Intinti Ramayanam Today Episode August 25th : నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీకర్ తన ఫ్రెండుతో కలిసి కారులో వెళ్తూ ఉంటాడు. ఇంతకుముందు ఎప్పుడూ బాధగా కనిపించే నువ్వు.. ఇప్పుడు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఏంట్రా నీ సంతోషానికి కారణం అని అడుగుతాడు తన ఫ్రెండ్.. మా వదిన మా చెల్లెలు పెళ్లి చేసింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న మా చెల్లి చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ కూడా వదినపై కోపాన్ని తగ్గించుకుంది.
నాకు చాలా సంతోషంగా ఉంది అని శ్రీకర్ అంటాడు. ఇప్పుడు మా ఇంట్లో సమస్యలు తగ్గిపోయాయి రా అందుకే నేను సంతోషంగా ఉన్నానని తన ఫ్రెండ్ తో అంటాడు శ్రీకర్. ఇద్దరూ కారులో వెళుతూ ఉండగా అక్షయ్ ని మోసం చేసిన వ్యక్తి శ్రీకర్కు కనిపిస్తాడు. అతని దగ్గరకు వెళ్లి మా అన్నయ్య చేత దొంగ సంతకం పెట్టించుకునింది నువ్వే కదా అని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నారు అసలు ఎవరు మీరు అని అతను అడుగుతాడు. ఎంతమందిని ఇలా మోసం చేస్తావురా అని శ్రీకర్ అంటాడు. మీరు ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నారో నా గురించి మీకు తెలుసా అని ఆ వ్యక్తి అంటాడు. ఎవరో నీకు తెలుస్తుంది పద పోలీస్ స్టేషన్ కి అని అతని తీసుకొని వెళ్ళిపోతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే…ఇంట్లోకి పార్వతి రావడం చూస్తారు. వ్రతం గురించి అన్నయ్య వాళ్ళతో చెప్పారా వస్తానని అన్నారని కమల్ అడుగుతాడు. ఏమైంది పార్వతి వ్రతం చేయించడానికి అక్షయ్ ఒప్పుకున్నాడా అని భానుమతి అడుగుతుంది. కానీ పార్వతి మాత్రం దిగులుగా రతన్ చేయడానికి అక్షరం రావట్లేదు అని చెప్పేసాడని అంటుంది. అప్పుడే పార్వతికి అవని ఫోన్ చేస్తుంది. అక్షయ్ ని అవని రాజేంద్రప్రసాద్ ఒప్పించే ప్రయత్నం చేస్తుంటారు. పల్లవి బావగారికి పెళ్లంటే ఇష్టం లేదు ఇక ఈ వ్రతాన్ని ఎలా చేస్తారు అనుకున్నారు అంటూ మాటలతో బాధపెడుతుంది. ఈ వ్రతాలు అవి ఇవి ఎందుకు ఏదో పెళ్లయింది అందరితో సంతోష పడాలి కానీ.. అన్ని చేయాలంటే అదృష్టం కూడా ఉండాలని ప్రణతిపై సీరియస్ అవుతుంది పల్లవి. శ్రేయ కూడా పల్లవి ఏదంటే అదే అంటుంది.
కమల్, శ్రీకర్ ఇద్దరు కలిసి ఎలాగైనా ఇప్పిస్తామని అంటాడు.. మీ అమ్మ వెళ్లి మాట్లాడిన కూడా ఒప్పుకొని మీ అన్నయ్య నువ్వు వెళ్లి రమ్మంటే ఒప్పుకుంటాడా ఏంటి అని పల్లవి మనసులో అనుకుంటుంది. శ్రీకరు చక్రధర్ మనిషిని తన ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లి కట్టేసి అసలు నిజం చెప్పించాలని అనుకుంటాడు. కానీ అతను నేనెవరో తెలుసా? నా బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా? అని అంటాడు తప్ప అసలు నిజాన్ని బయట పెట్టడు. మా ఇంట్లో వ్రతం చేపిస్తున్నారు రా అది అయిన తర్వాత వీడు సంగతి చూద్దాం వీడిని ఒక గంట కనిపెట్టు అని శ్రీకర్ తన ఫ్రెండుకి అప్పగించి వెళ్తాడు.
