Director:కోలీవుడ్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన రాజశేఖర్ (Rajasekhar) ప్రముఖ నటి జీవిత రాజశేఖర్ (Jeevitha Rajasekhar) ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట మరింత ఎక్కువగా పాపులర్ అయింది. ఒకవైపు సినిమాలు నిర్మిస్తూనే.. మరొకవైపు వివాదాలలో కూడా ఇరుక్కుంటోంది ఈ జంట. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక డైరెక్టర్ ఏకంగా జీవిత రాజశేఖర్ తనను మోసం చేసింది అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. జీవిత రాజశేఖర్ ఎవరిని ఎందుకు మోసం చేసింది? అసలు ఆ డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన ఎవరు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
రాజశేఖర్ కి మంచి కం బ్యాక్ ఇచ్చిన చిత్రం..
రాజశేఖర్ హిట్ చిత్రాలలో ‘ఎవడైతే నాకేంటి’ సినిమా కూడా ఒకటి. 2007లో వచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అప్పటివరకు వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న ఈయనకి ఈ సినిమా బిగ్ రిలీఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రాన్ని బి సముద్ర (బి.Samudra ), జీవిత సంయుక్తంగా దర్శకత్వం వహించినట్లు అప్పట్లో ప్రకటించారు. కానీ సినిమా మొత్తం తానే తెరకెక్కించానని చివరలో గొడవ చేసి మరీ జీవిత తన పేరును వేయించుకుందని డైరెక్టర్ వి సముద్ర సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా సినిమా హిట్ అవుతుందని తెలిసే కావాలని జీవిత తనతో గొడవ పెట్టుకుని, నన్ను సినిమా నుంచి తప్పించింది అని ఆయన కామెంట్ చేశారు.
ఎవడైతే నాకేంటి సినిమా విషయంలో జీవిత మోసం..
తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వి సముద్ర మాట్లాడుతూ.. “2001లో సింహరాశి విడుదల తర్వాత రాజశేఖర్ నాతో మరో సినిమా చేయాలనుకున్నారు. ఆయనకు నచ్చిన కథలను నా దగ్గరకు పంపించేవాడు. అవి నచ్చక నేను వాటిని రిజెక్ట్ చేశాను. అయినా తాను సినిమాలు చేశాడు. అలా నేను ఊహించినట్టే 2001 – 2007 మధ్యకాలంలో రాజశేఖర్ నటించిన ఏ చిత్రం కూడా విజయం సాధించలేదు. ఆయన చెబితే రిజెక్ట్ చేస్తున్నానని తెలిసి చివరికి పరుచూరితో నాకు ఫోన్ చేసి.. మలయాళ చిత్రం ‘లయన్’ కథ చెప్పించారు. అది నాకు బాగా నచ్చింది రాజశేఖర్ తో ఈ సినిమా కూడా చేస్తానని చెప్పాను. కానీ ఒక కండిషన్ పెట్టాను. ఇందులో 60 శాతం మార్పులకు ఒప్పుకుంటే చేస్తానని పరుచూరితో చెప్తే.. ఆయన అదే విషయాన్ని రాజశేఖర్ తో చెప్పగా వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఇక కథ చర్చల్లో రాజశేఖర్, జీవిత కూడా అప్పుడప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు. ఇక లయన్ లో భారీ మార్పులు చేసి ఎవడైతే నాకేంటి సినిమా కథ సిద్ధం చేసి సినిమా మొదలు పెట్టాము. సినిమా బాగా వచ్చింది. ఇక విడుదలకు ముందే సూపర్ హిట్ అవుతుందని అందరం డిసైడ్ అయ్యాము. కానీ జీవిత రాజశేఖర్ నన్ను తొలగించి డైరెక్టర్ గా జీవితా పేరు వేయించుకోవాలనుకున్నారు. ఈ విషయం నాకు ఒక రచయిత ద్వారా తెలిసింది..
పేరు కోసం జీవిత దంపతులు నాటకాలు ఆడారు – వి.సముద్ర
అందులో భాగంగానే మధ్య మధ్యలో రాజశేఖర్ ఆ సీన్ బాలేదు.. ఈ సీన్ బాలేదు అని ఓవర్ యాక్టింగ్ చేయడం.. జీవిత ఆయనను కూల్ చేస్తున్నట్లు నటించడం.. ఇదంతా చూసి పేరు కోసం ఎందుకు ఇలా నటిస్తున్నారు? కావాలంటే నాకు డైరెక్ట్ గా చెప్పండి.. మీరే తీసుకొని మీ పేరే వేసుకోండి.. నేను చేయనని బయటకు వచ్చాను. కానీ ఇండస్ట్రీ పెద్దలు మళ్లీ నన్ను రిక్వెస్ట్ చేయడంతో సినిమా చేశాను. కానీ వాళ్ళు చివర్లో కావాలనే ఇరిటేట్ చేసి రెమ్యూనరేషన్ కూడా సగమే ఇచ్చారు.వ్యక్తిగతంగా మంచి వాళ్లే కానీ పేరు కోసం ఇలా చేయడం నాకు ఏమాత్రం మంచిగా అనిపించలేదు. కానీ ఇప్పటికీ నాకు వారిపై గౌరవం ఉంది. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను” అంటూ తెలిపారు సముద్ర.
ALSO READ:Bigg Boss AgniPariksha: స్థానాన్ని ఖరారు చేసుకున్న 6గురు సామాన్యులు వీరే.. పెండింగ్లో మరో 16మంది!