Telangana: వరుస పండుగల వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి, దసరా నేపథ్యంలో ఆయా మండపాలకు ఉచితంగా కరెంటు ఇవ్వాలని నిర్ణయించింది. గణేష్ చతుర్థి, దుర్గా మాత వేడుకలకు అనుమతి తీసుకున్న మండపాలకు ఫ్రీగా కరెంట్ సరఫరా చేయనుంది ప్రభుత్వం.
వరుస పండుగల తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఈనెల 27 నుంచి వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. రాజధాని హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే అన్ని మండపాలకు ఇది వర్తించనుంది. మండపాల నిర్వహణలో ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా మండపాల అనుమతి ఉన్నవారు ఎక్కడి నుంచి విద్యుత్ తీసుకుంటున్నారు అనే వివరాలు సమర్పించాలని సూచించింది.
గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్
తెలంగాణలో వినాయక చవితి వేడుకలు జోరుగా మొదలయ్యాయి. మండపాల ఏర్పాటు, బొజ్జ గణపయ్య విగ్రహాల తరలింపు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ పోలీసులు మార్గదర్శకాలు విడుదల చేశారు. మండప నిర్వాహకులు తప్పనిసరిగా ఈ నిబంధనలను పాటించాలని సూచించారు. మండపాల కోసం ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆ రూల్స్ ఏంటో ఓ లూక్ ఏద్దాం. విద్యుత్ కనెక్షన్లకు అధికారుల అనుమతి తప్పనిసరి. మండపాల నిర్మాణ పనులు నిపుణులకే అప్పగించాలి. రోడ్లు పూర్తిగా బ్లాక్ చేయరాదు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి.
Also Read: వరకట్న వేధింపులతో భార్య.. పోలీస్ ఎన్ కౌంటర్‌లో భర్త.. అసలు ఏం జరిగిందంటే..?
నైట్ 10 తర్వాత డీజేలు, మైక్ వాడరాదు..
డీజేలకు నిషేధం, రాత్రి 10 గంటల తర్వాత మైక్ వాడరాదు. మైక్ సౌండ్ లెవెల్స్ ప్రభుత్వ నిబంధనలలోపే ఉండాలి. సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు తప్పనిసరి. వర్షాలను దృష్టిలో ఉంచుకొని మండపాలు నిర్మించాలి. భక్తుల తాకిడికి తగ్గట్టుగా క్యూలైన్లు, వాలంటీర్లను ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ సమస్యలు రాకుండా వాహన పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేయాలి. పాయింట్ బుక్ లో నిర్వాహక కమిటీ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. అనుమానాస్పద కదలికలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. విగ్రహ నిమజ్జనం ప్రభుత్వం సూచించిన అధికారిక స్థలాల్లోనే జరగాలని స్పష్టం చేశారు.