BigTV English

Bahubali The Epic: బాహుబలి ది ఎపిక్.. రన్ టైమ్ లాక్ చేసిన మేకర్స్..పైగా ఐపీఎల్ తో సమానం అంటూ!

Bahubali The Epic: బాహుబలి ది ఎపిక్.. రన్ టైమ్ లాక్ చేసిన మేకర్స్..పైగా ఐపీఎల్ తో సమానం అంటూ!

Bahubali The Epic: బాహుబలి(Bahubali) ఇండియన్ సినీ చరిత్రను తిరగరాసిన సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో ఇండియన్ సినిమా అంటే అప్పటివరకు బాలీవుడ్ అని చెప్పుకునే వాళ్ళందరూ ఒక్కసారిగా టాలీవుడ్ వైపు తిరిగారు. పాన్ ఇండియా సినిమాకి బాహుబలి సినిమాతో శ్రీకారం చుట్టారు రాజమౌళి(Rajamouli). అయితే అలాంటి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అద్భుతమైన పాన్ ఇండియా మూవీ బాహుబలి. పార్ట్ 1 విడుదలై 10 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈ సినిమాని రీ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నారు. అయితే బాహుబలి సినిమా 2 పార్ట్ లుగా వచ్చింది.అయితే రీ రిలీజ్ లో బాహుబలి 1 (Bahubali-1 ), బాహుబలి 2 లను కలిపి ఒకే పార్ట్ గా విడుదల చేయబోతున్నారు. అయితే మొదట ఈ సినిమాని ఆగస్టులో రీ రిలీజ్ చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత మళ్లీ బాహుబలి ది ఎపిక్ ని రీ రిలీజ్ చేయడానికి మరి కాస్త సమయం తీసుకోబోతున్నట్టు ప్రకటించారు.


బాహుబలి ది ఎపిక్ గా రాబోతున్న బాహుబలి 1&2..

బాహుబలి ది ఎపిక్ (Bahubali The Epic) అంటూ అక్టోబర్ 31న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించారు. అయితే మొదట ఆగస్టులో రీ రిలీజ్ చేయాలనుకున్న బాహుబలి సినిమాని ఎందుకు లేట్ చేస్తున్నారు అని చాలామందిలో ఒక డౌట్ అయితే వస్తుంది. మరి బాహుబలి రీ రిలీజ్ కి ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్(Prabhas), రానా (Rana),అనుష్క (Anushka),తమన్నా(Tamannaah), సత్యరాజ్ (Sathya Raj), రమ్యకృష్ణ (Ramyakrishna) లు ప్రధాన పాత్రల్లో వచ్చిన బాహుబలి 1,బాహుబలి 2(Bahubali-2) సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రపంచం మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తా ఏంటో తెలిసేలా రాజమౌళి నిరూపించాడు. అయితే ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతుంది కాబట్టి బాహుబలి సినిమా విడుదలై 10 సంవత్సరాలు పూర్తి కావడంతో బాహుబలి సినిమాని కూడా రీ రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ భావించారు. ఇందులో భాగంగా బాహుబలి 1,బాహుబలి 2 పార్ట్ లను కలిపి ఒకే మూవీగా బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేయాలనుకున్నారు.


బాహుబలి ది ఎపిక్ రన్ టైం లాక్..

అయితే బాహుబలి-1 2:38 నిమిషాలు.. ఇక బాహుబలి-2 2:47 నిమిషాలు.. అయితే ఈ రెండు సినిమాలను కలిపి ఒకే సినిమాగా విడుదల చేయబోతున్నారు కాబట్టి ఈ రెండు సినిమాల నిడివి 5:25 నిమిషాలు అవుతుంది.. అయితే 5 గంటలు అంటే చాలా సమయం థియేటర్లో ప్రేక్షకులను కూర్చోబెట్టాల్సి ఉంటుంది. కానీ అంత సమయం కాకుండా సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్ చేసి ట్రిమ్ చేస్తున్నారట. అలా ముందుగా అనుకున్న సినిమాని పూర్తిగా ట్రిమ్ చేసి మెయిన్ మెయిన్ కథాంశాన్ని మాత్రమే చూపించబోతున్నారట. అయితే ఈ విషయం గురించి తాజాగా బాహుబలి టీం ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది.

ఐపీఎల్ మ్యాచ్ తో సమానం అంటూ..

“మీరు కంగారు పడకండి.. మేము మీ రోజు మొత్తాన్ని తీసుకోవట్లేదు.. కేవలం ఈ సినిమా ఐపీఎల్ మ్యాచ్ కు సమానంగా మాత్రమే ఉంటుంది అంతే” అంటూ ట్వీట్ పెట్టారు. ఇక ఐపీఎల్ మ్యాచ్ కు సమానం అంటే ఐపీఎల్ మ్యాచ్ అవ్వడానికి 3:30 నిమిషాలు పడుతుంది. అలా బాహుబలి ది ఎపిక్ మూవీ 5:25 నిమిషాలని ట్రిమ్ చేసి 3:30 నిమిషాలకు ఎడిట్ చేస్తున్నారని అర్థమవుతుంది.. ఇక సినిమా నిడివి ఎక్కువగా ఉంటే ప్రేక్షకులు కూడా థియేటర్లో ఎక్కువసేపు కూర్చోలేరు. అందుకే ప్రేక్షకుల అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని బాహుబలి మూవీ రీ రిలీజ్ ని ఎడిటింగ్ చేసి ట్రిమ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.అందుకే బాహుబలి ది ఎపిక్ మూవీని లేటుగా రీ రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం.

ALSO READ:Udaipur Files Movie : 150 సెన్సార్ కట్స్…హై కోర్టు కూడా రిలీజ్‌ను ఆపేసిన మూవీ ఇది !

Related News

Sobhita: షూటింగ్ లొకేషన్ లో వంట చేసిన శోభిత.. చైతూ రియాక్షన్ ఇదే!

Lokesh Kangaraj: చేసింది 6 సినిమాలే..22 మంది హీరోలను డైరెక్ట్ చేశా.. గర్వంగా ఉందంటూ!

OG Glimpse: ఎందయ్యా సుజీత్ బర్త్ డే హీరోదా…విలన్ దా ఆ గ్లింప్స్ ఏంటయ్యా?

Madharasi Censor Report: మదరాసి సెన్సార్‌ పూర్తి.. ఆ సీన్స్‌పై బోర్డు అభ్యంతరం, మొత్తం నిడివి ఎంతంటే

Ghaati Censor Report: అనుష్క ‘ఘాటీ’కి సెన్సార్‌ కట్స్.. ఆ సీన్లపై కోత.. మొత్తం మూవీ నిడివి ఎంతంటే!

Anushka Shetty: డాక్యుమెంటరీగా బాహుబలి.. కన్ఫర్మ్ చేసిన స్వీటీ!

Big Stories

×