోచన నాలో కలగాలి . కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో పెళ్లయిన వెంటనే గొడవలు పడడం, విడాకులు తీసుకోవడం లేదా ప్రేమించి బ్రేకప్ చెప్పుకోవడం లాంటివి చూస్తుంటే చిరాకేసి ప్రేమ అనే విషయాన్ని జోలికే నేను వెళ్లలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.

ALSO READ:Big TV Kissik Talks: నవ్వుతూ నవ్వించే దమ్ము శ్రీజ కన్నీటి కష్టాలు!

బ్రేకప్ అవ్వడానికి కారణం?

Advertisement

ఈ కాలంలో బ్రేకప్ అవ్వడానికి కారణం అడ్జస్ట్మెంట్ లేకపోవడమే అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది. నువ్వెంత అంటే నువ్వెంత అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఈగో క్లాసెస్, రిలేషన్షిప్, బెంచింగ్, సిట్టింగ్ ఇలా రకరకాల పేర్లతో ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. ప్రపంచంలో ఎన్ని ఫ్రూట్స్ ఉండగా.. ఒక్క ఫ్రూట్ తోనే ఎందుకు ఆగిపోవాలనే ఆలోచన ఈ తరం వారిలో ఎక్కువైంది. సీజన్ ఫ్రూట్స్ మారుతున్నట్టు యువతలో కూడా మార్పులు వస్తున్నాయి. అందుకే బ్రేకప్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటూ చెప్పుకొచ్చింది శ్రీజ మొత్తానికైతే శ్రీజ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

Big Stories

Advertisement
×