Tollywood:చిత్ర పరిశ్రమలో సీనియర్ నటీనటులు ఒక్కొక్కరు తమ నటనతో, వేషధారణతో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో హాస్య చక్రవర్తి కళ్ళు చిదంబరం కూడా ఒకరు. తమ అద్భుతమైన నటనతో, పెర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకునే ఈయన తన మెల్లకన్నుతో ఊహించని పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే హాస్య చక్రవర్తి అయిన ఈ కళ్ళు చిదంబరం మెల్లకన్ను వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా మెల్లకన్నుతోనే ఆయన ఎందుకు నటించాల్సి వచ్చింది. అసలు ఈ మెల్లకన్ను రావడానికి గల కారణం ఏమిటి? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇటీవల హాస్య చక్రవర్తి అయిన కళ్ళు చిదంబరం కుమారుడు రామకృష్ణ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన తండ్రి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను, మనకు తెలియని సత్యాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన తండ్రికి కళ్ళు చిదంబరం అనే పేరు ఎందుకు వచ్చింది? అనే విషయానికి రామకృష్ణ మాట్లాడుతూ..” మా నాన్నకు సినిమాల కంటే ముందే కళ్ళు చిదంబరం అనే పేరు వచ్చింది. పోర్ట్ ట్రస్ట్ లో ఉద్యోగం చేస్తూనే నాటక రంగంపై తనకున్న ఆసక్తితో నిరంతరం కృషి చేసేవారు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నాన్నగారికి మెల్లకన్ను పుట్టుకతో వచ్చినది కాదు.. చిన్నతనం నుంచే నాటకాల పైన ఉన్న పిచ్చితో నిద్రలేని రాత్రులు గడపడం వల్లే 28 ఏళ్ల వయసులో ఆయనకు మెల్లకన్ను వచ్చిందట. స్క్రీన్ పై హాస్యం పండించే ఆయన ఇంట్లో చాలా సీరియస్ గా ఉండేవారు. బయట విషయాలను ఇంట్లో అస్సలు చర్చించేవారు కాదు.. అమ్మోరు సినిమా విజయం తర్వాత ఆ ప్రజలు ఆయనను అమ్మోరు తల్లి అని పిలవడం మొదలు పెట్టారు. న్యుమోనియా కారణంగా ఆరోగ్యం క్షీణించినా.. చివరి క్షణం వరకు నటించాలని ఆయన తపన అన్నీ వర్ణనాతీతం అంటూ తన తండ్రి గురించి, తన తండ్రికి ఉన్న సినిమా పిచ్చి గురించి రామకృష్ణ తెలిపారు.. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి పిలుపులు మొదలు.. చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం!
కళ్ళు చిదంబరం విషయానికి వస్తే.. మొదట నాటక రంగంలో నటించి కళ్ళు చిత్రంలోని గుడ్డివాడి పాత్ర ద్వారా తెలుగు సినిమా రంగానికి పరిచయం అయ్యారు. ఏప్రిల్ ఒకటి విడుదల చిత్రంలో పాత టీవీలు అమ్మే వాడి పాత్ర పోషించిన ఈయన.. ఈ పాత్ర చిన్నదే అయినా ఈయనకు మంచి గుర్తింపును అందించింది.ఈయన అసలు పేరు కొల్లూరి చిదంబరం. 1945 అక్టోబర్ 10 విశాఖపట్నంలో జన్మించారు. కళ్ళు , అమ్మోరు , చంటి, గోల్మాల్ గోవిందం, పెళ్లి పందిరి ,మనీ, పెళ్లి చేసుకుందాం ,పవిత్ర బంధం ,ఆ ఒక్కటి అడక్కు, అనగనగా ఒక రోజు, అదిరిందయ్యా చంద్రం, తొలి పరిచయం, చంటిగాడు ఇలా ఎన్నో చిత్రాలు ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలా కెరియర్ లో తనకంటూ ఒక ఉన్నత శిఖరాన్ని చూసిన ఈయన 2017 అక్టోబర్ 19న అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. నేడు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటించిన ఎన్నో సినిమాలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి.