Jai Hanuman : గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో తేజా సజ్జా ప్రధాన పాత్రలో నటించిన హనుమాన్ ఒకటి. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. హనుమాన్ మూవీ కలెక్షన్స్ దాదాపుగా 400 కోట్ల వరకు రాబట్టింది. ఈ సినిమా అసలు స్టోరీని సీక్వెల్ గా రాబోతున్న జై హనుమాన్ సినిమాలో చూస్తారని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎప్పుడో చెప్పాడు . కానీ ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లు కనిపించలేదు. అదిగో ఇదిగో అంటూ చెబుతున్నదే తప్ప ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు. తాజాగా ఈ మూవీలో లీడ్ రోల్ లో రిషబ్ శెట్టి నటిస్తున్నాడని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత మూవీ పరిస్థితి ఏంటి అన్నది మాత్రం చెప్పలేదు. డైరెక్టర్ మౌనం వెనుక ఏదైన బలమైన కారణం ఉందా? అసలు ఈ మూవీ ఉందా? లేదా? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి..
షూటింగ్ అప్డేట్ ఎక్కడ..?
గత ఏడాది హనుమాన్ జయంతి రోజున స్క్రిప్ట్ పని మొదలు అన్నట్లు ఒక పోస్ట్ చేసాడు. ఇక దసరా సందర్భంగా మరో ట్వీట్ చేసాడు. పీవీసీయూలో మూడో ప్రాజెక్ట్ అని అందులో ఉంది. బ్యాక్ గ్రౌండ్‌లో హనుమాన్ థీమ్ ఉంది. అది జై హనుమాన్ సినిమాకు సంబంధించిన అప్డేట్ అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ మూడో ప్రాజెక్ట్ అని ఉంది.. రెండో ప్రాజెక్ట్ ఏంటి? అనే చర్చలు జరుగుతున్నాయి. ఇదిగో అదిగో అంటున్నారే తప్ప ఆ సినిమా ముందుకే కదలట్లేదు. మధ్యలో బాలీవుడ్ హీరో తో మూవీ అన్నాడు. అది లేదు. వరుసగా నాలుగు ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టుకున్నాడు. కానీ ఏ ఒక్కటి పూర్తి కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి..
నిర్మాతగా మారిన ప్రశాంత్ వర్మ..
ఇక ప్రశాంత్ వర్మ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొనే పనిలో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. అధీరా, నందమూరి మోక్షజ్ఞ ను లాంచ్ చెయ్యబోతున్నాడని వార్తలు వినిపించాయి.. అలాగే , జై హనుమాన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. పీవీసీయూలో భాగంగా మరికొన్ని ప్రాజెక్టులు కూడా రెడీ అవుతున్నాయి. తన టీంలోని అసిస్టెంట్ డైరెక్టర్లతోనూ ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తున్నాడు. ఆయన లైనప్ లో కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. సినిమాలకు కథను , దర్శకత్వం చెయ్యడంతో పాటుగా సినిమాను నిర్మిస్తున్నాడు. మహాకాళి అనే లేడి ఓరియెంటెడ్ మూవీకి కథ , స్క్రీన్ ప్లే తో పాటుగా సినిమాను నిర్మిస్తున్నారని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈ ఏడాది సంక్రాంతికి జైహనుమాన్ మూవీ థియేటర్లలోకి వస్తుందని అనుకున్నారు కానీ రాలేదు.
Also Read:శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..
ప్రశాంత్ వర్మ ఏం చేస్తున్నాడు..?
ఈ మధ్య డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు వినిపించలేదు.. ఏ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడో తెలియలేదు. జై హనుమాన్’ ఎప్పుడు చేస్తాడన్నదే అర్థం కావడం లేదు. అసలు ప్రశాంత్ వర్మ తర్వాత ఏ సినిమాను టేకప్ చేస్తాడో..అయితే ఏది ముందుకు కదులుతుందో అర్థం కాని అయోమయం నెలకొంది. వెంటనే అందుబాటులోకి వచ్చే అవకాశం లేని రిషబ్‌ను కాకుండా ఎవరైనా తెలుగు నటుడినే పెట్టుకుని ఉంటే ఇప్పటికే మూవీ రిలీజ్ అయ్యేది అని సినీ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.. ఏది ఏమైన ఈ ఏడాదిలోనే సినిమా వస్తే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు. చూడాలి డైరెక్టర్ ఇప్పటికైన రియాక్ట్ అవుతారేమో…