E-Paper
Advertisement

Hair Growth Tips: గోళ్లు రుద్దడం వల్ల జుట్టు పెరుగుతుందా ? షాకింగ్ నిజాలు ఇవిగో !

Hair Growth Tips: గోళ్లు రుద్దడం వల్ల జుట్టు పెరుగుతుందా ? షాకింగ్ నిజాలు ఇవిగో !
Advertisement

Hair Growth Tips:ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య జుట్టు రాలడం. పెరిగిన మానసిక ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, పోషకాహార లోపం, విపరీతమైన కాలుష్యం కారణంగా జుట్టు రాలడం, పల్చబడటం, చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం వంటివి సర్వసాధారణమైపోయాయి. ఈ సమస్యల నుంచి గట్టెక్కడానికి మార్కెట్లో లభించే ఖరీదైన షాంపూలు, నూనెలు, ఇతర రసాయన ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే.. ఇవి అందరికీ ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఇలాంటి తరుణంలో మన పురాతన యోగ పద్ధతులు, అమ్మమ్మల కాలం నాటి చిట్కాలు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి.

Advertisement

బాలయం: గోళ్లు రుద్దడం వెనక ఉన్న రహస్యం

సాధారణంగా మనం ఎవరినైనా ఖాళీగా ఉన్నప్పుడు రెండు చేతుల గోళ్లను ఒకదానితో ఒకటి కలిపి రుద్దడం చూస్తుంటాం. దీనిని యోగాలో ‘బాలయం అని పిలుస్తారు. ఇది ఒక పురాతన ,అత్యంత సరళమైన యోగ ముద్ర. మన శరీరంలోని నాడులు, రక్తనాళాలు వేలి గోళ్ల కింద ముగిసి ఉంటాయి. మనం గోళ్లను రుద్దినప్పుడు, ఆ నాడులు ఉత్తేజితమై నేరుగా మెదడుకు, తలలోని రక్తనాళాలకు సంకేతాలను పంపుతాయి. ఈ ప్రక్రియ వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

Advertisement

రక్త ప్రసరణ పెంపు: గోళ్లు రుద్దడం వల్ల తలలోని రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్లకు అందాల్సిన పోషకాలు సక్రమంగా అందుతాయి.

ఒత్తిడి తగ్గింపు: ఈ యోగాసనం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. జుట్టు రాలడానికి ప్రధాన కారణమైన ‘కార్టిసాల్‘ (ఒత్తిడి హార్మోన్) స్థాయిలను ఇది తగ్గిస్తుంది.

మెలనిన్ ఉత్పత్తి: క్రమం తప్పకుండా బాలయం చేయడం వల్ల జుట్టుకు రంగునిచ్చే మెలనిన్ ఉత్పత్తి మెరుగుపడి, జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుందని నమ్ముతారు.

జుట్టును బలపరిచే ఇతర ముఖ్యమైన ఆసనాలు:

కేవలం బాలయం మాత్రమే కాకుండా.. రక్త ప్రసరణను తల వైపు మళ్లించే మరికొన్ని ఆసనాలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

1. ఉత్తనాసన : ఈ ఆసనంలో మనం నిలబడి ముందుకు వంగుతాము. ఇలా చేయడం వల్ల గుండె నుంచి తలకు రక్త ప్రసరణ సులభంగా జరుగుతుంది. రక్త ప్రసరణ పెరగడం వల్ల జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి. ఇది జుట్టు రాలడాన్ని అరికట్టడమే కాకుండా.. జుట్టు నాణ్యతను పెంచుతుంది.

2. శీర్షాసనము : యోగాసనాల్లో దీనిని ‘రాజు’ లాంటి ఆసనంగా పరిగణిస్తారు. తల కిందులుగా నిలబడటం వల్ల మెదడుకు, తలలోని చర్మానికి గరిష్ట స్థాయిలో రక్తం చేరుతుంది. ఇది అకాల నెరవడాన్ని అడ్డుకుంటుంది. అంతే కాకుండా జుట్టు మూలాలను బలోపేతం చేసి కొత్త జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది. అయితే.. దీనిని నిపుణుల సమక్షంలోనే నేర్చుకోవడం ఉత్తమం.

యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు.. అది సంపూర్ణ ఆరోగ్యానికి ఒక మార్గం. ఖరీదైన రసాయన ఉత్పత్తుల వెనక పరుగెత్తే కంటే, ప్రతిరోజూ 10 నుంచి 15 నిమిషాల పాటు బాలయం చేయడం, ఇతర ఆసనాలను సాధన చేయడం వల్ల శాశ్వత పరిష్కారం లభిస్తుంది. సహజ సిద్ధమైన ఈ మార్గాలను మీ లైఫ్ స్టైల్ లో భాగం చేసుకుంటే.. మీరు మీ జుట్టును సహజంగానే ఆరోగ్యంగా, బలంగా , మెరుస్తూ మార్చుకోవచ్చు.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×