AP New Scheme: ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈసారి రూటు మార్చింది. అన్ని వర్గాలను దగ్గర చేర్చుకునే పనిలో పడింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కాకుండా పరిస్థితులను బట్టి పథకాలను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఏపీలో పారిశుద్ధ్య కార్మికులకు తీపి కబురు చెప్పేశారు.
మున్సిపల్ కార్మికుల సంక్షేమం విషయంలో చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ఈవెంట్‌లో భాగంగా శనివారం పెద్దాపురంలో పర్యటించిన సీఎం చంద్రబాబు పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రమాద-ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించారు. మున్సిపల్ కార్మికులకు సాలరీ ప్యాకేజ్ ఖాతాలు ప్రారంభించింది ప్రభుత్వం.
రాష్ట్రంలోని 123 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి. అందులో 55,686 మంది కార్మికులు సేవలందిస్తున్నారు. కొత్త పథకం ద్వారా వారికి బీమా సదుపాయం లభించనుంది. 39 వేల పైచిలుకు మంది పబ్లిక్ హెల్త్ విభాగంలో ఉన్నారు. మరో 16,516 మంది ఇతర విభాగాల్లో ఉన్నారు. శాశ్వత, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్నారు.
వారందరికీ కూటమి తెచ్చిన కొత్త పథకం వర్తించనుంది. ఔట్‌సోర్సింగ్ పని చేసే ఉద్యోగులకు రూ.20 లక్షల ప్రమాద బీమా, రూ.2 లక్షల లైఫ్ కవర్ అందనుంది. శాశ్వత ఉద్యోగులకు కోటి వరకు ప్రమాద బీమా, 10 లక్షల లైఫ్ కవర్ అందనుంది. ప్రమాద మరణం జరిగితే పిల్లల చదువుల కోసం గరిష్టంగా రూ. 8 లక్షల వరకు విద్యా సహాయం రానుంది.
ALSO READ: 51వ సీఆర్డీఏ సమావేశం.. అమరావతి డెవలప్మెంట్ కు ఎన్నికోట్లంటే..
కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం రూ.33 లక్షల వరకు ఆరోగ్య బీమా అందనుంది. కార్మికుల కుటుంబ సభ్యులు మరో జీరో బ్యాలెన్స్ అకౌంట్ తెరిస్తే వారికి రూ.15 లక్షల మేర ప్రమాద బీమా సౌకర్యం రానుంది. యాక్సిస్ బ్యాంక్‌తో అవగాహన ఒప్పందం ద్వారా ఈ ప్రయోజనాలు విస్తరించాయి.
ఈ పథకం తమకు ఎంతో ఉపయోగపడుతుందని మున్సిపల్ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా మా తల రాతలు మారలేదని, కష్టపడిన దానికి అసలు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కొత్త స్కీం. ప్రమాద, ఆరోగ్య బీమా స్కీంను ప్రారంభించిన ముఖ్యమంత్రి
* 55,686 మందికి మేలు కలిగేలా యాక్సిస్ బ్యాంక్ శాలరీ అకౌంట్లు
* శాశ్వత ఉద్యోగులకు ఒక రూ. 1 కోటి వరకు ప్రమాద బీమా, పది లక్షల లైఫ్ కవర్
* ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ. 20 లక్షల… pic.twitter.com/Uky0vaBtfa— Telugu Desam Party (@JaiTDP) August 25, 2025