Podarillu Today Episode July 25th: శైలు అన్నయ్య సురేష్ ఫ్రెండ్స్ మెకానిక్ తో వీడి చెల్లెలు ప్రేమలో పడింది అని వెటకారంగా మాట్లాడుకుంటూ ఉంటారు.. వాడి గురించి ఎంత చెప్పినా సరే మా చెల్లెలు వినడం లేదు రా ఏం చేయాలో అర్థం కావడం లేదు అని సురేష్ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాడు.. అప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్న మహాలక్ష్మిని చూస్తున్న సురేష్ కేశవ గాడి వదిన కదా ఇది దీన్ని ఒక ఆట ఆడుకుంటాను చూడు అని అంటారు.. పంచమి పాప అని అవమానించేలా మాట్లాడుతాడు సురేష్.. ఐదుగురు మగాళ్ళతో ఉన్న నిన్ను ఏమని పిలవాలి అని దారుణంగా మాట్లాడుతాడు..
ఆ మాట వినగానే మహాలక్ష్మి సీరియస్ అయ్యి సురేష్ చంప పగలగొడుతుంది.. ఏం మాట్లాడుతున్నావ్ రా ఒక ఆడపిల్ల తో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని మహాలక్ష్మి ఎంతగా చెప్తున్నా సరే నన్నే కొడతావా అంటూ తనని అవమానించేలా మాట్లాడుతాడు. అంతేకాదు తన చున్ని పట్టుకొని లాక్కొని వెళ్లిపోతాడు.. మహాలక్ష్మి కిందిపడి బాధ పడిపోతుంది ఇంటికి వస్తుంది.. అది చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు.. సురేష్ కి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని అనుకుంటారు..
శైలు వాళ్ళ అన్నయ్య ఇలా చేశాడు అని చెప్పగానే అందరూ వాడితో గొడవ ఎందుకు అని అనుకుంటారు. కానీ చక్రి మాత్రం ఎవరికీ చెప్పకుండా వాడితో గొడవపడడానికి వెళ్తాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా సురేష్ ని ఎలాగైనా సరే కొట్టాలి అని అక్కడికి వెళ్తారు. ఒక ఆడపిల్ల తో మాట్లాడాల్సిన మాటలేనా రా నువ్వు మాట్లాడింది. ఐదుగురు మగాళ్లున్న ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండడం తప్ప అని మాధవ్ ఒక్కసారిగా సీరియస్ అయిపోతాడు. ఐదుగురు మగాళ్ళతో ఉంటుంది కాబట్టి అలా అన్నాను దానిలో తప్పేంటి అని సురేష్ అంటాడు. అప్పటికి కూడా సురేష్ మాటలతో చెప్తే వినడు అని అందరూ ఇక సీరియస్ అవుతారు. మహాలక్ష్మి ఎంత చెప్తున్నా సరే అసలు వినకుండా అందరూ కూడా సురేష్ తో గొడవపడతారు.
ఐదుగురు మగాళ్లు ఉన్న ఇంట్లో ఉంటే దారుణంగా మాట్లాడుతావా? ఆ ఐదుగురు కూడా అన్న కొడుకు అలాగే తండ్రి లాంటివారు. ఒక పెనిమిటి ఇలాంటి వరుసలు ఉన్నాయి. అవి పూర్తిగా మర్చిపోయి నువ్వు ఇలా మాట్లాడతావని నేను అసలు ఊహించలేదు అని మాధవ్ సీరియస్ అవుతాడు. అంతేకాదు మిగిలిన వాళ్ళందరూ కూడా సురేష్ ని తన ఫ్రెండ్స్ ని చితక్కొట్టేస్తారు. కేశవ మీ చెల్లిని ప్రేమించింది నేను నీకు ఏదైనా కోపం ఉంటే నా మీద చూపించు నన్ను కొట్టడానికి ప్రయత్నించు అద్దకనీ మా వదిన జోలికి వస్తే అసలు ఊరుకునేది లేదు అని అంటాడు.. నువ్వు ఒక చెల్లికి అన్నయ్య వే కదా అలాంటి వాడివి ఇలా మాట్లాడతావా అనే మాధవ్ ఎప్పుడు లేని విధంగా కోప్పడతాడు.
అందరూ కలిసి కొట్టడంతో పాటుగా నారాయణ ఒక తొక్కు తొక్కుని రా సచ్చి ఊరుకుంటారు నేను జైలుకు వెళ్తాను అని అంటాడు. మీ అమ్మ మీ నాన్న నేర్పించిన సంస్కారం ఇదేనా నీ చెల్లెలు మొహం చూసి నేను వదిలేస్తున్నామని అందరూ అంటారు. ఆ మాట వినగానే మిగిలిన వాళ్ళందరూ కూడా మా వదిన జోలికొస్తే అసలు ఊరుకోము అని వార్నింగ్ ఇస్తారు. ఇంకా మాధవ్ రెచ్చిపోయి కొట్టడంతో సురేష్ చంపేస్తారేమో అని భయపడిపోతాడు. ఇక మహా చున్ని ఎక్కడ పెట్టావో తీసుకురా అని మాధవ్ గట్టిగా అరుస్తాడు. మహాలక్ష్మి చున్నీ తెచ్చి ఇవ్వడంతో పాటుగా తనకి క్షమాపణలు చెప్తాడు సురేష్. నీ చెల్లెలు మా ఇంటికి వచ్చిన కూడా మేము ఇలానే గౌరవంగా చూసుకుంటాము. వేరేవాడు ఎవరైనా ఒక మాటంటే అసలు ఊరుకునేది లేదు అని మాధవ్ వార్నింగ్ ఇస్తాడు..
ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్ళగానే చక్రీ చాలా కోపంగా ఉంటాడు.. అసలు వాన్ని చంపేస్తుంటే ఒక పీడ విరగడ అయిపోయేది అని అంటాడు. మహాలక్ష్మి వెళ్లి చక్రి కి వాటర్ తెచ్చి ఇస్తుంది.. ఎందుకింత ఆవేశం ఆవేశ పడితే వాడు అన్నమాట వెనక్కి తీసుకుంటాడా.? అంత మాట అన్న తర్వాత ఎలా ఊరుకోవాలి మీరే చెప్పండి అని చక్రి మహనీ సీరియస్గా తిడతాడు. నేనేమీ ఇవన్నీ వదిలిపెట్టమని చెప్పట్లేదు కొంచెం ఆవేశం తగ్గించుకోండి అని చెప్తున్నాను అని మహాలక్ష్మి అలాగానే చక్రీ ఏది ఏమైనా సరే వారిని మాత్రం అసలు వదిలిపెట్టను అని చక్రి అంటాడు. చక్రి ఆవేశాన్ని చూసి మిగిలిన వాళ్ళందరూ షాక్ అవుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..