Cooku With Jathirathnalu : బుల్లితెరపై ఎన్నో రకాల షోలు ప్రసారమవుతుంటాయి. ఈమధ్య ఒక దానికి మించి మరొకటి ఉండడంతో ప్రేక్షకులు ఎక్కువగా షోలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రముఖ ఛానల్ స్టార్ మా లో ఎన్నో ప్రోగ్రాములు వస్తుంటాయి.. తాజాగా యాంకర్ ప్రదీప్ హోస్ట్గా వ్యవహరిస్తున్న కుకు విత్ జాతిరత్నాలు షో ప్రోమో ను స్టార్ మా రిలీజ్ చేసింది. పాన్ ఇండియా స్టార్స్‌లా పాన్ ఇండియా డిషెస్ అనే థీమ్‌తో కుకు విత్ జాతిరత్నాలు లేటెస్ట్ ఎపిసోడ్‌ని ప్లాన్ చేశారు. ఇక పాన్ ఇండియా స్టార్స్ పేరుతో హీరోహీరోయిన్ల గెటప్స్ వేసుకొని బుల్లితెర సెలబ్రెటీలు నవ్వులు పూయించారు. టాలీవుడ్ హీరోయిన్ రాధ, ఆశిష్ విద్యార్థి, సంజయ్ తుమ్మ జడ్డీలుగా ఉన్నారు.. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
ఇమ్మాన్యుయేల్ పై ప్రదీప్ పంచులు..
ప్రోమో మొదలవగానే.. ముందుగా యాంకర్ ప్రదీప్ వంటల గురించి చెప్తాడు.. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్‌లోని రామ్ చరణ్-ఎన్టీఆర్ గెటప్‌లో ఇమ్మానుయేల్-ఎక్స్‌ప్రెస్ హరి వచ్చారు. ఇమ్మూని చూడగానే సార్ మీరు ఎవరూ అంటూ సీరియల్ నటి సుజిత అడిగింది. నేను ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్‌ని అని ఇమ్మూ చెప్పేసరికి అందరూ అవాక్కయ్యారు.. వాడెవడో బయట నేను వస్తుంటే మీరు సునీల్ శెట్టి కదండీ అని అడిగారు అంటూ ఇమాన్యుయల్ అంటాడు. ఆ తర్వాత ఏది నా ఆలియా భట్ ఏది అని ఇమ్మూ అంటాడు. పైన బట్ట కింద పొట్ట నీకు అలియా భట్ కావాలా అంటూ లైవ్ లోనే ప్రదీప్ ఇమ్మానుయేల్ పరువు మొత్తం తీసేస్తాడు. ప్రదీప్ ఎంత అంటున్న సరే ఇమ్ము మాత్రం ఏమీ అనకుండా విగ్గు గురించి మాట్లాడి అందరిని నవ్విస్తాడు. రెండు గంటలు కష్టపడి సెట్ చేసుకున్న విగ్గుని ఇలా పీకేస్తావ్ ఏంటి అన్న అని అంటాడు. నేను రెండు నిమిషాల్లో నీకు సెట్ చేస్తాను రా అని ప్రదీప్ అంటాడు వీరిద్దరి మధ్య కామెడీ కాస్త ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
Also Read :బిగ్ బాస్ లోకి పచ్చళ్ళ పాప ఎంట్రీ పక్కా..ఫుల్ లిస్ట్ ఇదే..?
శివగామి గెటప్ లో రీతూ..
ఈ ఎపిసోడ్ మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్క గేటప్ లో కనిపిస్తారని ప్రోమోన్ చూస్తే అర్థమవుతుంది. సుహాసిని అతిలోక సుందరి అంటూ శ్రీదేవి గెటప్ లో కనిపిస్తుంది. ఆమె రాగానే ప్రదీప్ మీరు ఎవరండీ అని అడుగుతాడు. దానికామె అతిలోకసుందరి అంటే.. అవును బాగా అతి అని ప్రదీప్ గాలి తీసేస్తాడు. ఇక రీతూ చౌదరి అయితే బాహుబలిలో శివగామి గెటప్‌ల ో వచ్చింది. కట్టప్ప మన రాజ్యంలో మన గురించి టాక్ ఏంటని రీతూ అడిగితే కత్తిలా ఉన్నారంటున్నారని పంచ్ వేశాడు ఇమ్మూ. ఇలా ప్రోమో అయితే ఫుల్ కామెడీగా ఉంది.. శని ఆదివారాల్లో ఈ షో ప్రసారం అవుతుంది. ఇందులో యష్మీ గౌడ, సుజిత, విష్ణుకాంత్ సహా పలువురు బిగ్‌బాస్, సీరియల్ సెలబ్రెటీలు ఇందులో సందడి చేస్తున్నారు. బిగ్‌బాస్ మొదలయ్యే వరకూ ఈ షో రన్ కాబోతుంది.. బిగ్బాస్ వచ్చిన తర్వాత ఈ షో ని ఆపేస్తారా లేకపోతే టైమింగ్ మారుస్తారో తెలియాల్సి ఉంది..