E-Paper
Advertisement

Beer Crisis in Summer: మందుబాబులకు షాక్.. త్వరలో బీర్ల రేట్లు పెంపు ఎంతంటే!

Beer Crisis in Summer: మందుబాబులకు షాక్.. త్వరలో బీర్ల రేట్లు పెంపు ఎంతంటే!
Advertisement

Beer Crisis in Summer: వేసవి కాలం ప్రారంభం కావడంతో చల్లని బీర్లకు డిమాండ్ పెరగడం సహజం. అయితే, ఈసారి పీక్ సమ్మర్‌లో బీర్ల ప్రియులకు చేదు వార్త వినబడే అవకాశం ఉంది. ఒకవైపు ఎండలు మండుతుంటే, మరోవైపు అంతర్జాతీయంగా నెలకొన్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ మేఘాలు బీర్ల ధరలు, సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న క్యూ లైన్లు, రేపు వైన్ షాపుల వద్ద కూడా దర్శనమిచ్చేలా ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బీర్ల ధరల పెరుగుదలకు కేవలం ముడిసరుకు మాత్రమే కాకుండా, ప్యాకేజింగ్ మెటీరియల్ కొరత ప్రధాన కారణంగా నిలుస్తోంది. యుద్ధం కారణంగా ఎర్ర సముద్రం గుండా వచ్చే నౌకలు దారి మళ్లించాల్సి రావడంతో, గ్లాస్ బాటిల్స్, అల్యూమినియం క్యాన్ల తయారీకి అవసరమైన ముడి పదార్థాల దిగుమతులు నిలిచిపోయాయి. దీనివల్ల బాటిళ్ల తయారీ ఖర్చు 15 నుండి 25 శాతం వరకు పెరిగింది. గాజు సీసాల తయారీ పరిశ్రమలకు గ్యాస్ సరఫరా తప్పనిసరి, కానీ ప్రస్తుతం నెలకొన్న ఇంధన సంక్షోభం వల్ల గ్యాస్ ధరలు పెరగడం, కొన్ని ఫ్యాక్టరీలు మూతపడటం ఉత్పత్తిపై దెబ్బతీశాయి.

Advertisement

వేసవిలో సాధారణంగా బీర్లకు 30 నుండి 40 శాతం అదనపు డిమాండ్ ఉంటుంది. అయితే, బాటిళ్ల కొరత కారణంగా కింగ్ ఫిషర్ (యునైటెడ్ బ్రివరీస్), కార్ల్స్‌బర్గ్ వంటి ప్రముఖ కంపెనీలు పూర్తిస్థాయిలో ఉత్పత్తిని చేయలేకపోతున్నాయి. పెరిగిన రవాణా, లాజిస్టిక్స్, ముడిసరుకు ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ధరలను పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని ‘కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్’ (CIABC) ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశాయి. ఒకవేళ ప్రభుత్వాలు ధరల పెంపునకు అంగీకరించకపోతే, కంపెనీలు సరఫరాను తగ్గించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

యుద్ధం ఇలాగే కొనసాగితే మే, జూన్ నెలల్లో మార్కెట్లో బీర్ల కొరత ఏర్పడవచ్చని కంపెనీలు ముందుగానే అలర్ట్ చేస్తున్నాయి. బాటిల్స్ ప్యాకేజింగ్‌కు వాడే లేబులింగ్ టేప్ వంటి ఇతర సామాగ్రి ధరలు కూడా పెరగడం కంపెనీలకు భారంగా మారింది. దీనివల్ల అటు ధరల పెరుగుదల, ఇటు స్టాక్ కొరత రెండు వైపులా వినియోగదారులపై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ముడి చమురు దిగుమతులు ఆలస్యం అవ్వడం వల్ల దాని బై-ప్రొడక్ట్స్ ఉత్పత్తి తగ్గి, అంతర్జాతీయ సప్లై చైన్ పూర్తిగా దెబ్బతింది.

Advertisement

Read Also: Wine Vs Beer Vs Spirit: వైన్, బీర్, స్పిరిట్స్.. వీటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ హానికరం, ఏది బెస్ట్?

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×