BigTV English

Bigg Boss 9: డేర్ అండ్ డై.. హౌస్ కి మించిన ట్విస్ట్ లు.. ఊహించలేదు భయ్యో!

Bigg Boss 9: డేర్ అండ్ డై.. హౌస్ కి మించిన ట్విస్ట్ లు.. ఊహించలేదు భయ్యో!

Bigg Boss Agnipariksha : ప్రస్తుతం తెలుగులో సెప్టెంబర్ 5 నుండి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి హౌస్ లోకి ఏకంగా 5 మంది సామాన్యులు కామన్ మ్యాన్ క్యాటగిరిలో హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. అందులో భాగంగానే 20 వేలకు పైగా అప్లికేషన్లను స్వీకరించి, అందులో పలు రౌండ్ల ద్వారా 45 మందిని ఎంపిక చేశారు. ఆ 45 మందికి ‘అగ్నిపరీక్ష’ అంటూ ఒక మినీ షో ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 5 వరకు జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇందులో ఐదు మందిని మాత్రమే హౌస్ లోకి పంపించబోతున్న విషయం తెలిసిందే.


ఊహించని ట్విస్ట్ లతో సర్ప్రైజ్ ఇస్తున్న అగ్నిపరీక్ష..

ఇకపోతే ఇప్పటికే మూడు ఎపిసోడ్ లను పూర్తి చేసుకున్న ఈ అగ్ని పరీక్ష మినీ షో.. ఇప్పుడు నాల్గవ ఎపిసోడ్ కి సిద్ధమయింది. అందులో భాగంగానే తాజాగా రెండవ ప్రోమోని నిర్వహకులు విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే.. ఇందులో పెట్టే టాస్కులు బిగ్ బాస్ హౌస్ కంటే మరింత దారుణంగా ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా సొంత మొబైల్ ఫోన్లను పగలగొట్టమని చెప్పడం, అబ్బాయిలకు హాఫ్ షేవింగ్ చేసుకొని.. బిగ్ బాస్ షో అంతా అలాగే ఉండాలని చెప్పడం ఇలా పలు రకాల టాస్కులు నిర్వహిస్తూ మతి పోగోడుతున్నారు.


ఎపిసోడ్ 4 రెండవ ప్రోమో రిలీజ్..

అయితే ఇప్పుడు తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఏకంగా బయట వ్యక్తులకు ఫోన్ చేసి మరీ డబ్బులు క్రెడిట్ చేయించుకోవడం లాంటి టాస్కులు నిర్వహించారు. ఇందులో ఒక అమ్మాయి, అబ్బాయి ఫోన్ కాల్ ద్వారా తమకు తెలిసిన వారికి డబ్బు క్రెడిట్ చేయమని కోరగా.. ఇద్దరు కూడా టాస్క్ లో గెలిచారు. కాకపోతే ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ కాబట్టి ఎవరికైతే ఎక్కువ అమౌంట్ క్రెడిట్ అయిందో వారికే అవకాశాన్ని కల్పిస్తామని హోస్ట్ శ్రీముఖి చెప్పుకొచ్చింది. డేర్ అండ్ డై అంటూ నిర్వహిస్తున్న ఈ టాస్కులు చూస్తుంటే.. హౌస్ కి మించిన ట్విస్ట్ లు.. మేము ఊహించలేకపోతున్నాం అంటూ తలలు పట్టుకుంటున్నారు ఆడియన్స్. మొత్తానికైతే ఈ ప్రోమో ఇప్పుడు అంచనాలను పెంచేసిందని చెప్పవచ్చు.

బిగ్ బాస్ 9కి సర్వం సిద్ధం..

ఇకపోతే ఆ ఐదు మంది సామాన్యులు హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో ఎవరా అదృష్టవంతులని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఆ ఐదు మంది తమ సత్తా ఏంటో నిరూపించుకొని హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. కాబట్టి అక్కడ వీరిని ఎదుర్కోవడానికి సెలబ్రిటీలు ఇంకా ఎక్కువ కష్టపడాలని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సెప్టెంబర్ 5వ తేదీ నుంచి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతోంది. ఎప్పటిలాగే ఈ షోకికూడా హోస్ట్ గా నాగార్జున వ్యవహరించనున్నారు. అన్నపూర్ణ స్టూడియో వేదికగా భారీ సెట్ నిర్మాణంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ALSO READ:Director: జీవిత రాజశేఖర్ నన్ను మోసం చేశారు.. డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్! 

 

Related News

Bigg Boss AgniPariksha: స్థానాన్ని ఖరారు చేసుకున్న 6గురు సామాన్యులు వీరే.. పెండింగ్లో మరో 16మంది!

Bigg Boss 9 : బిగ్ బాస్ లో సామాన్యులకు ఇచ్చేది అంత తక్కువా..?

Ankita Naidu: అగ్నిపరీక్ష స్టేజ్ పై అడుగుపెట్టకుండానే లాగేసారు.. నిజాలు బయటపెట్టిన అంకిత నాయుడు!

Bigg Boss Noel: కొత్త కారు కొన్న బిగ్ బాస్ నోయెల్.. వీడియో వైరల్!

Bigg Boss: 12 ఏళ్ల కూతురు సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే?

Big Stories

×