Shadab Khan ON IND VS PAK: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (Team India vs. Pakistan) మధ్య మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు. ఎక్కడ ఈ మ్యాచ్ జరిగినా.. వ్యూయర్షిప్ మాత్రం అదిరిపోతుంది. ఇక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే జనాలందరూ పనులు వదిలేసి మరి… టీవీల ముందు కూర్చుండి పోతారు. అంతలా పాపులారిటీ దక్కించుకుంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ముందు నేపథ్యంలో ఈ మ్యాచ్ కు అంత ప్రాధాన్యత పెరిగింది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆల్రౌండర్ షాబాద్ ఖాన్ (Shadab Khan)… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా పై విజయం సాధిస్తే వరల్డ్ కప్ గెలిచినట్లుగా తాము ఫీల్ అవుతామని వెల్లడించారు. అదే ఓడిపోతే వరల్డ్ కప్ కోల్పోయినట్లుగా భావిస్తామని సంచలన ప్రకటన చేశారు. అందుకే ఇండియాతో మ్యాచ్ ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆడతామని వెల్లడించారు. దీంతో షాబాద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read: ఆ పాకిస్తాన్ వెధవను వద్దని మొత్తుకున్నా, కావ్యనే వినలేదు.. SRH కోచ్ సీరియస్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (Team India vs. Pakistan) మధ్య మ్యాచ్ పై షాబాద్ ఖాన్ (shabad khan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా తో మ్యాచ్ అంటే ఎంతో జాగ్రత్తగా ఆడదామని వివరించారు. కొన్నిసార్లు టీమిండియా పై విజయం సాధిస్తే.. వరల్డ్ కప్ గెలిచినంత ఆనందం తమకు కలుగుతుందని తెలిపారు. ఒకవేళ ఓడిపోతే మాత్రం పాకిస్తాన్ అభిమానులు వరల్డ్ కప్ (World Cup) కోల్పోయినట్లుగా ఫీల్ అవుతారని వివరించారు. తమకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుందని చెప్పుకొచ్చారు. టీమిండియా చేతిలో ఓడిపోతే పాకిస్తాన్ అభిమానుల చేతిలో క్రికెటర్లు బలి కావడం గ్యారంటీ అని వార్నింగ్ ఇచ్చారు. మ్యాచ్ ఆడి పాకిస్తాన్ వెళ్తే… విమానాశ్రయంలోనే తమను అభిమానులు అడ్డుకుంటారని వెల్లడించారు. ఒక్క మ్యాచ్ ఓడిపోయిన కూడా తమ అభిమానులు ఊరుకోరని… అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మ్యాచ్ ను ఊహించుకుంటారని తెలిపారు. అటు తమ పాకిస్తాన్ సర్కార్ కూడా ఇండియాపై గెలవాలని కోరుకుంటుంది అన్నారు.
2027 వన్డే వరల్డ్ కప్ లో కూడా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (Team India vs. Pakistan) మధ్య మ్యాచ్ లు జరుగుతాయని షాబాద్ వెల్లడించారు. ఈసారి ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్లు జరుగుతాయని ప్రచారం జరుగుతున్నట్లు తెలిపారు. అదే జరిగితే క్రికెట్ అభిమానులకు పండగ వాతావరణం ఉంటుందన్నారు. తాము కూడా ఈ మూడు మ్యాచ్ లలో గెలిచేందుకు ప్రయత్నాలు చేపడతామని వివరించారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు.
Also Read: 6, 6, 6, 6 వైభవ్ సిక్సుల వర్షం..A సింబల్ చూపిస్తూ సెలబ్రేషన్స్, టీమిండియా విజయం