E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Ravi : ‘గుండెనిండా గుడిగంటలు’ రవి రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్..?

Gundeninda Gudigantalu Ravi : ‘గుండెనిండా గుడిగంటలు’ రవి రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్..?
Advertisement

Gundeninda Gudigantalu Ravi : ప్రస్తుతం బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ప్రసారమవుతున్నాయి.. ఈమధ్య ప్రతి సీరియల్ కూడా డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మొన్నటి వరకు లవ్ అండ్ ఎమోషనల్ స్టోరీ లతో సీరియల్స్ వస్తే.. ఈమధ్య ఫ్యామిలీ డ్రామాఈమధ్య ఫ్యామిలీ డ్రామా, రివేంజ్ స్టోరీలతో సీరియల్స్ వస్తున్నాయి. అయితే ఏ స్టోరీ తో వచ్చినా సరే తెలుగు ప్రేక్షకులు ఆ సీరియల్ ని బాగా ఆదరిస్తున్నారు. దానితో సీరియల్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి వాటిలో గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఒకటి.. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారమవుతుంది.. ఇందులో సత్యం మూడో కొడుకుగా రవి నటిస్తున్నాడు.. రవి అసలు పేరు బాబీ.. ఈయన రియల్ లైఫ్ గురించి, అలాగే రెమ్యూనరేషన్ గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

బాబీ రియల్ లైఫ్..

స్టార్ మాలో సక్సెస్ ఫుల్ స్టోరీతో ప్రసారం అవుతున్న సీరియల్స్ లలో ఒకటి గుండెనిండా గుడిగంటలు.. ఈ సీరియల్ లో రవి పాత్రలో నటిస్తున్న వ్యక్తి పేరు బాబీ.. ఇతను ఆంధ్రకు చెందిన వ్యక్తి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ఈయన స్వస్థలం. తిరుపతికి చెందిన రవి తన అక్క సీరియల్స్ లో నటిస్తున్న వల్ల అతనికి కూడా నటనపై ఆసక్తి కలిగింది. ఆమె కన్నడ తమిళ్ వంటి సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉంది. నటనపై ఆసక్తి కలిగిన రవి కూడా హైదరాబాదుకు వచ్చి సీరియల్స్లలో నటించేందుకు ఆడిషన్స్ ఇచ్చాడు. అలా తనకు సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. మొదట మౌనపోరాటం అనే సీరియల్ లో నటించాడు. ఆ తర్వాత కుంకుమపువ్వు సీరియల్ లో ఒక చిన్న పాత్రలో నటించాడు.. అంతేకాదు బాబీ సీరియల్స్ తో పాటుగా కొన్ని చిన్న సినిమాలలో కూడా నటించాడు. అయితే ఆ సినిమాలు విడుదల కాలేదు. ప్రస్తుతం స్టార్ మా లో సక్సెస్ఫుల్ టాక్ తో రన్ అవుతున్న గుండె నిండా గుడి గంటలలో నటిస్తున్నాడు. అలాగే పడమటి సంధ్యారాగం అనే సీరియల్లో కూడా నటిస్తున్నాడు.

Advertisement

Also Read :లీడర్ బోర్డులో స్కోర్ కోసం యుద్ధం.. తనూజ vs సంజన వార్.. ఇమ్మూ పై భరణి సీరియస్.. రచ్చ రచ్చే.

రవి ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

గుండె నిండా గుడి గంటలు రవి అలియాస్ బాబీ నటించిన ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి. మౌన పోరాటం సీరియల్ లో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇదే అతని మొదటి సీరియల్ కావడం విశేషం. అయితే ఇప్పటివరకు మూడు నాలుగు సీరియల్స్ లో నటించిన రవి రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అతని రెమ్యూనిరేషన్ ఒక రోజుకి 15 వేలకు పైగా ఉంటుంది. ఈ సీరియల్ షూటింగు దాదాపు 20 రోజులకు పైగా నెలలో ఉంటుంది. అందులోనూ ప్రతి ఎపిసోడ్లోనూ రవి కనిపిస్తాడు.. దాంతో అతను నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడని తెలుస్తుంది.. ఈయన ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలు సీరియల్ తో పాటుగా మరో సీరియల్ లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు.

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×