Gundeninda Gudigantalu Vs Illu illaalu Pillalu : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో కొన్ని సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే ఆ సీరియల్స్ ఎప్పటికీ టాప్లో ఉంటాయి. ఈమధ్య తెలుగు చానల్స్ లో కొన్ని సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటుగా అభిమానులుగా మార్చేస్తున్నాయి. కేవలం స్టోరీ తో ప్రేక్షకులను ఆలోచించేలా చేస్తుంది. బుల్లితెర స్టార్ మా లో బోలెడు సీరియల్స్ ప్రసారమవుతున్నాయి.. అందులో గుండె నిండా గుడి గంటలు, ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా ఉన్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారము ఈ రెండు సీరియల్స్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. మరి ఏ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోయిందో ఒకసారి తెలుసుకుందాం.
గుండెనిండా గుడిగంటలు..
స్టార్ మా లో గత కొన్ని నెలలుగా సక్సెస్ఫుల్ టాక్ తో ప్రచారం అవుతున్న సీరియల్ గుండెనిండా గుడిగంటలు. మధ్యతరగతి కుటుంబంలోని వ్యక్తులకు కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచన ఉంటే ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయి అన్నది ఈ సీరియల్ లో చక్కగా చూపించారు. బాలు మీనా మంచితనం, ప్రభావతి రాక్షసత్వంతో పేరేంటి నుంచి వచ్చిన కోడల్ని ఎంతగా చిత్రహింసలు పెడుతుందో ఈ సీరియల్ లో చూపించారు. సాధారణ జీవితాలకు దగ్గరగా ఉన్న ఈ సీరియల్ పై జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు..
ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితుల గురించి ఈ సీరియల్ లో చక్కగా చూపించారు.. కుటుంబంలో కోడళ్ళు ఎలాంటి కలహాలను తీసుకొస్తారు. కోడలికి ఇచ్చే విలువ ఏంటి..? డబ్బులు కోసం ఆడే నాటకాలు ఇవన్నీ ఈ సీరియల్ లో చూపించారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సీరియల్ అతి తక్కువ కాలంలోనే టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈవారం 12.56 రేటింగ్ తో దూసుకుపోతుంది. అందుకే దీనికి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది.
Also Read: సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్
ఈ వారం విన్నర్ ఎవరు..?
లేటుగా వచ్చినా లేటెస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకొని టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది ఇల్లు ఇల్లాలు పిల్లలు. మొదటి స్థానంలో కార్తీకదీపం 2 ఉండగా.. రెండవ స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు కొనసాగుతుంది. ఈ సీరియల్ తర్వాత గుండె నిండా గుడి గంటలు రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇటీవలే ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టాప్ లో దూసుకుపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. మధ్యతరగతి కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించడంతో సీరియల్కు రేటింగు పెరుగుతుందని రామరాజు అంటున్నారు. కామెడీ కూడా ఈ సీరియల్ లో ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. అందుకే ఇది టాప్ రేటింగ్ లో దూసుకుపోతుందని సీరియల్ లవర్స్ అంటున్నారు. అటు గుండెనిండా గుడిగంటలు సీరియల్.. మొదట్లో మంచిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత కొత్త సీరియల్స్ రాకతో ఈ సీరియల్కు డిమాండ్ తగ్గింది.
కంటెంట్ కూడా డౌన్ అయిపోయిందని, ఆకట్టుకునే విధంగా ఈమధ్య సీరియల్ స్టోరీ లేదని జనాలు అంటున్నారు. కేవలం రివేంజ్ స్టోరీ గా మాత్రమే ఇప్పుడు చూస్తున్నట్లు జనాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. సోషల్ మీడియా వేదికగా ఈ సీరియల్ గురించి నెటిజన్లో కామెంట్లు పెడుతున్నారు.. స్టోరీలో మార్పులు తీసుకురావాలని కోరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. కొంచెం కామెడీ మరి కొంచెం రొమాంటిక్ టచ్ ఉంటే ఈ సీరియల్ కూడా టాప్ రేటింగ్ తో దూసుకుపోతుందని జనాలు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై ఈ సీరియల్ టీం సీరియస్ గా స్పందిస్తుందేమో చూడాలి.. ఏది ఏమైనా కూడా స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో అతి కొద్ది రోజుల్లోనే ఇల్లు ఇల్లాలు పిల్లలు మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.