E-Paper
Advertisement

హోర్మూజ్ జలసంధి టెన్షన్.. ఆరు షిప్‌లు వెనక్కి వెళ్లాయన్న అమెరికా, 20 షిప్‌లు దాటాయన్న ఇరాన్

హోర్మూజ్ జలసంధి టెన్షన్.. ఆరు షిప్‌లు వెనక్కి వెళ్లాయన్న అమెరికా, 20 షిప్‌లు దాటాయన్న ఇరాన్
Advertisement

Strait of Hormuz: ఇరాన్-అమెరికా ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో హోర్మూజ్ జలసంధి వద్ద ప్రస్తుత పరిస్థితి ఏంటి? నౌకలు రాకపోకలు సాగిస్తున్నాయా? ఆ ప్రాంతాన్ని అమెరికా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుందా? దాదాపు ఆరు వాణిజ్య నౌకలు వెనక్కి వెళ్లినట్టు అమెరికా ఓ ప్రకటన చేసింది.

హోర్మూజ్ జలసంధి పరిస్థితి.. ఇరాన్ ఓడరేవులను దిగ్బంధనం చేసిన అమెరికా

Advertisement

ఇరాన్-అమెరికాల మధ్య రేపోమాపో మరో విడత శాంతి చర్చలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇరుదేశాలు పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో హోర్మూజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకుంది అమెరికా. ఇరాన్ ఓడరేవులను పూర్తిగా దిగ్బంధించింది. అరేబియా గల్ఫ్-గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోని పోర్టుల నుంచి బయటకు.. బయట నుంచి లోపలకు నౌకలు వెళ్లకుండా కఠినమైన ఆంక్షలు విధించింది.

కేవలం నౌకలను మోహరించడమేకాదు.. భారీ ఎత్తున సైనికులను రంగంలోకి దించింది అమెరికా. సైనిక ఆపరేషన్ కోసం 10 వేల మందికి పైగా అమెరికా నేవీ బృందాలు రంగంలోకి దిగాయి. అందులో నేవీ, మెరైన్లు, వైమానిక సిబ్బంది ఉన్నారు. అంతేకాదు డజనుకు పైగా యుద్ధనౌకలు జలసంధి చుట్టూ మోహరించింది. 100 పైగానే యుద్ధ-నిఘా విమానాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.

Advertisement

వెనక్కి వెళ్లిన ఆరు వాణిజ్య నౌకలు.. చర్చల వరకు ఇదే పరిస్థితి?

జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకున్న అమెరికా, దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. గడిచిన 24 గంటల్లో ఇరాన్ ఓడ రేవుల నుంచి బయటకు వెళ్లేందుకు ఏ ఒక్క నౌక ముందుకు రాలేదు. అమెరికా నేవీ విభాగం జారీ చేసిన ఆదేశాలను అనుసరించి ఆరు వాణిజ్య నౌకలు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాయి. ఇరాన్‌లోని గల్ఫ్ ఆఫ్ ఒమన్ పోర్టులోకి మళ్లీ ప్రవేశించాయి.

ఇరాన్ పోర్టులకు వెళ్లేందుకు-వచ్చేందుకు అన్ని నౌకలను దిగ్బంధం చేస్తామని ఇప్పటికే అమెరికా హెచ్చరించిన విషయం తెల్సిందే. ఈ దిగ్బంధనం ఇరాన్ తీరప్రాంతం మొత్తాన్ని కవర్ చేస్తుందని తెలిపింది. ఆహారం, వైద్య సామాగ్రి, ఇతర నిత్యావసర వస్తువులతో సహా మానవతా సహాయ సరుకులను తనిఖీకి లోబడి అనుమతిస్తారని సోమవారం విడుదల చేసిన నోట్‌లో పేర్కొంది.

ALSO READ: వచ్చే రెండు రోజుల్లోనే.. పాకిస్థాన్‌లో మళ్లీ అమెరికా-ఇరాన్ చర్చలు?

ఇదిలా ఉండగా హర్మూజ్‌ జలసంధిని గడిచిన 24 గంటల్లో 20కి పైగా నౌకలు దాటినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అమెరికా అధికారులను ఉటంకిస్తూ అక్కడి స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటన అందుకు భిన్నంగా ఉండడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

ప్రపంచ వాణిజ్యానికి కీలకమైనది హర్మూజ్ జలసంధి. దీని ద్వారా ప్రయాణించే ఇతర నౌకల స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకం ఉండదని హామీ ఇచ్చింది అమెరికా. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్, యాంఫిబియస్ అసాల్ట్ షిప్, గైడెడ్-మిసైల్ డిస్ట్రాయర్లు, లిట్టోరల్ కంబాట్ షిప్‌ వంటి అత్యాధునిక వార్ షిప్‌లు పాల్గొన్నాయి.

హర్మూజ్ జలసంధి వద్ద జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. ఇరాన్-అమెరికా మధ్య రెండో విడత చర్చలు పూర్తి అయ్యేవరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  అక్కడ పరిణామాలను ఆసియా దేశాలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాయి.  సో.. మొత్తానికి కొద్దిరోజులు ఈ ఉత్కంఠ తప్పదన్నమాట.

 

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×