E-Paper
Advertisement

OTT Movie : తల్లి లవ్ స్టోరీకి కొడుకు సపోర్ట్… మైండ్ బ్లోయింగ్ ప్రేమ కథ

OTT Movie : తల్లి లవ్ స్టోరీకి కొడుకు సపోర్ట్… మైండ్ బ్లోయింగ్ ప్రేమ కథ
Advertisement

OTT Movie : లెస్బియన్ థీమ్‌ ని చాలా రియలిస్టిక్‌గా ఒక షార్ట్ ఫిల్మ్ చూపిస్తోంది. ముంబై స్లమ్ బ్యాక్‌డ్రాప్‌లో మధ్య వయసు మహిళల లవ్ స్టోరీని, ట్రెండీగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఈ షార్ట్ ఫిల్మ్ లవ్ అనేది ఎప్పుడైనా, ఏ వయస్సులో అయినా, ఎవరి మీద అయినా పుడుతుందనే ఒక మెసేజ్ ఇస్తుంది. సీక్రెట్ గా సాగే వ్యవహారం ఒక్క సారిగా బయట పడటంతో స్టోరీ ఆసక్తికర ముగింపును ఇస్తుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

2021లో వచ్చిన ఈ ఇండియన్ షార్ట్ ఫిల్మ్ పేరు ‘మై మదర్స్ గర్ల్‌ఫ్రెండ్’ (My Mother’s Girlfriend). అరుణ్ ఫులారా దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. 20 నిమిషాల ఈ స్టోరీలో సుషమా దేశ్‌పాండే (రేనుక), అంజు అల్వా నాయక్ (సదియా), సుహాస్ సిర్సాట్ (మంగేష్) లీడ్ రోల్స్ లో నటించారు. ప్రస్తుతం ఇది MUBI, Lesflicksలో స్ట్రీమింగ్‌లో ఉంది. ఐయండిబిలో 6.8/10 రేటింగ్ పొందింది. ఇది ముంబై క్వీర్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రేనుక అనే 50 ఏళ్ల మహిళ ముంబై స్లమ్‌లో కొడుకు మంగేష్, మనవడితో కలిసి ఉంటుంది. రోజంతా హార్డ్ వర్క్ చేసి ఇంటికి వచ్చి వీళ్ళకి భోజనం వండుతుంది. ఫ్యామిలీకి పెద్ద బాధ్యత. కానీ ఆమెకి ఒక సీక్రెట్ హ్యాపీనెస్ ఉంది. పొరుగింట్లో ఉండే సదియా అనే మహిళతో లవ్ లో ఉంటుంది. ఇద్దరూ వయసులో పెద్ద వాళ్లే, ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి, ప్రస్తుతం భర్తలు లేరు. రోజూ సాయంత్రం ఇద్దరూ కలిసి టైమ్ స్పెండ్ చేస్తారు. ఇద్దరికీ ఇది రెండో జీవితం లాంటిదని ఆనందంలో ఉంటారు.

Read Also : భర్తతో బోరింగ్ లైఫ్… ఒకే గదిలో ఒంటరిగా ప్రియుడితో… ఒక్కో సీన్ మెంటల్ మాస్ మావా

ఒక రోజు రేనుకా బర్త్‌డే కావడంతో సదియా స్పెషల్‌గా ప్లాన్ చేస్తుంది. ఇద్దరూ మార్కెట్‌కి వెళ్తారు. వడా పావ్ తింటూ, బీచ్ మీద నడుస్తూ, చిన్న గిఫ్ట్ ఇచ్చుకుంటారు. సదియా రేనుక కలిసి కిస్ చేసుకుంటారు. ఆ రోజు వాళ్లకి ప్రపంచమంతా వాళ్లదే అనిపిస్తుంది. రాత్రికి వీళ్ళిద్దరూ ఏకాంతగా గడపడానికి సిద్దపడతారు. కానీ అదే రోజు రేనుక కొడుకు మంగేష్ అమ్మకి సర్‌ప్రైజ్ ఇద్దామని బయటకు వస్తాడు. దూరంగా నుంచి అమ్మని, సదియాని కలిసి చూసేస్తాడు. దీంతో స్టోరీ పీక్స్ కి వెళ్తుంది. మంగేష్ సీరియస్ గా రియాక్ట్ అవుతాడు. ఆ తరువాత ఏమవుతుందనేది ఈ షార్ట్ ఫిల్మ్ ని చూసి తెలుసుకోండి.
Advertisement

 

 

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×