E-Paper
Advertisement

Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కాకపోతేనేం.. అంతకుమించిన అవార్డ్‌నే ఇచ్చారుగా?

Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కాకపోతేనేం.. అంతకుమించిన అవార్డ్‌నే ఇచ్చారుగా?
Advertisement

Emmanuel: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేత (Bigg Boss Telugu Season 9)గా కళ్యాణ్ నిలిచిన విషయం తెలిసిందే. రన్నరప్‌గా తనూజ నిలిచారు. మూడో స్థానం డిమోన్ పవన్ సొంతం చేసుకున్నారు. విన్నర్ అవుతాడని అనుకున్న ఇమ్మానుయేల్‌ (Emmanuel) మాత్రం నాల్గవ స్థానానికే పరిమితమయ్యారు. ఈ విషయంలో చాలా మంది డిజప్పాయింట్ అయ్యారు. కళ్యాణ్ పడాల కంటే ఈ సీజన్‌ను ఎంటర్‌టైనింగ్‌గా మలిచింది ఎవరయ్యా? అంటే గెలిచిన ఆ విన్నర్ కూడా ఇమ్మానుయేల్ పేరే చెబుతాడు. అలా, హౌస్‌లోని వాళ్లని, ఈ షో చూస్తున్న ప్రేక్షకులని ఆయన ఎంటర్‌టైన్ చేశాడు. కానీ, చివరికి వచ్చే సరికి విన్నర్ కాలేకపోయారు. అప్పుడు విన్నర్ కాలేకపోతేనేం.. ఇప్పుడు అంతకు మించిన అవార్డును నిఖిల్ చేతుల మీదుగా ఇమ్మానుయేల్ తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Mrunal Thakur: ఆ పనిచేయడంతోనే ధనుష్ తో  పెళ్లి రూమర్లు.. ధనుష్ తో సినిమా పై మృణాళ్ క్లారిటీ!

ఆదివారం సాయంత్రం 6 గంటలకు

Advertisement

బీబీ ఉత్సవం అంటూ స్టార్ మా ప్రసారం చేయబోతున్న కార్యక్రమానికి సంబంధించి ఓ ప్రోమోను వదిలారు. రాము రాథోడ్ సాంగ్‌తో మొదలైన ఈ ప్రోమో నవ్విస్తూ, హార్ట్ టచ్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇమ్మానుయేల్ ఎపిసోడ్ బాగా హైలెట్ అవుతోంది. ఈ షో‌లో బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 9కు వచ్చిన కంటెస్టెంట్స్ మొత్తం హాజరయ్యారు. శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చిన యంగ్ హీరో నిఖిల్.. ఇమ్మనుయేల్ మదర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తన కెరీర్‌కు తన తల్లిదండ్రులు ఎంతగా సపోర్ట్ చేశారో ఈ కార్యక్రమంలో చెప్పారు.

Also Read- Pan India No 1 Hero: ప్రభాస్‌ను మించిపోతున్న మరో పాన్ ఇండియా హీరో.. రాబోయే సినిమాల లైనప్ మామూలుగా లేదుగా..!

ఆల్ రౌండర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9

Advertisement

‘‘ప్రతి పర్సన్ వెనుక పేరెంట్స్ ఉంటారు. నా జర్నీ ‘హ్యాపీడేస్’తో మొదలైనప్పుడు మా అమ్మనాన్నలు నన్ను ఎంతగానో ప్రోత్సాహించారు. ఇమ్ము వాళ్ల మదర్‌ని చూస్తుంటే మా మదరే గుర్తొస్తున్నారు’’ అంటూ ‘ఆల్ రౌండర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9’ అనే ట్రోఫీని ఇమ్మానుయేల్‌కు నిఖిల్ అందించారు. ప్రస్తుతం ఈ ప్రోమో బాగా వైరల్ అవుతోంది. ఇందులో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో అడుగు పెట్టిన వారంతా ఉండటం విశేషం. ఈ ట్రోఫీతో బిగ్ బాస్ తెలుగు సీజన్ విన్నర్ కాలేకపోయిన ఇమ్మానుయేల్.. అంతకంటే పెద్ద అవార్డును గెలుపొందాడని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆల్ రౌండర్ అవార్డును సొంతం చేసుకోవడమంటే సామాన్య విషయం కాదు. అక్కడ కొట్టలేకపోయినా, ఇక్కడ కొట్టావ్ అంటూ ఇమ్ము ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read- Pre-Release Dialogues: హనుమాన్ కోసం సీటు.. నుంచి 1100 కోట్లు పక్క వరకు.. సెలబ్రిటీలు చెప్పిన క్రేజీయెస్ట్ ప్రీ-రిలీజ్ మాటలు ఇవే..!

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×