E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం రోహిణి.. శృతి ప్లాన్ గ్రాండ్ సక్సెస్.. హమ్మయ్య కలిసిపోయారు..

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం రోహిణి.. శృతి ప్లాన్ గ్రాండ్ సక్సెస్.. హమ్మయ్య కలిసిపోయారు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode 25th: బాలు చిన్నప్పుడు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకొని బాధ పడిపోతూ ఉంటాడు. మనోజ్ వాళ్ళందని తోసేయడం సత్యంకి చెప్పడంతో ఎందుకురా నువ్వు ఇలా చేశావు అని సత్యం అడుగుతాడు.. మనోజ్ చేసిన పనికి సత్యం దగ్గర మాట తీసుకున్న బాలు ఇప్పటివరకు ఆ నిజాన్ని చెప్పకుండా ఉంటాడు.. వాడి గురించి నీకేం తెలుసు నువ్వు మాట్లాడుతున్నావ్ రా.. వాడికి జైలుకు వెళ్లడం కొత్త కదా ఎందుకు వెళ్ళాడు ఎలా వెళ్లడు నీకు తెలియదా అని సత్యం మనోజ్ పై సీరియస్ అవుతాడు. ఇక ప్రభావతి ఈ గొడవ ని ఇంత తాపేయండి అని వెళ్ళిపోతుంది.. ఇక మీనా దగ్గరికి వచ్చినా శృతి వీళ్ళు గొడవకి రెడీగా ఉన్నట్లు ఉన్నారు వీళ్ళని ఎలాగైనా సరే కాల్ చేయాలి అని శృతి ప్లాన్ చేస్తుంది.. ఇక మీనా సపోర్ట్ చేయడంతో శృతి మనం ఇది అమలు చేస్తే అందరూ మళ్ళీ సంతోషంగా ఉంటారు అని అనుకుంటుంది.. ఇక రోహిణి నా గురించి మాట్లాడుకుంటున్నారా అని వంటగదిలోకి వచ్చి అడుగుతుంది ఆ మాటకి శృతి తనదైన స్టైల్ లో మాటకు మాట సమాధానం చెబుతుంది.. ఈ విన్నరోహిని ఒక్కసారిగా షాక్ అవుతుంది.. మనోజ్ బాలుని కలపాలని ప్రయత్నాలు చేస్తున్నారని అర్థమవుతుంది.

రోహిణికి దిమ్మతిరిగే షాకిచ్చిన శృతి..

ఈ గొడవ తర్వాత శృతి మీనా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు.. ఒక మనిషి ఇంటికి వస్తే అన్నం పెట్టడం కూడా తప్పేనా ఎందుకు మనోజ్ ఇలా చేస్తున్నాడు అని శృతి అంటుంది.. వాళ్లు అమ్మ కొడుకులు దాదాపు అలానే ఉంటారు.. ఎవరేం చెప్పినా కూడా పట్టించుకోరు. వాళ్లకు సంస్కారం ఉంది అంటే ఎవరు నమ్మరు అని నేను అంటూ ఉంటుంది. సరేలే మీనా ఈ గొడవలు ఎప్పుడూ ఉండేవే కదా ఒకసారి ఈ గేమ్ గురించి చూడు చాలా సరదాగా ఉంది అని ఫోన్లో చూపించగని శృతి చెప్పినట్లుగానే సరదాగా ఉంది అని నేను అంటూ నవ్వుకుంటుంది.. రోహిణి అక్కడికి రాగానే వీళ్ళిద్దరూ నవ్వడం ఆపేస్తారు. ఏంటి మీ ఇద్దరి నా గురించి మాట్లాడుకుంటున్నారా అని రోహిణి అనుకుంటుంది.. నీ గురించి తప్ప మాకు వేరే పనేమీ లేదు అని శృతి దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతుంది. ప్రతిసారి నీ గురించి మాట్లాడుకోవాలి అంటే మేము మీ జీవిత చరిత్ర ఏమి రాయడం లేదు కదా అని మీనా కూడా అంటుంది..

అబ్బా మీనా దెబ్బ అదుర్స్..

Advertisement

మీ ఆయనకి జైలుకి వెళ్లడం కొత్తేమి కాదు కదా.. అందులో మనోజ్జనంలో తప్పేంటి అని రోహిణి కావాలని మళ్లీ మీనాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.. మీనా 40 లక్షలు మింగాలి అని మా ఆయనకి నేను చెప్పలేదు కదా అని ప్రతిసారి బాలు లాగే మాట్లాడడంతో మీనా ఏం మాట్లాడుతున్నావ్ అని రోహిణి అంటుంది. నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను. నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు అని రోహిణి తో అంటుంది. సరే శృతి అదేదో ఆ రోహిణి కూడా చూపించు మళ్లీ మనం తన గురించి మాట్లాడుకుంటున్నాము అని అనుకుంటుంది.. ఏం లేదు మేము దీని గురించి చూస్తూ మాట్లాడుకుంటున్నామని వీడియో చూపించగానే రోహిణి కూడా చాలా సరదాగా ఉంది అని నవ్వుకుంటుంది.

బాలు, మనోజ్ కోసం శృతి ప్లాన్..

బాలు మనోజులని ఎలాగైనా కలపాలి అని రోహిణి తో పాటు శృతి కూడా ప్లాన్ చేస్తుంది.. ఈ గేమ్ మనందరం కలిసి కూర్చొని ఆడితే బాగుంటుంది కదా అని శృతి అనగానే వీళ్ళిద్దరూ ఉప్పు పప్పు లాగా ఉన్నారు. మనవెళ్లి దీని గురించి అడిగితే నిప్పులు కక్కుతారు ఏమో శృతి అని మీనా భయపడుతుంది.. కానీ నువ్వు చెప్పావు కదా ధైర్యం చేసి నేను వెళ్లి అడుగుతాను అని నేను అంటుంది.. అదేవిధంగా రోహిణి కూడా మనోజ్ ని నేను వెళ్లి అడుగుతాను ఒప్పిస్తాను అని అంటుంది.. ఇక వాడిని చూస్తే నాకు కోపంగా ఉంటుంది మీనా నేను అసలు రాను కూడా రాను అని బాలు అంటాడు. అదేవిధంగా మనోజ్ కూడా వాడు ఏదో ఒకటి అంటూ గొడవ పెట్టుకుంటాడు నేను అసలు రాను కూడా రాను అనేసి అంటాడు.. మొత్తానికి ఇద్దరు కలిసి బాలు మనల్ని గేమ్ ఆడేందుకు పైకి తీసుకుని వస్తారు..

మనోజ్ డ్యాన్స్ హైలెట్..

Advertisement

శృతి చెప్పినట్లుగా మనం ఈ గేమ్ ఆడితే అందరం సరదాగా ఉండొచ్చు కాసేపు అదే నేను అంటుంది.. ముందు శృతి మొదలు పెడుతుంది. ఆ తర్వాత బాలు కూడా మీనా చేసినట్లుగానే చేసి చూపిస్తాడు. ఇక అందరూ కూడా తమ స్థాయిలో శృతి చెప్పినట్లుగానే చేస్తూ నవ్విస్తారు.. కానీ మనోజ్ మాత్రం అందరిని కడుపుబ్బ నవ్విస్తాడు.. తన కామెడీ స్టెప్పులతో అందరూ పగలబడి నవ్వుకుంటారు.. మనోజ్ వేస్సిన డాన్స్ చేసి బాలుతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా సరదాగా నవ్వుకుంటారు.. మొత్తానికి బాలు మనోజ్ శృతి ప్లాన్ వల్ల కలిసిపోయినట్లు కనిపిస్తుంది.. అందరూ పగలబడి నవ్వు కూడా చూసి వీళ్ళకి అదేమైనా పట్టిందా అని ప్రభావతి నిద్రలోంచి లేచి ఉలిక్కిపడుతుంది. ఎందుకు వీళ్ళందరూ ఇలా నవ్వుకుంటున్నారు ఏం జరిగింది అని ప్రభావతి అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : మహాకు ఘోర అవమానం.. సురేష్ కు బుద్ధిచెప్పిన మహా కుటుంబం.. ఇదే కదా ట్విస్ట్..

Related News

పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన.. బిగ్ బాస్ కోసమే వచ్చి దొరికిపోయారా?

బీబీ కొంపలో బెట్టింగ్ మాఫియా.. మరోసారి నాగార్జున పై రెచ్చిపోయిన నా అన్వేష్!

ఏం తప్పు చేశాను.. రాబందులలా పొడుచుకు తింటున్నారు..రాజకుమారి ఎమోషనల్!

బిగ్ బాస్ 10.. ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ కి సపోర్టుగా హైపర్ ఆది!

ఆరోజు జరిగిందిందే.. నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి అసిస్టెంట్!

మొదలైన వార్.. కృష్ణుడు ఫైర్!

Podarillu Serial : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారక్టర్ అవుట్..

Nindu Noorella Saavasam Serial Today EpisodeSeptember 8th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ శక్తులు హరించేందుకు వెళ్లిన ప్రచండ

Big Stories

Advertisement
×