BigTV English

GudiGantalu Today episode: ప్రభావతి పై మీనా సీరియస్.. బుద్ధి చూపించిన మనోజ్.. ఇంట్లో బాంబ్ పేల్చబోతున్న బాలు..

GudiGantalu Today episode: ప్రభావతి పై మీనా సీరియస్.. బుద్ధి చూపించిన మనోజ్.. ఇంట్లో బాంబ్ పేల్చబోతున్న బాలు..

Gundeninda GudiGantalu Today episode August 30th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు షాప్ చూసాడు అంటే అది కచ్చితంగా పూల కొట్టు అయ్యే ఉంటుంది. లేదా కిరాణ షాప్ అయ్యి ఉంటుందని ప్రభావతి దారుణంగా అంటుంది.. కానీ అదొక ఫర్నిచర్ షాప్ అనగానే అందరూ నోర్లు వెళ్లబెడతారు. బాలుని తలా ఒక మాట అనేస్తారు.. బాలుని మీనా మీరు ఒకసారి పక్కకు రండి అని పిలుస్తుంది. దారిన పోయే దురద మీకెందుకు అని మీనా క్లాస్ పీకుతుంది.. వాడు మంచోడే కానీ సోమరిపోతు వాణ్ని ఒక దారిలో పెడితే నాన్నకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాడు కదా అలా ఆలోచించి ఇలా చేశాను అని మీనాకు సమాధానం చెప్తాడు. మా నాన్న సంతోషమే నాకు కావాలి వాడు బాగుపడితే మా నాన్న చాలా సంతోషపడతాడు అని మీనాతో అంటాడు.. మీనా మీరు ఏదైనా లాభం లేకుండా చేయరా ఏంటి అని ఎగతాళిగా మాట్లాడుతుంది.. అందరూ కలిసి షాపును చూడడానికని అక్కడికి వెళ్తారు.. చాలా పెద్ద షాపు అని ప్రభావతి సంతోషపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు చూపించిన పెద్ద షాప్ చూసి చాలా బాగుంది అని అంటారు. మనోజ్ ఎంత పని దొంగ అయిన ఓనర్ కుర్చీలో కూర్చుంటే దర్జాగా ఉన్నాడు అని బాలు మురిసిపోతాడు. సత్యం బాలు మాటతో సంతోష పడతాడు. ప్రభావతి కూడా బాలు మాట విని సంతోషపడుతుంది. ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్లి షాప్ చాలా బాగుంది సెంటర్లో ఉంది కదా మంచి లాభాలు వస్తాయి ఏంటో ఆలోచిస్తూ ఉంటారు. ఇక మీనా భోజనాలు అయ్యాయి రండి అనేసి అంటుంది.

అందరూ భోజనానికి కూర్చుంటే శృతి మీనా అని కూడా భోజనం చేయమని అడుగుతుంది. కానీ మీనా మాత్రం నేను ఇప్పుడు చెయ్యను మీరందరూ తిన్న తర్వాత తింటానులే అని  అంటుంది. ఇన్నాళ్ళలో ఎప్పుడూ నువ్వు మాతో కలిసి కూర్చోలేదు ఇప్పుడు కూర్చో మీనాని ఎంత బ్రతిమలాడినా మీనా కూర్చోదు. అది ఎందుకు కూర్చుంటుంది దానికోసం సపరేట్ గా కూరల్లో వండి పెట్టుకుని ఉంటుందిలే అందుకే ఇప్పుడు తినదు తర్వాత దాచిపెట్టుకుని తెచ్చుకుని తింటుంది లేని ప్రభావతి అంటుంది.


నేను నా కోసం కూరలు పెట్టుకున్నాను అని మీరు ఎప్పుడైనా చూసారా ఎక్కడ పెట్టానో తెచ్చి చూపించండి అని మీనా ప్రభావతికి షాక్ ఇస్తుంది. మీరందరూ తిన్న తర్వాత మిగిలితే తింటాను లేదంటే గమ్మున ఉంటాను. ఎందుకు అత్తయ్య నామీద మీకు అంత కోపం అని మీనా అడుగుతుంది. రవి శృతిల్ కూడా మీనా కి సపోర్ట్ గా నిలుస్తారు. ఇదంతా అయిన తర్వాత మీనా భోజనం చేయకుండానే బట్టలు ఆరేసినవి తీసుకురావాలని వెళుతుంది. ఇంట్లో వాళ్ళందరూ అన్న మాటల్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇది నాకేమీ కొత్త కాదు కదా అని తనకు తానే సర్ది చెప్పుకొని బట్టలను తీసుకొని వస్తూ ఉంటుంది.

