E-Paper
Advertisement

ఆకలి తీర్చడమే నేరమైందా.. ఢిల్లీ విద్యార్థులకు అన్నం పెట్టినందుకు ఇల్లంతా అరెస్టే.. అసలేం జరిగింది?

ఆకలి తీర్చడమే నేరమైందా.. ఢిల్లీ విద్యార్థులకు అన్నం పెట్టినందుకు ఇల్లంతా అరెస్టే.. అసలేం జరిగింది?
Advertisement

Delhi protest: ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు నీళ్లు, భోజనం అందిస్తూ మానవతా దృక్పథం చాటుకున్న జునైద్ కుటుంబంపై పోలీసుల వేధింపుల పర్వం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జంతర్‌మంతర్ వేదికగా పోరాడుతున్న వారికి తొలి రోజు నుంచే ఆపన్నహస్తం అందిస్తున్న జునైద్‌కు ఊహించని రీతిలో ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. “ఢిల్లీ వీడి స్వగ్రామానికి వెళ్లిపోవాలి” అంటూ గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్ పోలీసులు అతనికి హెచ్చరికలు జారీ చేయడం, దానికి అతను లొంగకపోవడంతోనే ఈ వేధింపుల పర్వం మొదలైందని సమాచారం.

సేవా కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు, నిరసనకారులు మండిపడుతున్నారు. జునైద్ లొంగలేదన్న నెపంతో అతని తండ్రిని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతేకాకుండా, మైనర్ అయిన జునైద్ సోదరుడిని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తూ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార యంత్రాంగం నిరసన స్వరాన్ని అణచివేసేందుకే కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శలు వస్తున్నాయి.

Advertisement

వేధింపుల పర్వం అంతటితో ఆగకుండా, జునైద్ సోదరి అత్తారింటికి కూడా పాకింది. ఆమె మామతో పాటు భర్త సోదరుడిని కూడా పోలీసులు అకారణంగా అరెస్ట్ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నిజమైన నేరస్థులను, అసాంఘిక శక్తులను పట్టుకోవడంలో విఫలమవుతున్న పోలీసులు.. కేవలం ఆకలితో ఉన్న వారికి అన్నం పెడుతున్న ఒక సాధారణ కుటుంబాన్ని ఈ రకంగా టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమని సర్వత్రా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

మానవత్వంతో సేవ చేయడం నేరమా? అని ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనకారులకు లభిస్తున్న మద్దతును విచ్ఛిన్నం చేయడానికే ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని హక్కుల కార్యకర్తలు ఆగ్రహిస్తున్నారు. జునైద్ కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని సామాజిక మాధ్యమాల వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Also Read: ఒకే ఇంట్లో భార్యాభర్తలు.. కానీ 20 ఏళ్లుగా మాటలు కట్.. ఎందుకో తెలిస్తే షాక్!

Related News

యువతకు కృతజ్ఞతలు.. ప్రధాని మోదీ మరో వీడియో రిలీజ్

కేంద్ర మంత్రి రాజీనామా.. కారణం ఇదే!

NTA లో ఊచకోత.. 47 మంది అధికారుల తొలగింపు.. క్రిమినల్ కేసులు నమోదు!

ఈ దేశాల్లో NEET తరహా లీకులు జరిగితే.. మంత్రి రాజీనామా చేస్తారా? శిక్షలేంటీ?

కోర్టు వీడియోలు వైరల్ చేస్తే.. అంతే సంగతులు.. సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు!

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు.. NTAకు సుప్రీంకోర్టు సీరియస్ ఆదేశాలు!

SSC అభ్యర్థులపై పోలీసుల ప్రతీకారం.. సాహిల్ కంటి చూపుపై రాహుల్ ఆవేదన!

Big Stories

Advertisement
×