Brahmamudi serial today Episode: రాజ్‌ను ఎందుకు బయటకు పంపించావని అసలే ఈ మధ్య చాలా ఎక్కువ తాగుతున్నాడని అడుగుతుంది వైదేహి. కావాలనే పంపించాను మమ్మీ అలా తాగితేనే నా విలువ తెలుస్తుంది. అప్పుడే నాకు దగ్గర అవుతాడని యామిని చెప్పగానే.. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు బేబీ ఒక మనిషిని దగ్గర చేసుకోవాలంటే ప్రేమగా చేసుకోవాలి కానీ ఇలా చేయడం వల్ల ఉపయోగం ఉండదు అంటూ యామిని వాళ్ల డాడీ హెచ్చరిస్తాడు. దీంతో యామిని ఇన్నాళ్లు అలాగే చేశాను డాడీ కానీ నాకు దక్కింది ఏంటి.? అందుకే మోసం చేసినా రాజ్ ప్రేమను దక్కించుకోవాలి అనుకుంటున్నాను అని చెప్తుంది. ఇంతలో కావ్య రాజ్‌ను తీసుకుని వస్తుంది.
వాళ్లను చూసిన వైదేహి నువ్వు అల్లుడి గారికి ఫ్రీడమ్ ఇవ్వాలనుకున్నావు.. కానీ అల్లుడు గారు అదే ఫ్రీడమ్ తో చివరికి కావ్య దగ్గరకు వెళ్లాడు అని చెప్తుంది. వాళ్లను చూసిన యామిని షాక్ అవుతుంది. బయట కావ్యతో లోపలికి వస్తూ నేను ఎక్కడికి రాను.. నన్ను వదిలేయండి.. నాకు ప్రపంచంతో అవసరమే లేదు అని చెప్తాడు. దీంతో కావ్య రామ్ గారు కాస్త రెస్ట్ తీసుకొండి ఆ తర్వాత ప్రపంచంతో పోరాటానికి వెళ్లొచ్చు అని చెప్తుంది. నా ప్రపంచమే నువ్వైనప్పుడు నా పోరాటం కూడా నీతోనే పద రోడ్డు మీద కొట్టుకుందాం.. అంటాడు రాజ్. దీంతో రామ్ గారు కాస్త రెస్ట్ తీసుకుని తర్వత కొట్టుకుందాం అంటూ లోపలికి తీసుకెళ్తుంది. ఏమైంది మా బావకు ఇన్నాళ్లు దూరం పెట్టావు. ఇప్పుడేమో కొత్తగా తాగుడు అలవాటు నేర్పావా..? అంటుంది యామిని. కావ్య కోపంగా చూస్తూ రాజ్‌ను బెడ్‌రూంలో పడుకోబెడుతుంది.
ఏడుస్తూ బయటకు వెళ్లిన కావ్యను చూసి ఏంటి కావ్య నీ మొగుడు తాగి అలా దేవదాసులా రోడ్డు మీద తిరిగే సరికి చూసి తట్టుకోలేకపోయాయా..? ఏమై పోతాడోనని కంగారు పడి ఇంటికి తీసుకొచ్చావా..? డోంట్ వర్రీ కావ్య నీ మొగుణ్ని నువ్వెంత ప్రేమిస్తున్నావో అంతకు వంద రెట్లు నేను కూడా ప్రేమిస్తున్నాను. తనకు ఏమీ కానివ్వను. ఇప్పుడు ఈ మందు అలవాటు చేసింది కూడా నేనే ఎందుకో తెలుసా..? నువ్వు కడుపుతో ఉన్నావని తెలియగానే రాజ్ మనసులో నీ మీద చాలా కోపం పెరిగింది. కానీ అదే సమయంలో ఎక్కడో చిన్న కన్పీజన్ కూడా ఉంది. ఆ కన్పీజన్ క్లియర్ చేసి నీ మీద అసహ్యం కలిగించాలని మందుకు బానిసను చేస్తున్నాను. నిన్ను పూర్తిగా అసహ్యించుకుని నీకు దూరం అయ్యాక మళ్లీ రాజ్‌ను నా వాణ్ని చేసుకుంటాను. నీ వెంట తిరుగుతున్నందుకు రాజ్‌కు నేను వేస్తున్న చిన్న శిక్ష ఇది అని చెప్పగానే..
కావ్య కోపంగా యామినిని కొడుతుంది. దీంతో యామిని కోపంగా ఎంత ధైర్య ఉంటే నా ఇంటికే వచ్చి నన్ను కొడతావా..? అంటూ కావ్యను కొట్టబోతుంటే వైదేహి ఆపేస్తుంది. దీంతో కావ్య ఈ ఆపడం ఏదో మొదట్లోనే ఆపేసి ఉంటే నీ కూతురు జీవితం ఎప్పుడో బాగుపడేది. నా మొగుడిని దక్కించుకోవాలి అనుకున్న రోజే దీని చెంప పగులగొట్టి ఉంటే.. ఈ రోజు నేను ఇలా కొట్టాల్సిన అవసరం వచ్చేది కాదు. నీ కూతురు మొండితనానికి స్వార్థానికి లొంగిపోయి తను సంతోషంగాఉంటే చాలు అనుకున్నారు. దానికి ప్రతిఫలం ఒక కుటుంబం మొత్తం బాధపడుతుంది. కనీసం ఇప్పటికైనా మనుషులుగా మారండి.. అంటూ కావ్య చెప్పగానే..
యామిని కోపంగా ఏంటో మాకు నీతులు చెప్తున్నావు.. రాజ్ ను నువ్వు పెళ్లి చేసుకోక ముందే నేను ప్రేమించాను అంటుంది. దీంతో కావ్య రాతలో లేని రాముడిని కోరుకోవడం వల్లే రామరావణ యుద్దానికి కారణం అయింది. అన్నయ్య చావును కళ్లారా చూసింది. త్వరలోనే నీ జీవితం కూడా అలాగే అవుతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ అంటూ వెళ్లిపోతుంది. ఇంటికి వెళ్లి కావ్య ఏడుస్తుంది. దీంతో అపర్ణ, ఇంద్రాదేవి, రాజ్‌ను మార్చాలని యామిని ఇంటికి వెళ్తారు. అప్పటికే పుల్లుగా తాగి మెట్ల మీద పడి ఉంటాడు రాజ్. యామిని, రాజ్‌ను లేపుతూ ఉంటుంది. అపర్ణ, ఇంద్రాదేవిని చూసి వెటకారంగా మాట్లాడతాడు. కళావతిని అసహ్యించుకుంటాడు. అపర్ణ, ఇంద్రాదేవి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం