E-Paper
Advertisement

Telangana Politics: జగిత్యాల సభకు కేటీఆర్ ఎందుకు దూరం.. బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?

Telangana Politics: జగిత్యాల సభకు కేటీఆర్ ఎందుకు దూరం.. బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
Advertisement

Telangana Politics: జగిత్యాల బీఆర్ఎస్ సభ అనేక అంశాలను తెరపైకి తెచ్చింది. ఆ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఆ పార్టీ. కీలక నేతలు సభకు డుమ్మా కొట్టడం వెనుక ఏదో జరుగుతున్న చర్చ తెలంగాణలో మొదలైంది. హరీష్‌రావు ఢిల్లీ వెళ్లడం ఒకటైతే, మరోవైపు కేటీఆర్ కూడా ఎస్కేప్ అయ్యారు. జీవన్‌రెడ్డి రాకను ఇద్దరు నేతలు వ్యతిరేకిస్తున్నారా? అన్న చర్చ అప్పుడే మొదలైంది.

జగిత్యాల సభపై బీఆర్‌ఎస్‌లో రకరకాలుగా చర్చ

Advertisement

జగిత్యాల సభకు దూరమైన బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు ఢిల్లీ వెళ్లారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరంతో బీఆర్ఎస్ త్రిసభ్య బృందం సమావేశమైంది. అడ్వకేట్‌ను కలిసినవారిలో ఆయనతోపాటు బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రలు ఉన్నాయి.

కాళేశ్వరం కమిషన్‌పై త్వరలో హైకోర్టు తీర్పు వెలువడునున్న నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే దానిపై చర్చించారు. దీంతో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి కార్యాచరణపై అడ్వకేట్‌తో బీఆర్ఎస్ సభ్యులు చర్చించారు.

Advertisement

సభకు కేటీఆర్ ఎందుకు దూరం.. బీఆర్ఎస్‌లో ఏం జరిగింది?

హరీష్‌రావు విషయాన్ని పక్కనబెడదా. ఇక కేటీఆర్ విషయానికి వద్దాం. జగిత్యాల సభకు కేటీఆర్‌ హాజరుకాలేదు. దీంతో ఆ పార్టీలో ఏదో జరుగుతోందన్న చర్చ అప్పుడే మొదలైంది. కేటీఆర్ దూరం వెనుక ఆ పార్టీ నేతలు కొన్ని విషయాలు బయటపెట్టారు. వడదెబ్బతో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారని అందుకే కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ జగిత్యాల సభకు హాజరు కాలేదని చెబుతున్నారు.

గడిచిన వారం రోజులు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేటీఆర్‌, సిరిసిల్లలో ఉద్యమకారిణి సత్తెమ్మ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం నుంచి జ్వరం, డీహైడ్రేషన్ వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. వైద్యుల సలహా మేరకు ఇంటి వద్ద కేటీఆర్ చికిత్స తీసుకున్నారని తెలిపారు.

ALSO READ: కేసీఆర్ నోట మ‌ళ్లీ రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ‌… ఇది రెండు వైపుల తేనె పూసిక క‌త్తి!

ఇక కాంగ్రెస్ వెర్షన్‌కు వద్దాం. జగిత్యాల బీఆర్ఎస్ సభ గురించి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సభ తర్వాత బీఆర్ఎస్‌లో ముసలం మొదలైందని వ్యాఖ్యానించారు. ఎందుకంటే జీవన్‌రెడ్డి బీఆర్ఎస్‌లోకి రావడాన్ని హరీష్‌రావుతోపాటు కేటీఆర్ జీర్ణించుకోలేక దూరంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

కొద్దిరోజుల కిందట జీవన్‌‌రెడ్డి తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. అందులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తాను ఓడిపోయినా సీఎం స్థాయి తనదని, పార్టీతో తాను సీనియర్ అని చెప్పారు. తనకు గౌరవం ఇవ్వలేదన్నది ఆయన మాట. కేసీఆర్ సమకాలీనులైన జీవన్‌రెడ్డి, రేపటిరోజు ఆ పార్టీ నేతలు చెప్పే మాటలు వింటారా? తీసుకునే నిర్ణయాలను ఫాలో అవుతారా? అన్నది పెద్ద ప్రశ్న. మొత్తానికి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

Related News

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

నాన్న‌న‌నిన నేను నిన్న‌న‌నా..! న‌న్న‌నిన‌ నీ నాన్న‌ను నేన‌న‌నా?

ముళ్ల కుర్చీపై కూర్చున్న మ‌ల్ల‌న్న‌! బాస్‌ను తిట్టే తిట్ల‌న్నీ వింటూ ఓపిగ్గా భ‌రించిన మ‌ల్లారెడ్డి..!

Big Stories

Advertisement
×