Petrol Pump Video: ఛత్తీస్ గఢ్ లో దారుణ ఘటన జరిగింది. పెట్రోల్ బంక్ లో సిగరెట్టు కాల్చొద్దన్నందుకు ఓ ఆకతాయి.. బైక్ పెట్రోల్ ట్యాంక్ కు నిప్పుపెట్టాడు. మంటలు పెట్రోల్ కొట్టే పైపునకు వ్యాపించాయి. ఫిబ్రవరి 18న రాయ్‌పూర్‌లోని ఒక పెట్రోల్ బంక్ వద్ద మోటార్ సైకిల్‌కు నిప్పంటించడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీ వీడియో వైరల్ అవుతుంది.
ఉర్లా ప్రాంతంలోని కర్మ చౌక్ సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ వద్దకు బుధవారం రాత్రి ఇద్దరు యువకులు మోటార్ సైకిల్‌కు పెట్రోల్ కోసం వచ్చారు. పెట్రోల్ బంకు సిబ్బంది ట్యాంక్ నింపడం ప్రారంభించగానే, బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి దిగి సిగరెట్ వెలిగించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో బైక్ ఉన్న వ్యక్తి అతడి కాస్త దూరం నెట్టాడు. అతడు కోపంగా లైటర్‌ను బైక్ పెట్రోల్ ట్యాంక్‌లో వేశాడు. దీంతో ఒక్కసారిగా మోటార్ సైకిల్‌తో పాటు పెట్రోల్ బంక్ పంపు నుంచి మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో బైకర్, పెట్రోల్ పంపు ఉద్యోగి ఇద్దరూ పారిపోయారు. పెట్రోల్ బంక్ లో ఉన్న మరో సిబ్బంది వెంటనే స్పందించి పెట్రోల్ సప్లై ఆపివేశాడు. CO2 సిలిండర్ తో మంటలను ఆర్పివేశాడు. మండుతున్న పెట్రోల్ కాస్త.. మంట పెట్టిన యువకుడిపై పడింది.
పెట్రోల్ బంక్ సిబ్బంది ఫిర్యాదుతో.. సీసీటీవీ ఆధారంగా, నిందితులను ఉర్లాలోని బిర్గావ్‌కు చెందిన ధర్మేంద్ర సింగ్, ఇమ్రాన్ ఖురేషిగా గుర్తించారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత, ఇద్దరు యువకులు పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ పెట్రోల్ బంక్ సిబ్బంది వారిని పట్టుకుని పోలీసులకు ఫోన్ చేశారు. ఉర్లా పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.
Man lights fire at petrol pump in Raipur. Staff rush to stop disaster…
🚨 CCTV footage shows a man setting fire near a petrol pump nozzle at Sangeeta Fuels, Raipur, Chhattisgarh. Staff acted fast to prevent disaster. Both accused arrested. pic.twitter.com/3r6ey6uFtU— contentkikamii (@contentkikamii) February 20, 2026
Also Read: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కోమటిరెడ్డి వెర్షన్ 2.0.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా!?
2024లో ఈ తరహా ఘటన హైదరాబాద్‌లోని ఒక పెట్రోల్ బంక్ లో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఒక వ్యక్తి పెట్రోల్ బంక్ కు నిప్పుపెట్టాడు. చిరాన్ అనే వ్యక్తి సిగరెట్ లైటర్ పట్టుకుని బంక్ కు వచ్చాడు. పెట్రోల్ బంక్ సిబ్బంది.. వెలిగించడానికి ప్లాన్ చేస్తున్నావా? అని అడిగారు. మరో వ్యక్తి చిరాన్‌ను రెచ్చగొట్టారు. దీంతో చిరాన్.. పెట్రోల్ కొడుతున్న సమయంలో లైటర్ వెలిగించాడు. ఆ సమయంలో పెట్రోల్ పంప్ వద్ద ఇద్దరు సిబ్బంది సహా 10 నుంచి 11 మంది ఉన్నారు.