Brahmamudi serial today Episode: గార్డెన్‌లో ఉన్న కావ్యకు రాజ్ ప్రపోజ్ చేయబోతుంటే ప్రకాష్ వస్తాడు. ప్రకాష్‌ను చూసి రాజ్ ప్రపోజ్ చేయకుండా కళావతి గారు నాకు అర్జెంట్ పనుంది వెళ్తాను బై అంటూ వెళ్లిపోతాడు. ప్రకాష్ ఆశ్చర్యంగా చూస్తూ అదేంటి కావ్య మీరిద్దరూ భార్యభర్తులు కదా మరి వాడేంటి తప్పు చేసేవాడు దొరికిపోయినట్టు అలా వెళ్లిపోతున్నాడు. మీరిద్దరూ భార్యభర్తలం అనే విషయం మర్చిపోయాడా ఏంటి..? అని అడుగుతాడు. ఆయన మర్చిపోవడం కాదు మామయ్య అసలు విషయం మీర మర్చిపోయారు. ఇప్పుడు ఆయనకు గతం గుర్తు లేదు కదా..? అని చెప్పగానే.. ఓ అవును కదూ వాడు మర్చిపోయాడు అనుకున్నాను నేనే అసలు విషయం మర్చిపోయాను సారీ కావ్య అంటాడు. నాకు సారీ ఏమీ వద్దు కానీ మీరు మాత్ర ఆయన ముందు ఇలా మర్చిపోయి నిజం చెప్పారంటే కొంపలు అంటుకుంటాయి అంటుంది కావ్య. లేదులే అమ్మా ఇప్పటి నుంచి బాగా గుర్తు పెట్టుకుంటాను అంటూ వెళ్లిపోతాడు.
మరోవైపు కావ్య రూంలోకి పడుకోవడానికి వెళ్లిన స్వరాజ్ మళ్లీ అపర్ణ రూంలో పడుకోవడానికి వెళ్తాడు. నాకు మా అమ్మ రోజుకో కథ చెప్తుండేది మీరు చెప్పండి అని అడగ్గానే.. అపర్ణ కథ చెప్తుంది. దీంతో స్వరాజ్ నిద్రపోతాడు. వాడితో పాటు కథ చెప్తూనే అపర్ణ, సుభాష్ కూడ నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయమే స్వరాజ్ గార్డెన్‌లో చెట్టకు నీళ్లు పడుతుంటే నిద్ర లేచి వచ్చి జూనియర్‌ను చూసి అనుమానిస్తుంది. అసలు వీడు ఎవడై ఉంటాడు. నిజంగానే ఆ పిల్లాడు గుడిలో తప్పిపోయి వదినకు కనిపించాడా..? లేకపోతే ఏదైనా గూడుపుఠాణీ జరిగిందా..? ఒకవేళ వదిన చెప్పినట్టు గుళ్లోనే తప్పిపోయి ఉంటే అప్పుడే అక్కడే గుడి ధర్మకర్తలకు కానీ పోలీసులకు కానీ అప్పజెప్పేవాళ్లు కదా..? ఇంటికి తీసుకురావడం ఏంటి..? పైగా వాడేదో ఇంటి వారసుడు అయినట్టు వాడి మీద అంత ప్రేమ చూపించడం ఏంటి..? ఇంకా వీణ్ని ఇంట్లోనే పెట్టుకోవడం ఏంటి.? ముందు వాణ్ని మచ్చిక చేసుకుని వాడెవడో తెలుసుకోవాలి. వాడి చుట్టుపక్కల ఇప్పుడెవ్వరూ లేరు ఇదే కరెక్ట్ టైం వాడెవడో వాడితోనే చెప్పించాలి అని దగ్గరకు వెళ్లి చూస్తుంది రుద్రాణి.
