BigTV English

Bigg Boss AgniPariksha: స్థానాన్ని ఖరారు చేసుకున్న 6గురు సామాన్యులు వీరే.. పెండింగ్లో మరో 16మంది!

Bigg Boss AgniPariksha: స్థానాన్ని ఖరారు చేసుకున్న 6గురు సామాన్యులు వీరే.. పెండింగ్లో మరో 16మంది!

Bigg Boss AgniPariksha:వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss) ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వినూత్న టాస్క్ లతో ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మిగతా భాషల విషయం పక్కన పెడితే.. ఇప్పుడు తెలుగులో అత్యంత ప్రచాధారణ పొందుతున్న షోగా బిగ్ బాస్ మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతోంది. ఇప్పుడు ఆ టీఆర్పీ రేటింగ్ ను పదిలం చేసుకోవడానికి బిగ్ బాస్ నిర్వహకులు భారీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లోకి ఏకంగా 5 మంది సామాన్యులను తీసుకురాబోతున్నట్లు స్పష్టం చేశారు.


సామాన్యుల నుంచి 20 వేలకు పైగా అప్లికేషన్స్..

ఈ మేరకు సామాన్యుల నుంచి 20వేలకు పైగా అప్లికేషన్లు రాగా.. పలు రౌండుల ద్వారా 45 మందిని ఎంపిక చేశారు. ఇప్పుడు వీరందరికీ అగ్నిపరీక్ష అంటూ ఒక మినీ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ బిందు మాధవి (Bindu Madhavi), అభిజిత్(Abhijeet ), నవదీప్(Navadeep ) జడ్జిలుగా వ్యవహరిస్తూ ఉండగా.. శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. వీరంతా కూడా అత్యంత కఠినమైన టాస్కులను సామాన్యులకు పెడుతూ అందులో నుండి 5 మందిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇకపోతే ఇప్పటివరకు 3 ఎపిసోడ్లు పూర్తికాగా ఈ మూడు ఎపిసోడ్లలో 15 మందికి టాస్కులు నిర్వహించగా.. అందులో ఆరుగురు స్థానాన్ని ఖరారు చేసుకున్నట్లు సమాచారం.


జడ్జిలను మెప్పించిన ఆరుగురు వీరే..

ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 5 వరకు జియో హాట్ స్టార్ వేదికగా ఎక్స్క్లూజివ్ గా ప్రసారమవుతున్న ఈ బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోలో ఇంకా 16 మంది పెండింగ్లో ఉన్నారు. ఆ 16 మందిలో ఇంకా ఎంతమందిని ఫైనల్ చేస్తారు..? అలా ఫైనల్ అయిన వారిలో ఎవరా 5 మంది అదృష్టవంతులు హౌస్ లోకి వెళ్లే అవకాశాన్ని అందుకోనున్నారు? అనే విషయం తెలియాలి అంటే సెప్టెంబర్ 5 వరకు ఎదురు చూడాల్సిందే. ఇకపోతే ఇప్పటివరకు జరిగిన మూడు ఎపిసోడ్లలో స్థానాన్ని ఖరారు చేసుకున్న ఆ ఆరుగురు సభ్యులు ఎవరు.. ? ఏ రకంగా జడ్జిలను మెప్పించారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

జడ్జిల టాస్క్లను అవలీలగా పూర్తిచేసిన ఆరుగురు..

జడ్జిలను తమ పెర్ఫార్మన్స్ తో మెప్పించిన ఆరుగురు విషయానికి వస్తే.. దివ్యా నిఖిత, శ్రేయ, ప్రసన్న కుమార్, డెమోన్ పవన్, అనూష రత్నం, శ్వేతా రెడ్డి అనే ఆరుగురు టాప్ 15 స్థానాలలో నిలిచారని బిగ్ బాస్ అగ్నిపరీక్ష నిర్ణేతలు వెల్లడించారు. ముఖ్యంగా శారీరక ఓర్పు, మానసిక చురుకుదనం, భావోద్వేగ లోతు ఆధారంగా పరిశీలించి వీరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఏకగ్రీవంగా పచ్చ జెండాలు అందుకున్నారు ఈ ఆరుగురు. ఇక మిగిలిన వారు న్యాయ నిర్ణేతల నుండి రెడ్ కార్డ్ దక్కించుకోవడం జరిగింది. వారిలో మల్టీ స్టారర్ మన్మధ రాజా, మాధురి , జనీత్, పాత్రుని శాస్త్రి, నరసయ్య తాటా, రవి , బెజుగం వెంకటేష్ తదితరులు ఉన్నారు. మిగిలిన 30 మందిలో ఇప్పటికే 15 మంది రెడ్ కార్డ్ అందుకొని బయటకు వెళ్ళిపోగా.. మిగిలిన 15 మందికి టెస్టులు నిర్వహించి.. మొత్తంగా ఐదుగురిని హౌస్ లోకి పంపించబోతున్నట్లు సమాచారం.

Related News

Bigg Boss 9: డేర్ అండ్ డై.. హౌస్ కి మించిన ట్విస్ట్ లు.. ఊహించలేదు భయ్యో!

Bigg Boss 9 : బిగ్ బాస్ లో సామాన్యులకు ఇచ్చేది అంత తక్కువా..?

Ankita Naidu: అగ్నిపరీక్ష స్టేజ్ పై అడుగుపెట్టకుండానే లాగేసారు.. నిజాలు బయటపెట్టిన అంకిత నాయుడు!

Bigg Boss Noel: కొత్త కారు కొన్న బిగ్ బాస్ నోయెల్.. వీడియో వైరల్!

Bigg Boss: 12 ఏళ్ల కూతురు సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే?

Big Stories

×