Illu Illalu Pillalu ToIlluday Episode August 25th : నిన్నటి ఎపిసోడ్ లో.. భాగ్యం ఆనందరావు చందు దగ్గరికి వెళ్లి కాళ్ళ మీద పడతారు. మీకు 10 లక్షలు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము పరిస్థితి మీకు అర్థమైందని అనుకుంటున్నాము ఎలాగైనా సరే మీకు ఆరు నెలల్లో ఆ పది లక్షలు తిరిగి ఇస్తాము అని భాగ్యం అంటుంది. వడ్డీకి తీసుకొచ్చాను అతని దగ్గర నేను ఎలా మొహం చూపించాలి అని చందు అంటున్న సరే భాగ్యం ఆనందరావు మా పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చందు మాత్రం బాధపడుతూ ఉంటాడు. మీరు ఇలా అంటారు అని నేను అస్సలు ఊహించలేదండి అని చందు అంటాడు. శ్రీవల్లి దగ్గరికి కూడా చందు రానివ్వడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే… శ్రీవల్లిని చూసిన వేదవతి ఆస్తులు పోయాయని అందరూ చులకనగా చూస్తారని బాధపడుతుందేమో అని దగ్గరికి వెళ్లి ఓదారుస్తుంది.. నర్మదా శ్రీవల్లి దగ్గరికి వెళ్లి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. నర్మదా ప్రేమ కోసం వెతుకుతూ వెళ్తుంది. ప్రేమ బయట వర్షంలో తడుస్తూ ఉండడం చూసి షాక్ అవుతుంది. ప్రేమ ఏంటి ఏం చేస్తున్నావ్ నువ్వు.. వర్షం పడుతుంటే ఇక్కడ ఏం చేస్తున్నావ్ రా లోపలికి వెళ్దామని నర్మదా అడుగుతుంది. కానీ ప్రేమ మాత్రం నేను రాను నన్ను వదిలేయ్ అని చెప్పేసి అరుస్తుంది. ఏంటి ప్రేమ ఇలా కొత్తగా మాట్లాడుతున్నావ్? నేను చెప్పలేదని నువ్వు బాధపడుతున్నావా అని అడుగుతుంది. ఆ వల్లి మనల్ని ఎంత టార్చర్ పెట్టింది ఇంట్లో అనాధలం అన్న ఫీలింగ్ కూడా కలిగించింది..
మనకు అవకాశం వచ్చింది.. ఆవల్లి బండారం బయటపెట్టి ఉంటే చాలా బావుండేది కదా ఎందుకు నువ్వు నన్ను ఆపావు అని ప్రేమ సీరియస్ అవుతుంది..నువ్వు నాకు నచ్చట్లేదు అక్క.. ఇక మీదట నుంచి నువ్వు నాతో మాట్లాడద్దు అని ప్రేమ అంటుంది. నేను చెప్పేది విను ప్రేమ అని నర్మద ఎంత అన్నా సరే వినకుండా లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన ప్రేమ వర్షంలో తడవడంతో జలుబు చేస్తుంది. ధీరజ్ ఆమెకు అన్ని రకాల సేవలు చేస్తాడు. ఆవిరి పట్టి తీసుకొస్తాడు.
నేనంటే నీకు ఎందుకంత ప్రేమ అని ప్రేమ ధీరజ్ ని అడుగుతుంది.. నేను ఒక వస్తువుని అన్నావు కదా వస్తుకోసం ఇంత చేస్తావని ప్రేమ అడుగుతుంది. నా మీద ఫీలింగ్ ఉంది కదూ అని అడగడంతో ధీరజ్అ క్కడి నుంచి బయటికి వెళ్లిపోతాడు. నర్మదా లోపలికి వెళ్ళగానే సాగరు నీతో ప్రేమగా మాట్లాడి చాలా రోజులైంది. తడిచిపోయావు కదా నేను నీకు చీర మారుస్తాను అని అంటాడు. వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్ జరుగుతాయి. ఎపిసోడ్ మొత్తానికి సాగర్ నర్మదా రొమాన్స్ హైలెట్గా నిలుస్తుంది.. వీరిద్దరి మధ్య సాగే సీన్లు ఎపిసోడ్ మొత్తంలో ఆసక్తిగా ఉంటాయి.
Also Read : పల్లవిపై కమల్ సీరియస్.. అవనిని అవమానించిన అక్షయ్.. చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్..
ఇక తిరుపతి చేతికి చెంబు తగిలించుకొని ఊరికిలో వెళుతూ ఉంటే అందరూ ఈ చెంబు ఏంటి అని అడుగుతారు.. నాకు అర్జెంట్గా ఆకలేస్తుంది అని అనుకుంటాడు అంతలోపే ఇడ్లీ సాంబార్ రండి రండి అంటూ ఒక వాయిస్ వినిపిస్తుంది. అక్కడికి వెళ్లి బాబు నాకు ఒక ఇడ్లీ వడ ఇవ్వవా అని అడుగుతాడు. ఆనంద్ రావు ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు.. ఏంటి ఇడ్లీ అన్నయ్ నువ్వు ఇడ్లి నమ్ముతున్నావేంటి అని అడుగుతాడు.. ఆస్తులు పోయాయి కదా ఇక ఇడ్లీలు అమ్ముకోవాలి అని అంటాడు. ఈ విషయాన్ని ఎవరితోనో చెప్పద్దు అని ఆనందరావు అంటాడు. అలా ఉన్న మా అన్నయ్య ఎలా అయిపోయాడు అని తిరుపతి కూడా అంటాడు.. ఇద్దరి మధ్య కన్వర్జేషన్ కామెడీగా అనిపిస్తుంది. ఆనంద్ రావు తిరుపతి కోరిక మేరకు ఇడ్లీలను తినిపిస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…