E-Paper
Advertisement

Nikhil Siddhartha: మార్కాపురం బస్ యాక్సిడెంట్‌పై నిఖిల్ ఆవేదన.. ప్రధానికి రిక్వెస్ట్!

Nikhil Siddhartha: మార్కాపురం బస్ యాక్సిడెంట్‌పై నిఖిల్ ఆవేదన.. ప్రధానికి రిక్వెస్ట్!
Advertisement

Nikhil Siddhartha: మార్కాపురం సమీపంలో జరిగిన బస్ యాక్సిడెంట్‌ (Markapuram Bus Accident) పై హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) ఆవేదన వ్యక్తం చేశారు. లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లో కర్నూల్ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 19 మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని చనిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చేవెళ్లలో జరిగిన బస్ యాక్సిడెంట్‌లో కూడా తీవ్ర ప్రాణ నష్టం సంభవించింది. అలాగే నంద్యాల జిల్లాలో కూడా ఓ బస్సు ప్రమాదం సంభవించింది. ఇప్పుడు మార్కాపురం రాయవరం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీ కొట్టడంతో, బస్సులో మంటలు చెలరేగాయి. తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాద సమయంలో, బస్సులోని ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు.

Also Read- Ram Charan: పెద్ది షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. షూటింగ్ ఎక్కడంటే?

ప్రభుత్వ పెద్దలకు రిక్వెస్ట్..

Advertisement

అసలేం జరిగిందో తెలిసే లోపే చాలా వరకు సజీవ దహనమయ్యారు. దాదాపు 40 మంది ఈ బస్సులో ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో 10 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారని, ఓ 10 మంది తప్పించుకున్నారని, బస్సు లోపల ఇంకా 20 మంది వరకు ఉండే అవకాశం ఉన్నట్లుగానూ, అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారనేలా వార్తలు వినవస్తున్నాయి. ఇక ఈ ప్రమాదంపై ఇప్పటికే కొందరు రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు హీరో నిఖిల్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్స్ రామ్ ప్రసాద్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లకు వెంటనే ఈ ప్రమాదాలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read- Duvvada Madhuri: వాళ్లంతా జెండా కూలీలే.. ఈసారి ఎన్నికల్లో గెలిచేది ఎవరంటే?

దయచేసి దృష్టి పెట్టండి సార్

Advertisement

‘‘గత ఆరు నెలల్లో నేను చదువుతున్న 4వ బస్సు ప్రమాదం ఇది. ఈ ప్రమాదాల్లో దాదాపు 100 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఎప్పుడు ఆగుతుంది? దీనిపై కఠినమైన, తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, రవాణా సంస్థలను అధికారులు తక్షణమే తనిఖీ చేయాలి, అలాగే క్రమబద్ధీకరించాలి. దయచేసి దీనిపై దృష్టి సారించండి సార్’’ అంటూ పైన పేర్కొన్న మంత్రులకు ఆయన రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం నిఖిల్ ట్వీట్ వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్లు కూడా తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ‘‘ఇది చాలా ఘోరమైన ఘటన. బాధితులకు వెంటనే న్యాయం చేసి, ఈ ఘటనకు కారణమైన వారికి శిక్ష పడేలా చూడాలి. బస్సు ప్రమాదాలను తగ్గించాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ యాజమాన్యం పై కఠినమైన కొరడా ఝళిపించాలి’’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలేమైనా తీసుకుంటాయేమో చూద్దాం..

Also Read- Kissik Talks: ఎంతమంది చేసుకోలేదు.. నేనొక్కదాన్నే రెండేసి పెళ్లిళ్లు చేసుకున్నానా? – దువ్వాడ మాధురి

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Private: హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×