E-Paper
Advertisement

Serials Heros : టీవీ సీరియల్ హీరోలు ఎవరు ఏం చదివారో తెలుసా..?

Serials Heros : టీవీ సీరియల్ హీరోలు ఎవరు ఏం చదివారో తెలుసా..?
Advertisement

Serials Heros : తెలుగు బుల్లితెరపై హీరోలుగా చేస్తున్న వాళ్లకి ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్న హీరోలకు మంచి డిమాండ్ ఉంది. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోలు కూడా ఇక్కడ సీరియల్స్ చేస్తూ తమ క్రేజ్ ని పెంచుకుంటూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం తెలుగు సీరియల్స్లలో హీరోలుగా చేస్తున్న వారందరూ ఏం చదివారు అన్న ప్రశ్నలు జనాల్లో వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఫామ్ లో ఉన్న సిగ్నల్ హీరోలు ఎవరు ఎంత చదివారో ఒక్కసారి మనం వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం…

నిరూపమ్ పరిటాల..

తెలుగులో ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు డాక్టర్ బాబు. ఒక తెలుగు చానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.. అసలు పేరు కన్నా ఎక్కువ మంది డాక్టర్ బాబు అని పిలుస్తుండడం విశేషం. ఈ హీరో ఒకప్పుడు సినిమాల్లో నటించి యుటర్న్ తీసుకొని సీరియస్లలోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం బుల్లితెరపై హీరోగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అయితే మన డాక్టర్ బాబు ఏం చదివాడు అన్న ప్రశ్న అభిమానుల్లో వినిపిస్తుంది. ఇంతకీ డాక్టర్ బాబు ఏం చదివాడు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. నిజానికి సీరియల్ హీరో నిరూపం ఎంబీఏ పూర్తి చేశాడట. ఆ తర్వాత సినిమాల్లో నటించాలన్న కోరికతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అవకాశాల కోసం ఎదురు చూశారు.. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ హీరోగా కొనసాగుతున్నారు.

నిఖిల్..

Advertisement

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోలలో నిఖిల్ ఒకరు.. తెలుగులో ఒక్కో సీరియల్ తో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు నిఖిల్. కలిసి ఉంటే కలదు సుఖం సీరియల్, బిగ్ బాస్ ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న నిఖిల్ డిగ్రీ చదివారని తెలుస్తోంది.. ఈయన గోరింటాకు వంటి సీరియల్స్లలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇటీవల బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్ని సీరియల్ లో నటించారు.. దీంతో పాటుగా సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నారు.

అంబటి అర్జున్..

బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న హీరో అంబటి అర్జున్. దేవత సీరియల్ ద్వారా మంచి పాపులర్టిని సంపాదించుకున్నారు. ఆ తర్వాత అగ్నిసాక్షి వంటి సూపర్ హిట్ సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అర్జున్ ఒకవైపు సీరియల్స్ మరోవైపు సినిమాలు చేస్తూ ప్రస్తుతం బిజీగా గడుపుతున్నారు. ఈయన ఎంసీఏ పూర్తి చేశారని తెలుస్తుంది..

రవికృష్ణ..

Advertisement

తెలుగు సీరియల్స్ ద్వారా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు రవికృష్ణ. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సినిమాలో కూడా చేస్తూ బిజీగా ఉన్నారు రవి కృష్ణ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారని తెలుస్తుంది.

శివకుమార్..

తెలుగులో బుల్లితెరపై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సీరియల్ మౌనరాగం. ఈ సీరియల్ ద్వారా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శివకుమార్. ఆ తర్వాత పలు సీరియస్లలో నటించి ప్రేక్షకుల మనసుల్లో హీరోగా ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత ఒక్కో సీరియల్ తో తన క్రేజ్ ని పెంచుకుంటూ ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఈ హీరో బీటెక్ చదివారని తెలుస్తుంది.

Also Read :Podarillu Today Episode : మహాకు ఉద్యోగం వచ్చేసింది..చక్రికీ సర్ప్రైజ్ ఇచ్చిన మహా..ఇది కదా అస్సలు ట్విస్ట్..

వీళ్లే కాదు ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు సీరియల్స్లలో హీరోలుగా నటిస్తున్న వాళ్ళందరూ కూడా మంచి చదువునే చదువుకొని నటనపై ఆసక్తితో ఇలా బుల్లితెరపై అడుగు పెట్టారు. టీవీ సీరియల్ హీరోలు మాత్రమే కాదు అటు హీరోయిన్లు కూడా గ్రాడ్యుయేషన్లు పూర్తిచేసి సీరియల్స్లలో నటిస్తూ ప్రస్తుతం బిజీగా గడుపుతున్నారు…

Related News

Ninnu kori Serial Today Episode September 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: జగదీశ్వరికి ఫోన్ చేసిన విరాట్ – షాక్ అయిన షాలిని

Intinti Ramayanam Today Episode: పార్వతికి నిజం తెలుస్తుందా..? అడ్డంగా దొరికిన పల్లవి.. చివరిలో ట్విస్ట్..

Thursday Movies in Tv : గురువారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

ఆటో రాంప్రసాద్ కు ఓటు వేయద్దు.. ఫాన్స్ కు రిక్వెస్ట్ అంత పగేంటి ఉప్పల్ బాలు!

యాంకర్ గా తొక్కేయడంతోనే ఉదయభాను నిర్మాత అయ్యారా?

యూట్యూబర్ నందన కేసులో బాధితుడు చెప్పిన నిజాలు!

సామాన్యుడిపై సెలబ్రిటీస్ ప్రతాపం.. కప్పు కొట్టేస్తాడని భయమా?

నందనను బిగ్ బాస్ లోకి తీసుకుంటే మర్యాద ఉండదు .. నాగార్జునకు బిగ్ వార్నింగ్!

Big Stories

Advertisement
×