రుద్రాణిని చూసి ఏంటలా గుడ్లగూడలా చూస్తున్నావు విషయం ఏంటో చెప్పు అంటాడు జూనియర్ స్వరాజ్. వాడి మాటలకు కంగుతిన్న రుద్రాణి వీడు నాలాగే స్ర్టైట్ ఫార్వర్డ్ అనుకుంటా డైరెక్టుగా పాయింట్‌కు వచ్చేశాడు అని మనసులో అనుకుంటుంది ఏంటి అంటే ఏం పలకవేంటి అని జూనియర్ మళ్లీ అడగ్గానే..ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతుంది రుద్రాణి. అంత పెద్ద కళ్లు ఉన్నాయి కదా కనిపించడం లేదా..? మొక్కలకు ఆకలేస్తే నీళ్లు పడుతున్నాను అంటాడు. దీంతో ఆశ్చర్యంగా ఏంటి మొక్కలకు ఆకలి వేస్తుందా..? వీడేదో అమాయకుడు అనుకున్నాను కానీ తెలివైన వాడిలాగే ఉన్నాడు. ఎలాగైనా వీడి గురించి తెలుసుకోవాలి అని మనసులో అనుకుని చాక్లెట్ ఆశ చూపించి స్వరాజ్ డీటెయిల్స్ తెలుసుకోవాలని ట్రై చేస్తుంది. స్వరాజ్ చెప్పకపోయే సరికి బెదిరించి తెలుసుకోవాలనుకుంటుంది. ఇంతలో అపర్ణ వస్తుంది. రుద్రాణిని తిట్టి జూనియర్ స్వరాజ్‌ను తీసుకుని వెళ్లిపోతుంది.
మరోవైపు రాజ్ ప్రపోజ్ చేస్తాడని కావ్య రెడీ అవుతుంది. ఇంద్రాదేవి వచ్చి అడగ్గానే అసలు విషయం చెప్తుంది. మరోవైపు కళ్యాణ్ టెన్షన్ పడుతూ వాటర్ తాగుతాడు. అప్పు కంగారుగా కూచి నువ్వు ఓకేనా… అని అడుగుతుంది. ఏంటి ఓకేనా అసలు ఏం చేస్తున్నారు పొట్టి ఈ ఇంట్లో అ అబ్బాయి రేవతి అక్క కొడుకు అని ముందే నాకెందుకు చెప్పలేదు అంటాడు కళ్యాణ్. అంటే చెప్తే నువ్వు కంగారులో అత్తయ్యకు నిజం ఎక్కడ చెప్తావో అని చెప్పలేదు కూచి అంటుంది అప్పు. ఇప్పుడు మాత్రం తెలియకుండా ఉంటుందా పొట్టి పెద్దమ్మకు వాడెవడో తెలియక ఇంటికి తీసుకొచ్చింది అనుకో కానీ నీకు వాడు రేవతక్క కొడుకని ముందే తెలుసు కదా..? వెంటనే వాణ్ని ఇక్కడి నుంచి ఎందుకు తీసుకెళ్లలేదు. రాత్రంతా ఎందుకు పెద్దమ్మ దగ్గరే ఉంటారు. అని అడగ్గానే.. అత్తయ్యకు వాణ్ని దగ్గర చేయడం కోసం అని అసలు విషయం చెప్తుంది అప్పు. ఇదంతా ప్లాన్ చేసి నడిపిస్తున్నారు కావ్య అక్క రాజ్ బావ అని చెప్తుంది. దీంతో కళ్యాణ్ కంగారు పడుతుంటాడు.
తర్వాతి రోజు అందరూ టిఫిన్ చేస్తుంటే.. జూనియర్ స్వరాజ్ వచ్చి అల్లరి చేస్తుంటాడు. వాడి అల్లరికి అందరూ నవ్వుతుంటారు. వీణ్ని ఏమో అనుకున్నాము కానీ చాలా ఇంటలిజెంట్ ఫెలో అంటాడు ప్రకాష్. ఇంతలో అక్కడికి వచ్చిన ఇంద్రాదేవి ఇంటలిజెంట్ కాకపోతే ఎలారా వాడు ఈ ఇంటి బిడ్డనే కదా అంటుంది. ఇంద్రాదేవి మాటలకు అందరూ షాక్ అవుతారు. ఈ ఇంటి బిడ్డ అంటే ఎవరు..? అని రుద్రాణి అడగ్గానే.. కావ్య కల్పించుకుని ఏదో చెప్పి అందరినీ కన్పీజ్ చేస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం