Gundeninda gudigantalu Rohini: బుల్లితెర పై డైలీ ప్రసారమవుతున్న సీరియల్స్ లలో ఎక్కువ మంది స్టార్ మా ఛానెల్స్ లో వస్తున్న సీరియల్స్ ను ఎక్కువగా చూస్తున్నారు. ప్రస్తుతం స్టార్ మా సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్స్ పరంగా టాప్ ఫైవ్‌లో ఒకటిగా గుండె నిండా గుడి గంటలు సీరియల్ కొనసాగుతోంది. ఒకనొక టైమ్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో ఉన్న బ్రహ్మముడి సీరియల్‌కు గుండె నిండా గుడి గంటలు గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పుడు బ్రహ్మముడి డౌన్ అయ్యింది. గుండెనిండా గుడి గంటలు టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. మధ్యతరగతి కుటుంబంలోని ఒక మహిళ డబ్బు మీద ఆశతో తన కోడలను డబ్బున్న ఇంటి నుంచి తెచ్చుకోవాలని అనుకుంటుంది. పేద ఇంటి నుంచి వచ్చిన కోడల్ని ఎలా చూస్తుంది అనేది ఈ సీరియల్ స్టోరీ. ఇందులో మొదటి కోడలుగా రోహిణి పాత్ర లో నటించిన జ్యోతిక. ఈమె బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా మందికి తెలియదు. గతంలో ఈమె ఏదైనా సీరియల్స్ చేసిందా..? ఈమె గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రోహిణి పాత్రలో జ్యోతిక..
ఈ సీరియల్ మొదలైనప్పుడు రోహిణి పాత్రలో తులసి కృష్ణ నటించింది.. కొన్ని నెలల క్రితం ఆమె పాత్రలో జ్యోతిక ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో రాధమ్మ కూతురుతో పాటు పలు సీరియల్స్ లో కనిపించింది తులసి కృష్ణ. మై విలేజ్ సర్పంచ్ పేరుతో గతంలో తెలుగులో ఓ మూవీ చేయబోతున్నట్లు ప్రకటించింది.. గోరంత దీపం, గోరింటాకు, అభిషేకం వంటి పలు తెలుగు సీరియల్స్ లో నటించింది. కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈమె ఒక్కో రోజుకు 20 వేల వరకు రెమ్యూనరేషన్ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. నెలకు లక్షల్లో ఈమె సంపాదిస్తుంది.
Also Read :ఇమ్మానుయేల్ పరువు తీసిన ప్రదీప్.. నోరు జారిన రీతూ..రచ్చే..
సీరియల్ లో ట్రెడిషినల్ .. బయట హాట్ లుక్
ఈమధ్య బుల్లితెర నటీ, నటులు సోషల్ మీడియాలో ఎక్కువగా గడుపుతున్నారు.. సినీ నటుల కన్నా ఎక్కువగా ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. సీరియల్ అమ్మాయిలు గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా సరిపోదు. ఒకవైపు సీరియల్స్లలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న.. మరోవైపు సోషల్ మీడియా లో యూత్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఈమధ్య ఎక్కువగా ట్రెండీ వేర్ లో దర్శనం ఇస్తున్నారు. ఆ ఫోటోలను చూసిన సీరియల్ అభిమానులు ఆమె ఇమేన అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అమ్మడు కూడా సీరియల్ లో పద్దతిగా డ్రెస్ లలో కనిపిస్తుంది. బ్యూటిషన్ పాత్రలో నటిస్తున్న కూడా చాలా సింపుల్గా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం ఈమె ఫోటోలను చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. హాట్ అందాల తో కుర్ర కారు మనసు దోచుకుంటుంది.. ఆమె పిక్స్ పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి ఇటు ఓ లుక్ వేసుకోండి..