E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి దిమ్మతిరిగే షాక్.. మనోజ్ కోసం గ్రీన్ సిగ్నల్.. మీనాకు దొరికిన మాణిక్యం..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి దిమ్మతిరిగే షాక్.. మనోజ్ కోసం గ్రీన్ సిగ్నల్.. మీనాకు దొరికిన మాణిక్యం..
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 21st: మోటర్ ను రిపేర్ చేయించడానికి బాలు మెకానిక్ ని రమ్మని చెప్తాడు. అయితే మెకానిక్ రాగానే బాలుకి ఆ మోటర్ పరిస్థితిని వివరించి మెయిన్ ఆఫ్ చేసి వెళ్తాడు. కానీ మనోజ్ మాత్రం ఇంట్లో కరెంట్ లేదని మెయిన్ ఆన్ చేస్తాడు ప్రభావతి ఉక్కపోతగా ఉంది అని స్విచ్ ఆన్ చేయడానికి స్విచ్ బోర్డు దగ్గరికి వస్తుంది..  ప్రభావతికి కరెంట్ షాక్ కొట్టగానే కొట్టుకుంటూ ఉంటుంది. అయితే కామాక్షి తో పాటుగా ఇంట్లోని వాళ్ళందరూ కూడా కరెంట్ షాక్ తో కొట్టుకుంటూ ఉండగా మీనా కర్రతో కొట్టి అందరిని కాపాడుతుంది.

అయ్యో.. పాపం ప్రభాకు షాక్..

ప్రభావతి కరెంట్ షా కొట్టడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రోహిణి ప్రభావతికి చెయ్యి నొప్పిగా ఉందని మసాజ్ చేసి నొప్పిని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. నాకెందుకు ఇలా జరిగింది అర్థం కావడం లేదు అని ప్రభావతి బాధ పడిపోతూ ఉంటుంది. అవును వదిన మీరు చాలా అదృష్టవంతురాలు కాబట్టి బ్రతికి పోయారు అని కామాక్షి మాట్లాడుతుంది. అసలు నాతో మాట్లాడొద్దని చెప్పానా మళ్ళీ ఎందుకు నాతో మాట్లాడుతున్నావు అని ప్రభావతి గొడవ పడుతుంది. కానీ కామాక్షి మాత్రం నోటి దూలతో మాట్లాడుతూనే ఉంటుంది.. ఇప్పటికే ఎన్నో జరుగుతున్నాయి నువ్వు ఈ పూజకి ఒప్పుకోవాలమ్మా అని మనోజ్ అక్కడికి వస్తాడు. మనోజ్ పూజ కోసం ఎంతగా చెప్తున్నా సరే.. ప్రభావతి మాత్రం అసలు ఒప్పుకోదు.

కామాక్షి మాటతో ప్రభా కు టెన్షన్.. 

Advertisement

కామాక్షి పూజలు గురించి క్షుద్ర పూజలు గురించి వివరించి చెప్తుంది. ఆ పూజల్ని నెగ్లెట్ చేస్తే ఆ తర్వాత జరిగే పరిస్థితుల గురించి కామాక్షి కళ్ళ కట్టినట్లు వివరిస్తుంది. అది విన్న ప్రభావతి నువ్వు అసలు నాతో మాట్లాడొద్దని చెప్పాను కదా.. ఎందుకు నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావ్ నువ్వు చేసిన దానికి నాకు ఇంకా కోపం తగ్గలేదు అని అంటుంది. సర్లే మనోజ్ నువ్వేం చేస్తావ్ చెప్పాల్సిన చెప్పావు కదా.. ఇక ఆ తర్వాత పాడి కట్టడానికి రెడీగా ఉండు అని కామాక్షి అనగానే ప్రభావతి కోపంగా ఉంటుంది. మొత్తానికి ప్రభావతి ఆ పూజకు ఒప్పుకుంటుంది.

మీనాకు గుడ్ న్యూస్..

మీనాకు ఫ్లవర్ డెకరేషన్ చేసేందుకు ఒక ఆర్డర్ గురించి ఫోన్ వస్తుంది. మీకు ఆర్డర్ ఇవ్వమని మా ఓనర్ చెప్పారు మీరు ఒకసారి రండి మాట్లాడాలి అని అతను చెప్తాడు. అయితే మీనా అక్కడికి వెంటనే వెళ్ళగానే ఆర్డర్ వచ్చింది అని చెప్పగానే మీనా చాలా సంతోషంగా ఉంటుంది. పోయినా మీ డెకరేషన్ చూస్తే అందరికీ నచ్చేటట్టు ఉండాలి.. అప్పుడే మీకు మళ్ళీ ఆర్డర్లు వస్తాయి అని అతను చెప్పగానే మీనా సరే అని అంటుంది.. ఆ విషయం ఎలాగైనా సరే ఇంట్లో చెప్పాలని మీనా చాలా సంతోషంగా వస్తుంది. మీనా సత్యం కి ఆ విషయం చెప్పగానే ప్రభావతి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది.

మీనాకు దొరికిన మాణిక్యం..

Advertisement

మీనా అందరికీ బిర్యానీ చేపిస్తానని అంటుంది అయితే తనకు తెలిసిన ఒక అక్క దగ్గరికి వెళ్లి బిర్యాని చేయించమని అడిగితే అక్కడ మా అత్తయ్యకి బాగాలేదని ఆమె చెప్పగానే నేను బాధపడుతుంది.. సరే మీనా నీకు బిర్యాని ఎలా చేయాలో నేను నేర్పిస్తాను ముందు మటన్ కొట్టుకు వెళ్లి మటన్ తీసుకుందామని అక్కడికి వెళ్ళగానే.. అక్కడ మాణిక్యం కొట్టుకువెళ్తాడు.. అయితే మీనా ను చూసిన మాణిక్యం దొరికిపోయాను అని అనుకుంటాడు. కానీ మొహానికి మాస్క్ వేసుకొని ఏదో ఒక విధంగా మీనాక్షి దొరక్కుండా మాణిక్యం మేనేజ్ చేస్తాడు. నాకు దొరికితే రోహిణి గుట్టు బయట పడుతుందని మాణిక్యం అక్కడి నుంచి పారిపోతాడు. ఇక బాలు బిర్యాని చేయడానికి అని సామాన్లను తీసుకుని వచ్చి అక్కడ పెడతాడు ఇక బాలు కి నేను రాను అని చెప్పిన మన వాసనకి టెంప్ట్అవుతాడు. రోహిణి థాంక్స్ మనోజ్ అని అంటుంది. ఎందుకు  రోహిణి అని మనోజ్ అడుగుతాడు. నిన్న నువ్వు నా పేరు చెప్పలేదు నేను ఇప్పుడు వెళ్లి బిర్యానీ తింటాను మీరు వెళ్లి వ్రతం చేసుకోండి అని అంటుంది.. అందరూ కలిసి సరదాగా బిర్యానీ తింటూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episode: సాగర్, నర్మద ల మధ్య గొడవ.. శ్రీవల్లి తాయత్తు ప్లాన్.. అడ్డంగా దొరికిపోయిన శ్రీవల్లి..

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×