రోహిణి, మనోజ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. బాలు కి నేనంటే ఎంత కోపం ఉన్నా నా మీద కాస్త ప్రేమ ఉంది అందుకే వాడు అంత మంచి షాప్ చూపించాడు అని మనోజ్ పొగిడిస్తాడు. మనము ఇంతకీ ఈ షాప్ కి ఏ పేరు పెడదాం కల్పన పేరు పెడదామా.. మీ నాన్న పేరు పెడదామా అని అడుగుతాడు. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు ఇంకా కల్పనని మర్చిపోలేక పోతున్నావా అని రోహిణి సీరియస్ గా మనోజ్ నీ కిందకు తోసేస్తుంది.

నేను ఊరికే నీకు కోపం తెప్పించాలని అలా అన్నాను రోహిణి నిజంగానే నాకు కల్పన మీద ఏ ఫీలింగ్ లేదు అని అంటాడు. అయితే ఈ షాప్ కి అత్తయ్య గారి పేరు పెడదామని రోహిణి అంటుంది. మా అమ్మ పేరు అస్సలు అచ్చి రావట్లేదు అని మనోజ్ అనడం బాలు వింటాడు. వీడి బండారం కచ్చితంగా బయట పెట్టాలి అని ఫోన్లో రికార్డ్ చేస్తాడు. మనం ఎన్ని తప్పులు చేసినా మనల్ని వెనకేసుకుని వచ్చింది ఆవిడే కదా.. ఈ షాప్ కి ఆవిడ పేరు పెడితేనే బాగుంటుంది అని రోహిణి అంటుంది. మా అమ్మ పేరు పెడితే కలిసి రావడం లేదు నువ్వు పార్లర్ పెట్టావ్ పోయింది ఇప్పుడు అందులోని నువ్వు ఎంప్లాయ్ గా చేస్తున్నావు. అలాగే మీనా పూల కొట్టు పెట్టింది అది కూడా కార్పొరేషన్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు. మా అమ్మకి కావాలంటే ఒక చీర కొని పెడదాం అని మనోజ్ అంటాడు.

Also Read : బాడీ షేమింగ్ వల్ల బాధపడ్డా.. నరకం చూశాను.. కన్నీళ్లు తెప్పిస్తున్న హరిత స్టోరీ..

వెంటనే రూమ్ లోకి వచ్చేసిన బాలు ఏంట్రా లక్షలు మింగినోడ అమ్మ అంటే ఏమనుకున్నావ్ రా ఏం మాట్లాడుతున్నావ్ రా? నీ బండారం బయట పెడితే అమ్మ నేను ఇంట్లోంచి గెంటేస్తుంది మళ్ళీ గుడి ముందుకు వెళ్లి చేరతావని అంటాడు. ఈ షాప్ కి కచ్చితంగా అమ్మ పేరు పెట్టాలి అని బాలు అంటాడు. మా షాప్ కి మా ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టుకుంటాం నువ్వు ఎవరు రా దీనికి చెప్పడానికే అని మనోజ్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

Nindu Noorella Saavasam Serial Today August 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గణపతి పూజలకు రెడీ చేసిన అమర్‌  

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు చుక్కలు చూపించిన అవని.. అడ్డంగా ఇరుక్కున్న పల్లవి..

Brahmamudi Serial Today August 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: హాస్పిటల్‌ నుంచి ఇంటికి వచ్చిన రాజ్‌ – నిజం చెప్పిన అపర్ణ  

Illu Illalu Pillalu Today Episode: తప్పించుకున్న ప్రేమ.. నర్మద తోడుగా రామరాజు..అయ్యో చందు బుక్కయ్యాడే..

Nindu Manasulu : ‘నిండుమనసులు’ ప్రేరణ ఒక్కరోజుకు ఎంత తీసుకుంటుందో తెలుసా..?

Big Stories

×