BigTV English

OTT Movie : బంగారంలాంటి భార్య ఉండగా మరో అబ్బాయితో… వాడిచ్చే ట్విస్టుకు గుండె గుభేల్… బెస్ట్ సైకలాజికల్ హర్రర్ మూవీ

OTT Movie : బంగారంలాంటి భార్య ఉండగా మరో అబ్బాయితో… వాడిచ్చే ట్విస్టుకు గుండె గుభేల్… బెస్ట్ సైకలాజికల్ హర్రర్ మూవీ

OTT Movie : ఓటీటీలో హాలీవుడ్ సినిమాలను ఫాలో చేసేవాళ్ళు ఎక్కువగానే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా వీటికి ఆదరణ ఉంటుంది. వీటిలో సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాలు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ప్రతి సీన్ టెన్షన్ తో హీట్ పెంచుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక టీనేజ్ పిల్లాడు ఒక డాక్టర్ కుటుంబానికి శాపం పెడతాడు. ఆతరువాత స్టోరీ ఊహించని మలుపులు తీసుకుంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


కథలోకి వెళ్తే

స్టీవెన్ మర్ఫీ ఒక కార్డియోథొరాసిక్ సర్జన్. తన భార్య అన్నా, టీనేజ్ కూతురు కిమ్, చిన్న కొడుకు బాబ్ తో సిన్సినాటిలో రిచ్ లైఫ్ గడుపుతుంటాడు. మార్టిన్ లాంగ్ అనే 16 ఏళ్ల విచిత్రమైన యువకుడితో స్టీవెన్ రహస్యంగా కలుస్తూ ఉంటాడు. అతను స్టీవెన్‌కు గిఫ్ట్‌లు ఇస్తూ, అతని కుటుంబంతో సమయం గడపాలని కోరుకుంటాడు. మార్టిన్ తండ్రి స్టీవెన్ చేసిన ఆపరేషన్‌లో మరణించాడని, అది స్టీవెన్ తప్పిదం కావచ్చని తెలుస్తుంది. స్టీవెన్ మార్టిన్‌ను దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ మార్టిన్ కుటుంబంలో కిమ్‌తో స్నేహం చేస్తాడు. ఒక రోజు బాబ్ అనుమానాస్పదంగా అనారోగ్యానికి గురవుతాడు. అతని కాళ్లు పనిచేయవు, తినలేడు. ఆస్పత్రి పరీక్షలు ఏమీ చూపించవు.


మార్టిన్, స్టీవెన్‌కు ఒక భయంకరమైన హెచ్చరిక ఇస్తాడు. స్టీవెన్ తన తప్పిదానికి పరిహారంగా తన కుటుంబంలో ఒకరిని బలిదానం చేయాలి, లేకపోతే అందరూ మూడు దశల్లో—పక్షవాతం, ఆకలి లేక పోవడం, కళ్ల నుండి రక్తం రావడం — వంటి కారణాలతో మరణిస్తారు. ఇప్పుడు మార్టిన్ హెచ్చరిక నిజమవుతుంది. బాబ్ తర్వాత కిమ్ కూడా అదే లక్షణాలతో బాధపడతారు. ఆస్పత్రిలో చేరతారు. స్టీవెన్, అన్నా మొదట మార్టిన్‌ను పిచ్చివాడిగా భావిస్తారు, కానీ వైద్య పరీక్షలు ఫలితం ఇవ్వకపోవడంతో, మార్టిన్ శాపం నిజమని నమ్మడం ప్రారంభిస్తారు.

ఇప్పుడు స్టీవెన్ కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది. అన్నా స్టీవెన్‌ను చేసిన తప్పుకు నిందిస్తుంది. కిమ్ మార్టిన్‌పై ఆకర్షణతో అతని కోసం ఆస్పత్రి నుండి పారిపోతుంది. బాబ్ భయంతో ఉంటాడు. స్టీవెన్ ఒకరిని బలిదానం చేయాలా ? లేక అందరినీ కోల్పోవాలా? అనే డైలమాలో ఉంటాడు. క్లైమాక్స్‌లో స్టీవెన్ తన కుటుంబాన్ని బేస్‌మెంట్‌లో బంధిస్తాడు. ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంటాడు. అతడు తీసుకున్న నిర్ణయం ఏమిటి ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది. అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి.

ఏ ఓటీటీలో ఉందంటే

‘ది కిల్లింగ్ ఆఫ్ ఎ సాక్రెడ్ డీర్’ (The killing of a sacred deer) 2017లో విడుదలైన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రం. యోర్గోస్ లాంథిమోస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో కోలిన్ ఫారెల్ (స్టీవెన్ మర్ఫీ), నికోల్ కిడ్‌మాన్ (అన్నా మర్ఫీ), బారీ కియోగన్ (మార్టిన్ లాంగ్), రాఫీ కాసిడీ (కిమ్ మర్ఫీ), సన్నీ సుల్జిక్ (బాబ్ మర్ఫీ), అలిసియా సిల్వర్‌స్టోన్ (మార్టిన్ తల్లి) నటించారు. ఈ సినిమా 2017 అక్టోబర్ 20న థియేటర్‌లలో విడుదలై, IMDbలో 7.0/10 రేటింగ్ పొందింది. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలో అందుబాటులోఉంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమా బెస్ట్ స్క్రీన్‌ప్లే అవార్డు గెలుచుకుంది.

Read Also : బట్టలన్నీ విప్పి వీడియోలు… మిస్టరీ అమ్మాయి ఎంట్రీతో మతిపోగోట్టే ట్విస్ట్… మస్ట్ వాచ్ మలయాళ మూవీ

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ 6 తప్పక చూడాల్సిందే మరి..!

OTT Movie : సిస్టర్ వేషం వేసి మరో మహిళ భర్తతో… టబు అరాచకం చూడాల్సిందే భయ్యా… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్

OTT Movie : సినిమా చరిత్రలోనే అత్యంత భయంకరమైన మూవీ… తీసిన డైరెక్టర్ మిస్సింగ్… బేబీ ఫేస్ సైకో కిల్లర్ కిరాతకం

OTT Movie : ఊరిని వల్లకాడుగా మార్చే పిల్లలు… పడుకున్న దెయ్యాన్ని లేపి దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని హర్రర్ మూవీ

OTT Movie : అల్మారాలో దాక్కుని అంతా చూసే అపరిచితుడు… ఫ్యామిలీకి తెలియకుండా ఇంట్లోనే… కిక్కిచ్చే క్రైమ్ డ్రామా

Big Stories

×