E-Paper
Advertisement

Trump On Iran War: ఇరాన్ యుద్దానికి ట్రంప్ ఎండ్ కార్డు.. రెండు లేదా మూడు వారాలు మాత్రమే

Trump On Iran War: ఇరాన్ యుద్దానికి ట్రంప్ ఎండ్ కార్డు.. రెండు లేదా మూడు వారాలు మాత్రమే
Advertisement

Trump On Iran War:  ఇరాన్‌ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. యుద్దాన్ని రెండు లేదా మూడు వారాల్లో ముగిస్తామని తేల్చి చెప్పారు. గతరాత్రి వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ నుంచి తాము అతి త్వరలో వైదొలగనున్నట్లు చెప్పుకొచ్చారు. అది రెండు లేదా మూడు వారాల్లో పట్టవచ్చన్నారు. ఈ లెక్కన సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు.

ఇరాన్ యుద్దానికి ట్రంప్ ఎండ్ కార్డు

Advertisement

మార్చి చివరి వరకు ఇరాన్‌ తమతో ఒప్పందానికి రావాలంటూ సూచన చేసిన ట్రంప్, ఒక్కసారిగా ఆయన స్వరం మారింది. తమ సైనిక చర్యతో ఇరాన్‌ ఏదైనా ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆధారపడి ఉండదన్నారు. ఇరాన్‌ అణు సామర్థ్యం తగ్గిందని భావించిన తర్వాత వైదొలుగుతామని తేల్చి చెప్పారు. ఇందుకు ఇరాన్ ఒప్పందం చేసుకుంటుందా? లేదా అనేది అప్రస్తుతమన్నారు.

ఇరాన్ త్వరగా అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసుకునే సామర్థ్యం లేకుండా చేయడమే లక్ష్యమన్నారు. అదే సమయంలో ప్రపంచ చమురు రవాణాకు ప్రధాన మార్గమైన మార్గం హోర్ముజ్ జలసంధి భద్రతకు అమెరికా బాధ్యత వహించబోదని తేల్చిచెప్పేశారు. అది మన కోసం కాదని, ఆ జలసంధిని ఉపయోగించే వారి కోసమేనన్నారు.

Advertisement

రెండు లేదా మూడు వారాలు మాత్రమే-ట్రంప్

అమెరికాకు మద్దతు ఇవ్వడానికి మిత్రదేశాలు తగినంతగా కృషి చేయడం లేదని విమర్శించారు. ఇరాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో దాని సామర్థ్యం 15 నుంచి 20 ఏళ్ల వరకు వెనక్కి వెళ్లిందన్నారు. అయితే ఈ వాదనకు ఎలాంటి నిర్దిష్టమైన ఆధారాలు వెల్లడించలేదు. ఇరాన్ వద్దనున్న 600 కిలోగ్రాములకు పైగా శుద్ధి చేసిన యురేనియం నిల్వల గురించి ఏమీ మాట్లాడలేదు.

ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న చమురు ధరల గురించి కూడా ప్రస్తావించారు. ఈ విషయంలో తాను చేయాల్సింది ఇరాన్‌లో సైనిక చర్య ముగించడమేనన్నారు. అతి త్వరలో అది కూడా చేస్తామని చెప్పకనే చెప్పారు. ఆ తర్వాత ధరలు తగ్గుతాయని వ్యాఖ్యానించారు. గతరాత్రి ఇరాన్‌ యుద్ధం ముగింపు దశకు చేరుకుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పిన విషయం తెల్సిందే.

ALSO READ: రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం.. 29 మంది దుర్మరణం

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×