E-Paper
Advertisement

Duvvada Madhuri: వాళ్లంతా జెండా కూలీలే.. ఈసారి ఎన్నికల్లో గెలిచేది ఎవరంటే?

Duvvada Madhuri: వాళ్లంతా జెండా కూలీలే.. ఈసారి ఎన్నికల్లో గెలిచేది ఎవరంటే?
Advertisement

Duvvada Madhuri: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై దువ్వాడ మాధురి (Duvvada Madhuri) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాదని, వచ్చేది జగన్ ప్రభుత్వమే అని ఆమె జోస్యం చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చారు. తాజాగా దువ్వాడ మాధురి బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Bigg TV Kissik Talks) కార్యక్రమంలో పాల్గొని.. తన వ్యక్తిగత జీవితం, వ్యాపారం, రాజకీయాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులను జెండా మోసే కూలీలుగా వర్ణించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఈ కార్యక్రమంలో మాధురి మాట్లాడుతూ..

Also Read- Niharika Chiranjeevi: నిహారికాకు అదిరిపోయే కథ చెప్పిన చిరంజీవి… ట్విస్టులు మామూలుగా లేవు!

ఈసారి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డే!

Advertisement

‘‘రాబోయే ఎన్నికలలో కచ్చితంగా మా ఆయన (దువ్వాడ శ్రీనివాస్) గెలుస్తారు. ఆయనకు లక్, నా రూపంలో వచ్చిందని నేను భావిస్తున్నాను. నా రాజాని ఈసారి ఎలక్షన్‌లో నేను గెలిపిస్తా. ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్ అనే కాదు, మాకెప్పుడు పొలిటికల్‌గా ఇష్టమైన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డే (YS Jagan Mohan Reddy). ఈసారి వచ్చే ఎన్నికలలో ఆయనే సీఎం అవుతారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రోడ్లు బాగా లేవని వీడియో పెట్టగానే, రోడ్లు వేస్తున్నారని అంతా అనుకుంటున్నారు.. నిజంగా ఇన్‌స్టా చూసి మోసపోతున్నారు.. రియల్‌గా అక్కడ జరుగుతుంది వేరు. అందుకే మళ్లీ ఈ ప్రభుత్వం వచ్చే అవకాశమే లేదు.

Also Read- Kissik Talks: ఎంతమంది చేసుకోలేదు.. నేనొక్కదాన్నే రెండేసి పెళ్లిళ్లు చేసుకున్నానా? – దువ్వాడ మాధురి

చంద్రబాబు పల్లకి మోస్తూనే ఉంటాడు

Advertisement

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెబుతున్నా.. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమాని కూడా.. వాళ్లు జెండా మోసే కూలీలుగానే మిగిలిపోయారు తప్పితే ఎక్కడా వారికి వేల్యూ లేదు. వాళ్లు పవన్ కళ్యాణ్‌ని సీఎంగా చూడాలని అనుకుంటున్నారు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ ఎప్పటికీ చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తూనే ఉంటాడు. సింగిల్‌గా పోటీ చేస్తే ఎవరు దమ్ము ఏంటనేది తెలుస్తుంది. ఆయనకి ప్రస్తుతం అంత దమ్ము లేదు..’’ అని దువ్వాడ మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమె మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆమె వ్యాఖ్యలు ఎటువంటి వివాదాలకు దారితీస్తాయో చూడాల్సి ఉంది.

Also Read- Kissik Talks: ప్రతి నెలా రూ. 50 లక్షల గోల్డ్ కొంటా.. వర్కర్స్‌కి శాలరీ ఎంత ఇస్తానంటే – మాధురి

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×