Gundeninda GudiGantalu Today episode August 25 th : నిన్నటి ఎపిసోడ్ లో.. నా భర్త ఈ బార్ కి తాగడానికి వచ్చారండి కానీ నా భర్త తాగలేదు తాగినట్లు ఇక్కడ క్రియేట్ చేస్తారు అని మీనా అసలు విషయం చెప్తుంది. మొదట ఆ బార్ ఓనర్లు నమ్మకపోయినా ఆ తర్వాత ఆమె బాధను అర్థం చేసుకుంటారు. నీ భర్త గురించి నువ్వు ఇంత దూరం వచ్చావు అందులో ఇలాంటి చోటుకు వచ్చావు అంటే నీ ధైర్యానికి మెచ్చుకోవాలి అమ్మ అని ఆ బార్ అతను మీనా పై ప్రశంసలు కురిపిస్తాడు. నీలాంటి భార్యలు ఇంటి అంతవరకు భర్తలకి ఎటువంటి ప్రమాదం లేదమ్మా అని మీనా ను మెచ్చుకుంటాడు.. రోజుకి ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మరి నీకు నిజం ఎవరు చెప్తారు అమ్మ అని అతను అడుగుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మీనా బాధను చూసినా ఆ బారు ఓనరు మీ నాకు సీసీటీవీ ఫుటేజ్ ని చూపించమని తన మనుషులకు చెప్తాడు.. ఓనర్ చెప్పిన విధంగా అక్కడ ఉన్న స్టాఫ్ మీనా కి సీసీటీవీ ఫుటేజ్ ని చూపిస్తారు. అందులో మీన బాలుని చూసి షాక్ అవుతుంది. అయితే బాలు పెగ్గు కలిపి ఎమ్మెల్యేకు ఇవ్వడం అందులో కనిపిస్తుంది. బాలు బార్క్ రావడం చూసిన మీన అక్కడ ఎమ్మెల్యేకి మందు పోసినట్లు కనిపిస్తుంది. అయితే బాలు ఆ మందు తాగకుండా ఎమ్మెల్యే కి ఇవ్వడం చూసి మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది.. కావాలనే మా ఆయన్ని ఇరికించారని బాధపడుతుంది. ఆరోజు బార్ల కూర్చున్న వాళ్ళందరి ఫుటేజ్ ని మీన చూస్తుంది. అయితే అక్కడ గుణ ఉండడం చూసి వీడే ఇదంతా చేసి ఉంటాడు అని అనుకుంటుంది.. ఆ వీడియోను మా మరిది రవికి పంపించండి అని అడుగుతుంది..
రవి ఆ వీడియోని చూసి మీనా చెప్పినట్లుగా కార్ల స్టాండ్ దగ్గరికి వస్తాడు.. ఏమైందిరా నువ్విలా వచ్చావు ఇంకా ఏదైనా మందు పెట్టాలని అనుకుంటుందా మీ వదిన అని అడుగుతాడు.. ఏ మందు పెట్టడానికి కాదు వదిన ఏదో నీ గురించి చెప్పడానికి ఇక్కడికి రమ్మనింది అంటాడు. మీనా అక్కడికి వచ్చి ఏమండీ నన్ను క్షమించండి మీ గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని అంటుంది. మీనా బాలు ప్రతిసారి కౌగిలించుకుని మాట్లాడుకోవడంతో రాజేష్ ఏంట్రా ఇది ప్రతిసారి మేము వెనక్కి తిరగలేకున్నాం రాని అంటాడు.
ఆ వీడియోను చూపించి వీడియో ఇన్ఫ్లుయెన్సర్ ను రవి రమ్మని పిలుస్తాడు. అతను వచ్చి గుణ అనే వ్యక్తి నాకు వీడియోలు పంపించి ఎడిట్ చేయమని చెప్పారని అంటాడు. అయితే బాలుని వీడియో చేయమని రవి అడుగుతాడు.. ఆ వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా బాలు తప్ప ఏమీ లేదని అనుకుంటారు.. ఆ గుణ ఇదంతా చేశాడు అని మీనా అంటుంది.. నిజం తెలుసుకున్న మీనా బాలు ను క్షమించమని అడుగుతుంది. ఇక బాలు ఇప్పటికైనా నువ్వు నమ్మావు.
అది చాలు జీవితాంతం నీ నమ్మకాన్ని పోగొట్టుకున్నానని నేను బాధపడాలి ఏమో అనుకున్నాను అని అంటాడు. రవి ఫోన్ లోనే బాలు వీడియోని రికార్డ్ చేస్తాడు. నా తప్పేమీ లేదండి నా మీద బురదజల్లే ప్రయత్నంలోనే ఇదంతా చేసారు అని అంటాడు.. ఎప్పుడూ కారు నడిపేటప్పుడు తాగను అని బాలు అంటాడు. ఆ వీడియో కూడా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అది చూసిన అందరూ బాలు నిజంగానే తప్పు చేయలేదు అని అనుకుంటారు. ఇక మీనా బాలు అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు..
Also Read : ఈ వారం దారుణంగా పడిపోయిన రేటింగ్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?
మీనా చేసిన ధైర్యానికి అక్కడున్న సిఐ వాళ్ళందరూ మెచ్చుకుంటారు.. బాలు మాత్రం నాది తప్పు అన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు మీనానే పొగుడుతున్నారని ఫీల్ అవుతుంటారు.. ఏది ఏమైనా కూడా నిజం అందరికీ తెలిసిపోయిందని సంతోషపడతారు. అ గుణని సిఐ తీసుకొని వచ్చి విని జైల్లో వేసేస్తాం లాంటివాడు బయట ఉంటే అందరికీ సమస్య అని జైలుకు పంపించేస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే ఏం జరుగుతుందో చూడాలి..