E-Paper
Advertisement

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!
Advertisement

Nepal Floods: నేపాల్‌లో సంభవించిన అకస్మిక వరదలు.. అక్కడి ప్రజలను తీరని శోకంలో ముంచెత్తాయి. వరదల్లో గల్లంతైన వందలాది మంది కోసం గత నాలుగైదు రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతుండగా.. నేపాల్ పోలీసులకు మరో కొత్త సవాలు వచ్చి పడింది. వరద ఉధృతికి కనీసం 20 బ్యాంకులకు చెందిన సేఫ్టీ వాల్ట్‌లు (భద్రతా లాకర్లు) కొట్టుకుపోవడం లేదా బురదలో కూరుకుపోవడంతో పోలీసులకు అతిపెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు వాటిని వెతికి పట్టుకోవడం అత్యంత సవాలుగా పరిణమిస్తోంది.

వరదలతో కొట్టుకుపోయిన డిపాజిట్లు

రసువా (Rasuwa), ధాడింగ్ (Dhading), చిత్వాన్ (Chitwan) వంటి ప్రాంతాల్లోని బ్యాంకులు వరద ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయని నేపాల్ డీఐజీ అబి నారాయణ్ కాఫ్లే (Abi Narayan Kafle) వెల్లడించారు. వీటిలోని వాల్ట్‌లలో భారీ ఎత్తున నగదుతో పాటు బంగారం, ఇతర విలువైన వస్తువులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి వరద నీటిలో కొట్టుకుపోవడమో లేదా బురద కింద కూరుకుపోవడమో జరిగిందని ఆయన తెలిపారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఈ వాల్ట్‌లు వెళ్లకుండా భద్రపరచడం ఇప్పుడు పోలీసులకు అతిపెద్ద సవాలుగా మారిందని ఆయన చెప్పుకొచ్చారు.

చోరీ యత్నం.. 29 మంది అరెస్ట్

Advertisement

మరోవైపు తమ ప్రాంతానికి కొట్టుకొచ్చిన మనీ లాకర్లను స్థానికులు దోచేస్తున్న ఘటనలు నేపాల్ లో చోటుచేసుకుంటున్నాయి. అప్పర్ రసువా ప్రాంతం నుంచి కొట్టుకువచ్చిన ఒక బ్యాంక్ వాల్ట్ నుంచి సుమారు 92 లక్షల నేపాలి కరెన్సీని దొంగిలించినందుకు ధాడింగ్ జిల్లా పోలీసులు 29 మందిని అరెస్టు చేశారు. ప్రస్తుతం వరద ప్రభావిత బాధితులను కాపాడటంతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించడం కూడా తమకు కీలక బాధ్యతగా మారిందని డీఐజీ పేర్కొన్నారు.

రూ.కోట్ల విలువైన వాల్ట్ సేఫ్

వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంక్ వాల్ట్ లను కనుగోనేందుకు నేపాల్ పోలీసులు శ్రమిస్తున్నారు. రెంటు చోట్ల రూ.కోట్ల విలువైన వాల్ట్‌లను గుర్తించి భద్రపరిచారు. త్రిశూలిలోని ‘అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ బ్యాంక్’ ధుంగే శాఖకు చెందిన వాల్ట్‌ను దాదాపు 8 గంటల పాటు శ్రమించి స్వాధీనం చేసుకున్నారు. ఈ వాల్ట్‌లో NPR 1.5 కోట్ల నగదుతో పాటు సుమారు NPR 50 కోట్ల విలువైన బంగారం, ఇతర వస్తువులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. అలాగే నువాకోట్‌లోని ‘కృషి వికాస్ బ్యాంక్’ వాల్ట్‌ను కూడా పోలీసులు సురక్షితంగా వెలికితీశారు.

Advertisement

Also Read: సనాతన ధర్మం.. ట్రోలర్స్ కి మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ.. వీడియో వైరల్ !

కొనసాగుతున్న సహాయక చర్యలు

ఇదిలా ఉంటే ప్రస్తుతం నేపాల్‌లో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ సహాయక చర్యల కోసం దాదాపు 7,894 మంది పోలీసు సిబ్బందిని రంగంలోకి దించినట్లు పోలీసు ప్రతినిధి వెల్లడించారు. ఒకవైపు గల్లంతైన మానవ ప్రాణాలను కాపాడటం, మరోవైపు ప్రజల సొత్తును అసాంఘిక శక్తుల బారిన పడకుండా రక్షించడం కోసం రెస్క్యూ టీమ్‌లు శ్రమిస్తున్నాయి.

Also Read: బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Tags

Related News

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

నేపాల్ వరద.. డ్యామ్‌లే కొట్టుకుపోయాయ్, ఈ ఇల్లు తప్పా! అదెలా?

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. హోర్ముజ్ జలసంధి భద్రతపై చర్చ? యుద్ధం తర్వాత నేరుగా..

హర్మూజ్‌ జలసంధిలో యుద్ధమేఘాలు.. రాకెట్ల సాయంతో సముద్రంలోకి సీమైన్స్‌, పేల్చిన అమెరికా

బ్యాంకులు, ఆసుపత్రులు, ఎయిర్‌పోర్ట్, నైట్‌క్లబ్‌లు ఎక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు.. స్పాట్ రెజిస్ట్రేషన్..

షాపింగ్ మాల్ కోసం.. 200 ఏళ్ల నాటి గురుద్వారా కూల్చివేత.. పాక్‌ను ఏకిపారేస్తున్న సిక్కులు!

యురేనియం డీల్, ఫ్రీ వీసా, పౌర పురస్కారం.. ప్రధాని ఉజ్బెకిస్థాన్ పర్యటన సూపర్‌ హిట్!

Big Stories

Advertisement
×