Nindu Noorella Saavasam Serial Today Episode: చంభా తన మంత్ర శక్తితో గార్డెన్‌లో ఆరు ఆత్మను బంధిస్తుంది. ఇంతలో చిత్ర, మనుకు ఫోన్ చేసి మిస్సమ్మ ఇంటికి బయలుదేరించదని చెప్తుంది. దీంతో మను కంగారుగా పరుగెత్తుకుంటూ వచ్చి రణవీర్ మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. ఆ భాగీ ఇంటికి బయలుదేరిందంట అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. తను రాకముందే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అంటుంది మను. దీంతో చంభా ఒక్క ఐదు నిమిషాలు ఓపిక పట్టు ఆత్మను బంధించేస్తాను అంటుంది. దీంతో మనోహరి ఐదు నిమిషాలు కాదు నిమిషం కూడా ఉండొద్దు ఇప్పుడే బయలుదేరండి అంటుంది.
మనోహరి చెప్పింది అర్తం చేసుకో.. ఒక్క ఐదు నిమిషాలు ఒపిక పట్టు ఆత్మను బంధించేస్తాను అని చెప్తున్నాను కదా.. అంటుంది చంభా.. దీంతో మనోహరి అయ్యో వెంటనే వెళ్లిపోండి.. రణవీర్ నువ్వైనా చెప్పు అంటుంది. రణవీర్ కూడా చంభా వెంటనే వెల్దాం పద అంటాడు. చంభా అవకాశం అనేది మరోసారి వస్తుంది. నా మాట విని ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్లు అని చెప్పగానే అమర్ కారు హారన్ వినిపిస్తుంది. అదిగో వాళ్లు వచ్చేశారు.. వెళ్లండి అని మను చెప్పగానే.. చంభా ఆరు ఆత్మను బంధనంలో అలాగే ఉంచి అక్కడి నుంచి వెళ్లి చెట్టు చాటుకు వెళ్లి దాక్కుంటారు. ఇంతలో ఆటోలో మిస్సమ్మ వస్తుంది. అందరూ లోపలికి వెళ్లగానే చెట్టు చాటున ఉన్న రణవీర్, చంభా, లాయరు బయటకు వెళ్లిపోతారు. మను మాత్రం ఏమీ తెలియనట్టు హాల్లోకి వెళ్లి పేపర్ చూస్తూ కూర్చుంటుంది.
ఇంతలో వెనక నుంచి వచ్చిన మిస్సమ్మ అమర్‌ను ఏవండి అని పిలుస్తుంది. మిస్సమ్మను చూసిన అమర్ భాగీ ఏమైంది షాపింగ్ మాల్ నుంచి ఇప్పుడే వచ్చేశావు.. అని అడుగుతాడు. దీంతో మిస్సమ్మ ఏమో తెలియదండి.. నాకేదో జరుగుతుందని అనిపించింది. మీరేంటి ఆఫీసుకు వెళ్లలేదా..? అని అడగ్గానే.. ఆఫీసుకు వెళ్లాలనే బయలుదేరాం మిస్సమ్మ మీకు అనిపించినట్టే సార్‌కు కూడా అనిపించి వెనక్కి వచ్చాం అని రాథోడ్ చెప్తాడు. స్కూల్‌లో ఉన్న అంజు కూడా మన లాగే ఫీల్ అయింది భాగీ. సమ్‌థింగ్ ఈజ్ రాంగ్ అంటూ అటూ ఇటూ చూస్తుంటారు. ఇంతలో పదండి సార్ అంటూ అందరూ లోపలికి వెల్లిపోతారు. బంధనంలో ఉన్న ఆరును చిత్రగుప్తుడు బాలిక సమయం మించి పోలేదు.. ఇప్పటికైనా నువ్వు మాతో మా యమపురికి వస్తానని ఒప్పుకో అంటాడు. దీంతో ఆరు లేదు నేను రాను అంటుంది. అయ్యో నీకు ఎటుల చెప్పవలెను బాలిక అంటూ గుప్త ఫీలవుతాడు.
అమర్, మిస్సమ్మ లోపలికి వెళ్లగానే.. వాళ్లను చూసిన మనోహరి అమర్ ఏంటి అప్పుడే వచ్చేశారు ఏమైంది..? అని అడుగుతుంది. దీంతో అమర్ నువ్వు షాపింగ్ మాల్‌కు వెళ్తా అన్నావు. వెల్లలేదా..? అంటూ అమర్ అడగ్గానే.. నేను కాసేపు ఆగి వెళ్దామనుకున్నాను.. భాగీ నువ్వు కూడా వచ్చేశావేంటి..? అని అడగ్గానే.. మిస్సమ్మ, అమర్ అనుమానంగా అటూ ఇటూ చూస్తుంటారు. రాథోడ్ స్కూల్‌కు వెల్లి పిల్లలను ఇంటికి తీసుకురా అని చెప్తాడు. రాథోడ్ ఓకే సార్ అంటూ వెళ్లిపోతాడు.
మరోవైపు గార్డెన్‌లో ఆరు పక్కన కూర్చుని ఉంటాడు చిత్రగుప్తుడు. ఇంతలో యముడు వచ్చి చిత్రగుప్త ఆ బాలిక నిర్ణయం ఏమిటి అని అడుగుతాడు. దీంతో చిత్రగుప్తుడు ప్రభు మీరు చెప్పినట్టే నేను ఆ బాలికతో చర్చించాను కానీ ఎంత చెప్పినా ఆ బాలిక వినడం లేదు ప్రభూ అంటాడు గుప్త. దీంతో యముడు కోపంగానీ కర్తవ్యాన్ని మాని ఆ బాలికతో ముచ్చట్లు పెట్టుకున్నావా..? అంటాడు యముడు. దీంతో గుప్త భయంగా లేదు ప్రభు అంటాడు. ఆ బాలికను ఒప్పించి యమపురికి వచ్చెదవో లేక అచటనే ఉండెదవో నిర్ణయించుకొనుము అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు యముడు.
యముడు వెల్లిపోగానే.. ఆరు మిస్టర్ గుప్త ఏంటి నా పరిస్థితి నా శక్తులు ఏవీ పని చేయడం లేదు అంటుంది. దీంతో గుప్త మేము నీకు ముందే చెప్పితిమి కదా బాలిక మాతో పాటు యమపురికి రమ్మని లేనిచో ఆ మాంత్రికురాలి దుష్ట పన్నాగమునకు బలి అయ్యెదవు అని ఎంత చెప్పినా నీవు మా మాటనుద పెడ చెవిని పెడితివి ఇప్పుడు చూడుము ఎంత కష్టం వచ్చిందో అంటూ గుప్త చెప్పగానే.. ఇప్పుడెలా గుప్త దీనిలోంచి ఎలా బయట పడాలి. నాకు మళ్లీ మామూలు రూపం రాదా..? అంటుంది. దీంతో గుప్త నేను ఇప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను అంటాడు గుప్త. దీంతో ఆరు బాధపడుతుంది.
తర్వాత పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఆరుతో ఒక ఆటాడుకోవాలిన మను అనుకుని పుట్‌బాల్ తీసుకుని పిల్లలను పిలిచ గార్డెన్‌లోకి వెళ్తుంది మను. అందరూ పుట్‌బాల్ అడుతుంటే బాల్ ఆరుకు తగులబోతుంది. ఆరు వెంటనే భయపడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం