BigTV English

Gundeninda GudiGantalu Today episode: బాలు పై ప్రశంసలు.. అసలు నిజం తెలుసుకున్న ప్రభావతి..

Gundeninda GudiGantalu Today episode: బాలు పై ప్రశంసలు.. అసలు నిజం తెలుసుకున్న ప్రభావతి..

Gundeninda GudiGantalu Today episode August 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా చేత కూడా పూలు ఇంటికి పంపిస్తే ఎలా ఉంటుంది అని బాలు ఆలోచిస్తాడు. ఈ ఐడియా చాలా బాగుందిరా.. మరి బండి కావాలి కదా అని అంటారు. బండిని కొందాము నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయని అంటారు. అయితే ముందు బండిని చూసొద్దాం అని వెళ్తాడు. అక్కడ మీనాకు నచ్చిన రంగు బండి దొరకపోవడంతో ఏదో ఒక బండిని సెలెక్ట్ చేస్తాడు బాలు.. ఆ అయితే ఇంకొక 10000 కావాలని అడుగుతాడు. ఒక ముసలాయనొచ్చి నా ఇంటిలో రౌడీలున్నారు. అది ఖాళీ చేయిస్తే నేను మీకు ఆ 10000 ఇస్తానని అంటాడు.. బాలు ఆ రౌడీ దగ్గరికి వెళ్తాడు.. రౌడీలకు మొదట మర్యాదగా వార్నింగ్ ఇస్తాడు.. ఎంత చెప్పినా కూడా వినకుండా ఆ రౌడీలు బాలుపై గొడవకు దిగుతారు. మీరు మాటలతో చెప్తే వినేటట్టు లేరు కచ్చితంగా మీకు ఏదో ఒకటి చేయాలి అని బాలు వాళ్లతో గొడవకు దిగుతాడు. రౌడీలను చితగ్గొట్టి ఆ ఇంట్లోంచి ఖాళీ చేయిస్తాడు బాలు. ఆయన డబ్బులు ఇవ్వడం ప్రభావతి చూస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా కోసం ఈ స్కూటీ కొన్న మాకు చాలా సంతోషంగా ఉందని సత్యం కూడా తన కొడుకుని చూసి పొంగిపోతాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి మీనా కోసం ఇలాంటివి చేయడం చాలా సంతోషంగా ఉంది అని అందరూ బాలుపై పొగడ్తల వర్షం కురిపిస్తారు. ఇంతకీ ఈ స్కూటీ కొనడానికి నీకు డబ్బులు ఎక్కడివి రాని అడుగుతాడు సత్యం. ప్రభావతి మాత్రం వాడు రౌడీయిజం చేసి రౌడీలను కొట్టి సంపాదించాడు అని అంటుంది. ఆ విషయం పట్టుకొని ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుంది ప్రభావతి. నా ఇంట్లో ఉండనే ఉండదు వెళ్ళిపో అని బాలుని బయటకి గెంటేస్తుంది. అప్పుడే ఆ ఇంటికి రౌడీలను ఇల్లు ఖాళీ చేయించిన పెద్దమనిషి వస్తాడు.

ఆయన చూడగానే బాలు ఇక్కడికి ఎందుకు వచ్చారు పెద్ద అయినా ఏమైంది అని అడుగుతాడు. నీకోసం టాక్సీ స్టాండ్ కి వెళ్ళాను బాబు. అక్కడ నువ్వు లేవని ఇంటి అడ్రస్ ఇచ్చారు. మొదటి పెళ్లి పత్రిక నీకు ఇవ్వాలని వచ్చాను అని అంటాడు. నువ్వు రౌడీలను పంపించినందుకు ఇతనికి డబ్బులు ఇవ్వలేదా అని ప్రభావతి అడుగుతుంది. లేదమ్మా నీ కొడుకు చాలా ఆత్మాభిమానం కలిగిన వాడు. ఎంత చెప్పినా కూడా డబ్బులు తీసుకోలేదు నీ చెల్లి పెళ్లికి బట్టలు తీసుకొని నేనే ఇచ్చాను అని ఆ పెద్దాయన అంటాడు. ఇలాంటి కొడుకును కన్న తల్లిదండ్రులుగా మీరు చాలా అదృష్టవంతులు అని అంటారు.


పెళ్లి పత్రిక వేస్తుంటే మా అమ్మ నాన్నకు ఇవ్వండి అని అంటాడు. ప్రభావతి సత్యం పెళ్లి పత్రికను తీసుకుంటారు. అనంతరం ఆ పెద్దాయన వెళ్ళిపోతాడు. అయితే సత్యం ఇప్పుడు మాట్లాడండి నా కొడుకు గురించి అని అంటాడు. నా కొడుకు రౌడీయిజం చేయలేదు సమాజ సేవ చేసాడు అని అంటాడు. అందరూ నోరు మూసుకుంటారు. ఆ తర్వాత మీనా వంట గదిలో సద్దుతూ ఉంటుంది. అప్పుడే బాలు అక్కడికి వచ్చి ఏంటి మీనా గుర్రుమని ఉన్నావని అడుగుతాడు. ఆ రౌడీల చేతిలో మీకు ఏదైనా అని ఉంటే నా పరిస్థితి ఏంటి అని బాధపడుతుంది.