ఇక కమల్ శ్రీకర్ కి ఫోన్ చేసి అన్నయ్య దగ్గరికి వెళ్లాలని అంటాడు. సరే వెళ్దామని శ్రీకర్ అంటాడు.. అటు అవని అక్షయ్ ఇంటర్వ్యూ కి వెళ్తున్నాడు సక్సెస్ అవ్వాలని పూజలు చేస్తుంది. కచ్చితంగా ఆ ఇంటర్వ్యూ వస్తే నేను ఏడు వారాలు ఉపవాసం ఉండి పూజ చేస్తానని దేవుని మొక్కుకుంటుంది. హాల్లో ఉన్న రాజేంద్రప్రసాద్ అక్షయ్ ని ఎక్కడికి వెళ్తున్నావ్ రా అని అడుగుతాడు..
నాన్న మీరు పెద్దవారు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడగకూడదని మీకు తెలియదా అని అక్షయ్ అంటాడు. అయితే అవని ఎదురుగా హారతి పెళ్ళాం తీసుకొని వస్తుంది. వచ్చావా నువ్వు ఎదురుగా వస్తేనే పోయినసారి ఇంటర్వ్యూ దొబ్బింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి అని అక్షయ్ అవనితో అంటాడు.. నా జీవితంలో దురదృష్టం అంటే అది నువ్వే అని అవనిని దారుణంగా అవమానిస్తాడు.
రాజేంద్రప్రసాద్ మాత్రం ఒకప్పుడు మనం అవని చేత్తో ఏం చేస్తే అది మంచి జరుగుతుందని అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఎదురొస్తే అరిష్టం నష్టం అంటూ మాట్లాడుతున్నావా అని రాజేంద్రప్రసాద్ పెద్ద క్లాస్ పీకుతాడు. అవని ఎదురుగా వచ్చింది కదా కచ్చితంగా ఈ జాబ్ కూడా రాదు అని అక్షయ్ అంటాడు. ఈ మాత్రం దేవుడు మీద నాకు నమ్మకం ఉంది ఈ జాబు మీకే వస్తుంది అని అంటుంది..
అవని అంత గొప్పదైతే మీరే నెత్తిన పెట్టుకొని సన్మానాలు సభలు చేసి తరించండి అని అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీ అబ్బాయి అవనీని పట్టించుకోకపోయినా ఎప్పుడు తన భర్త మీద ప్రేమను మాత్రం తగ్గించుకోలేదని స్వరాజ్యం అంటుంది. నీలాంటి భార్యను పొందాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి అని అంటుంది. అక్షయ్ ఇంటర్వ్యూకి బయలుదేరుతాడు. అప్పుడే కమల్ ఫోన్ చేసి నిన్ను కలవడానికి నేను శ్రీకర్ అన్నయ్య వస్తున్నాం..ఎక్కడున్నావ్ అన్నయ్య అని అడుగుతాడు.. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
Also Read : బాలు కోసం మీనా త్యాగం.. బయటపడ్డ నిజం..జైలుకు వెళ్లిన గుణ..
సరే మేము నీతో మాట్లాడాలి ఎక్కడికి రమ్మంటావో చెప్పు అన్నయ్య అని కమల్ అడుగుతాడు.. శ్రీకర్ కమల్ ఇద్దరూ కూడా అక్షయ్ దగ్గరికి వెళ్తారు. నువ్వు వ్రతానికి రానన్నావ్ అంట కదా ఏమైంది అన్నయ్య అమ్మ బాధపడుతుంది అని కమల్ అంటాడు.. అతనికి రావాలని పిలవడానికి వచ్చాము అని అక్షయ్ అంటాడు.. నువ్వు రాలేదని అమ్మ దిగులుగా కూర్చుంది వ్రతం చేయలేదు… అక్షయ్ మాత్రం తమ్ముళ్లపై సీరియస్ అవుతాడు.. కమల్ అవనీకి ఫోన్ చేసి మేమెంత రిక్వెస్ట్ చేసినా రానన్నాడు వదిన అని అంటాడు.. మీరేం కంగారు పడకండి కన్నయ్య మీ అన్నయ్యను వ్రతానికి తీసుకొచ్చే బాధ్యత నాది అని అంటుంది. అక్షయ్ ఇంటర్వ్యూకి వెళ్లిన ఆఫీస్ లో మేడం భార్యలను ప్రేమించే వాళ్ళకి మాత్రమే ఉద్యోగం ఇస్తుందని తెలుసుకొని షాక్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…