E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: నిజం చెప్పిన కామాక్షి.. మీనా దెబ్బకు ప్రభా షాక్.. అడ్డంగా బుక్కయిన రోహిణి..

Gundeninda GudiGantalu Today episode: నిజం చెప్పిన కామాక్షి.. మీనా దెబ్బకు ప్రభా షాక్.. అడ్డంగా బుక్కయిన రోహిణి..
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 15th: మీనా కోసం బాలు ఎన్ని పనులు చేశాడో అవన్నీ తలుచుకొని మీనా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. నాకోసం మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. నన్ను ఆ దుర్మార్గులు ఎత్తుకుపోయిన సరే నాకోసం మీరు కంగారుపడుతూ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడారు అని అనుకోని బాలుని చూస్తూ తన ప్రేమను కురిపిస్తూ ఉంటుంది మీనా.. బాలు మీనా ఇద్దరు మరోసారి ఒకటి అయిపోతారు. మాత్రం ఎటు తిరిగి నా దగ్గరికి వచ్చింది అని విద్యతో చెప్పి బాధపడిపోతూ ఉంటుంది.. ఇంకా రెండు లక్షలు కామాక్షికి ఇవ్వాలని ఫిక్స్ అవుతుంది.

కామాక్షి నిజం చెప్తుందా..? 

ఆ రెండు లక్షల ఎక్కడికిపోయినాయో అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రోహిణి ఎవరికి చెప్పొద్దని తెచ్చి ఇచ్చినా డబ్బులని కామాక్షి ఇవ్వడానికి వస్తుంది. కంప్లైంట్ ఇస్తే ఆ దొంగ ఇట్టే దొరికిపోతాడు అని బాలు అంటాడు. పోలీసులు ఎలాగైనా సరే దొంగను కనిపెడతారు దొరుకుతారు అని మాట్లాడుకుంటూ ఉండగా కామాక్షి ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఇది చూసి నా బాలు ఏంటి దొంగ దొరుకుతది అన్నగాని మీరు వచ్చారేంటి అత్త అనేసి అడుగుతాడు.. రోహిణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే కామాక్షి ఎందుకు వచ్చావు అని అడుగుతారు. వదిన కందిపప్పు డబ్బా పెసరపప్పు డబ్బా అయింది అంటూ తిక్క తిక్కగా సమాధానం చెబుతుంది.. అసలు ఏం చెప్తున్నావో అర్థం కావట్లేదు కామాక్షి అని ప్రభావతి అడుగుతుంది.

కామాక్షి ఇచ్చిన రెండు లక్షలు.. 

Advertisement

కందిపప్పు డబ్బాలో పెట్టాను అనుకున్నాను కానీ ఆ డబ్బులు మాత్రం పెసరపప్పు డబ్బాలు దొరికాయి అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. డబ్బులు నా కాపురానికి చిచ్చుపెట్టేయని కామాక్షి చెప్పగానే బాలు సెటైర్ల వర్షం కురిపిస్తాడు. మొత్తానికి ఆ డబ్బులు వచ్చాయని తెలియగానే మీనా మా ఇంటి వాళ్ళని నానా మాటలు అన్నారు.. మా వాళ్ళందని దొంగ అని ఎంత నీచంగా మాట్లాడారు ఈ డబ్బులు దొరికే కదా ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి అని మీనా ప్రభావతికి దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.

ప్రభావతికి బాలు డెడ్ లైన్.. 

ఆ డబ్బులు వచ్చాయి కదరా మరి ఇంకేంటి అని ప్రభావం అంటుంది. మిగతా మూడు లక్షలు కూడా ఇవ్వాలని బాలు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తాడు. అయితే బాలు చెప్పిన మాట వినగానే ప్రభావతి ఏంట్రా అంటుంది. కానీ మనోజ్ ని అడిగితే మనోజ్ మాత్రం నేను ఇవ్వను అని ప్రభావతితో తెగేసి చెప్తాడు. అయితే ఆ మాట వినగానే బాలు ఇంకాస్త రెచ్చిపోతాడు. ఆ మూడు లక్షలు అమ్మ నెల నెల కలిసి ఇస్తుందో ఏంటో నాకు తెలియదు కానీ నాకు మాత్రం డబ్బులు ఇవ్వాల్సిందేనని డెడ్ లైన్ విధిస్తాడు.. ప్రభావతి ఒక నోట్ రాసి సంతకం పెడుతుంది. ఇక సత్యం ప్రభావతికి తోడుగా నిలుస్తాడు.

సత్యంకు అండగా బాలు, మీనా..

Advertisement

బాలు మీనా వచ్చిన డబ్బులు నీ లెక్కపెట్టి అందరికి ఇచ్చేస్తారు. అయితే సత్యం కి డబ్బులు ఇవ్వాల్సిన విషయాన్ని గుర్తు పెట్టుకున్న బాలు మీనా చెప్పడంతో ఆ డబ్బులు మా నాన్నకి ఇచ్చేసావా అని మీనా పై ప్రశంసలు కురిపిస్తాడు. ఇక ఉదయం లేవగానే ఇంటికి రంగా రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏమైంది అని అనగానే సత్యం నేను పిలిచాను అని అంటాడు. నాకు కామాక్షి అంతా చెప్పింది రా నేను కూడా జాబ్ చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి నేను పిలిచాను అని సత్యం అంటాడు.. అయితే ఈ వయసులో నువ్వు జాబ్ చేయడం ఏంట్రా అని ఎంతగా చెప్తున్నా సరే సత్యం మాత్రం నేను చేస్తానని అంటాడు. పాలు మీనా మాత్రం మావయ్యగా జాబ్ చేయడానికి వీలు లేదు అని అంటారు.

తల్లిని కొత్త ఇంటికి మార్చిన రోహిణి.. 

రోహిణి తన తల్లిని కొడుకుని కొత్త ఇంటికి మారుస్తుంది. చాలా సంతోషంగా ఆ ఇంట్లోకి అడుగు పెడతారు.. ఇంట్లో చాలా బాగుంది అని తింటూ చాలా సంతోషంగా ఉంటాడు.. రోహిణి చింటూ ని ఎలాగైనా సరే బయటికి పంపించకుండా ఉండాలి అని అనుకుంటుంది. రోహిణిని చింటూ ఇక్కడే ఉండిపో అని అడుగుతాడు. ఆ మాట వినగానే రోహిణి దిమ్మతిరిగిపోయేలా షాక్ అవుతుంది. ఏదో ఒకటి చెప్పి చింటూ నీ మ్యానేజ్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read :Podarillu Today Episode : గాయత్రి ఎంగేజ్మెంట్.. మాధవ్ కన్నీళ్లు.. గాయత్రి దెబ్బకు గాయత్రి ఫ్యూజుల్ అవుట్..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×