మీ రక్తన్ని దారి పోసి ఆ స్కూటీని కొన్నారా అని అంటుంది. నేను రౌడీలను కొట్టి డబ్బులు తీసుకోలేదు ఆ పెద్దాయన డబ్బులు తీసుకోమని నన్ను బలవంత పెడితే తీసుకున్నాను. డబ్బులు తీసుకున్నందుకు కాదండి నా బాధ ఆ రౌడీల చేతిలో మీకు ఏదైనా అయితే ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. నువ్వు కష్టపడి నాకు కారు కొనిచ్చావు. నేను కష్టపడి కొన్న స్కూటీని నువ్వు తీసుకుంటావా లేదా అని అడుగుతాడు. నీ కారు నువ్వే తీసుకో అని బాలు అంటాడు. అది మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని మీనా అంటుంది.

ఉదయం లేవగానే స్కూటీని ముస్తాబు చేసి ఉండడం చూసి బాలు షాక్ అవుతాడు. ఏంటి ఎవరో స్కూటీ నీరు రెడీ చేశారేంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చినా మీనా రాత్రి నీ కారు నువ్వు తీసుకో అన్నావ్.. ఇప్పుడేంటి కొత్తగా స్కూటీని రెడీ చేసి పెట్టావు అని అడుగుతాడు. రాత్రి అన్నారు కదా.. నాకు కారు నడపడం రాదు అందుకే స్కూటీ తీసుకున్నాను అని మీనా అంటుంది. ప్రాణాలకు తెగించి రౌడీలతో పోరాడి రక్తం చిందించి స్కూటీని కొన్నారుగా అంటుంది.. అయితే గుండెల్లో ప్రేమ నీకు కనిపించలేదని బాలు అడుగుతాడు..

Also Read : ‘జై హనుమాన్ ‘ మూవీ లేనట్లేనా.. ప్రశాంత్ వర్మ ఏం చేస్తున్నాడు..?

మీనా మాత్రం అందరిని పిలవండి పూజ చేయాలి అని అడుగుతుంది. ఇక బాలు విజిల్ తెచ్చుకొని ప్రభావతి లాగా అందని పిలుస్తాడు.. ఆ సౌండ్ కి అందరూ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తారు. కానీ నువ్వు నీ భార్య బాధని గుర్తించి అంతకు మించిన కానుక ఇస్తున్నావు. ఇంతకంటే ఇంకేం కావాలి అని సత్యం అంటాడు. ప్రభావతి ఇలా విజిలెసి పిలవాలా అని అడుగుతుంది.. ఇక మనోజ్ బాక్స్ మీద అమ్మ పేరు కాకుండా మీనా పేరు రాయిచ్చావ్ ఏంట్రా అని అడుగుతాడు.. ఎందుకు ఇది కూడా పోవడానికి అని అడుగుతాడు బాలు.. అమ్మ పేరు అచ్చు రావట్లేదు. పార్లర్కి మీ ఆవిడ పేరు పెట్టుకుంది పార్లర్ పోయింది. మీనా పూల కొట్టు పెడితే అది కార్పొరేషన్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు.. అందుకే అమ్మ పేరు నాకు అచ్చిరాలేదు. మీనా సంతోషంగా బండికి పూజ చేస్తుంది రా ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుని బాధపడడం అవసరమా అని సత్యం అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Star Maa Parivaaram Promo: శ్రీముఖికి దిమ్మతిరిగే కౌంటర్.. పెళ్లి కావ్య షాకింగ్ రియాక్షన్..

Illu Illalu Pillalu Today Episode: రామరాజు ఇంటికి దొంగగా వచ్చిన ఆనందారావు.. ధీరజ్ కు దొరికిన శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవనిని గేంటేసిన పార్వతి.. భరత్, ప్రణతిలను విడగొట్టేందుకు పల్లవి ప్లాన్.. భానుమతికి వాతలు..

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య.. పూజను పూర్తి చేసిన రోహిణి.. బాలు సెటైర్లు.. మనోజ్ కు కడుపు మంట..

Nindu Noorella Saavasam Serial Today August 6th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాలాను అడ్డుకునేందుకు ఆరు ప్లాన్‌

Brahmamudi Serial Today August 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణకు నిజం చెప్పిన కావ్య – ఎమోషనల్‌ అయిన ఇంద్రాదేవి  

Big Stories

×