E-Paper
Advertisement

స్టోరేజ్ వార్స్ నటుడు ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?

స్టోరేజ్ వార్స్ నటుడు ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?
Advertisement

Film industry:సినిమా ఇండస్ట్రీలో ఊహించని వరుస విషాదాలు అభిమానులను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఊహించని మరణాలు ఇండస్ట్రీకి తీరని లోటు అనే చెప్పాలి. కొంతమంది అనారోగ్య సమస్యలతో మరణిస్తే.. మరికొంతమంది వయసు వృద్ధాప్య కారణాలవల్ల తుది శ్వాస విడుస్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది ఆత్మహత్య చేసుకొని మరణించి అభిమానులనే కాదు సినీ ఇండస్ట్రీని కూడా ఒంటరిని చేస్తున్నారనటంలో సందేహం లేదు. అలా ఇటీవల ఒక ప్రముఖ నటుడు 67 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు.

ఆత్మహత్య చేసుకున్న హాలీవుడ్ నటుడు..

ఆయన ఎవరో కాదు ప్రముఖ రియాలిటీ టీవీ స్టార్ డారెల్ షీట్స్. ఆరిజోనా లోని తన నివాసంలో తుపాకీతో కాల్చుకొని మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు. ఇక ఆయన ఆత్మహత్య చేసుకోవడం హాలీవుడ్ లో విషాదాన్ని నింపింది. ఏ అండ్ ఈ నెట్వర్క్ ప్రసారమైన స్టోరేజ్ వార్స్ సిరీస్ లో ది గ్లాంబ్లర్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. 2010 నుండి 2023 వరకు సుమారుగా 143 ఎపిసోడ్ లలో నటించిన ఈయన 2019లో గుండెపోటు రావడంతో టీవీ రంగానికి దూరమై ఆరిజోనాలోనే యాంటిక్ స్టోర్ నడుపుతున్నారు. అయితే ఇలా తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయం మాత్రం ఇంకా తెలియ రాలేదు.

డారెల్ షీట్స్ వ్యక్తిగత జీవితం..

Advertisement

డారెల్ షీట్స్ వ్యక్తిగత విషయానికి వస్తే.. కిమ్బర్ వుయెర్పెల్ అనే ఆమెను వివాహం చేసుకొని ఒక కొడుకు, కూతురుకి జన్మనిచ్చారు. అయితే కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రోమ్ని స్నైడర్ తో ప్రేమలో పడి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే అనుకోకుండా ఆ నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత మరో మహిళ పాటీ రిచ్ తో కూడా ఈయన డేటింగ్ మొదలుపెట్టారు. అయితే ఆ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇక ఆయన పెళ్లి పీటలు ఎక్కకుండానే ఆత్మహత్య చేసుకుని మరణించారు.

ALSO READ:నటుడు కళ్ళు చిదంబరం .. మెల్లకన్ను వెనుక అసలు రహస్యం ఏమిటంటే?

డారెల్ షీట్స్ పిల్లలు..

Advertisement

ఇక డారెల్ షీట్స్ పిల్లల విషయానికి వస్తే… ఈయన కొడుకు బ్రాండన్ షీట్స్ అందరికీ సుపరిచితుడే. ముఖ్యంగా బ్రాండ్ ఎక్కువగా తన తండ్రితో కలిసి స్టోరేజ్ వార్స్ లో కొన్ని ఎపిసోడ్లలో కనిపించాడు. అలా అందరికీ పరిచయమయ్యాడు బ్రాండ్. ఇకపోతే కూతురు టిఫనీ మాత్రం చాలా వరకు ప్రజల దృష్టికి దూరంగా ఉంది అనే చెప్పాలి. ముఖ్యంగా ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి. కూతురు గురించి మాత్రమే పోస్టుల ద్వారా తెలియజేశాడు. కానీ ఆమె ఎక్కడ ఉంటున్నారు? తల్లి దగ్గర ఉందా? లేక తన తండ్రి దగ్గర ఉందా? అనే విషయం మాత్రం స్పష్టంగా తెలియదు. ఏది ఏమైనా డారెల్ షీట్స్ ఇప్పుడు ఆత్మహత్య చేసుకుని మరణించడంతో హాలీవుడ్ సినీ పరిశ్రమ మూగబోయింది. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Related News

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Big Stories

Advertisement
×