E-Paper
Advertisement

హైదరాబాద్‌లో మరోసారి నేపాలీ గ్యాంగ్ కలకలం.. గచ్చిబౌలిలో భారీ చోరీ!

హైదరాబాద్‌లో మరోసారి నేపాలీ గ్యాంగ్ కలకలం.. గచ్చిబౌలిలో భారీ చోరీ!
Advertisement

Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి నేపాలీ గ్యాంగ్ చేతివాటం ప్రదర్శించింది. గచ్చిబౌలిలోని ప్రముఖ హిల్ రిడ్జ్ విల్లాస్‌లో నివసించే ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు ఒక కేజీ బంగారు ఆభరణాలు, కోట్లాది రూపాయల విలువైన వజ్రాలను దొంగలు దోచుకెళ్లారు.

ఈ దారుణానికి ఆ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్న నేపాల్ దంపతులే ఒడిగట్టినట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. కేవలం నెల రోజుల క్రితమే సదరు వ్యాపారి వీరికి ఆశ్రయమిచ్చి పనిలో పెట్టుకున్నారు. అయితే, ఇటీవల వ్యాపారి తన కుటుంబంతో కలిసి ఒక శుభకార్యం నిమిత్తం ముంబయి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఆ దంపతులు ఇల్లంతా గుల్ల చేసి పరారయ్యారు.

Advertisement

బాధితులు ముంబయి నుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లై ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, రంగంలోకి దిగిన గచ్చిబౌలి పోలీసులు క్లూస్ టీమ్‌తో కలిసి ఆధారాలు సేకరిస్తున్నారు. ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నమ్మినవారే ఇలా ముంచేయడంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

Also Read: ఆన్‌లైన్ బెట్టింగ్ మహమ్మారికి మరో బలి.. నూజివీడులో యువకుడి ఆత్మహత్య!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×